బాలయ్య మాస్ డైలాగ్ రజనీకాంత్ నోటి వెంట వస్తే, ఆ మజానే వేరు. తాజాగా బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్‌లను రజనీకాంత్ చెప్పారు. బాలయ్య అభిమానుల మనసులను దోచుకున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే?
రజనీకాంత్ నోట బాలయ్య డైలాగ్
బాలకృష్ణ అంటే మాస్ డైలాగ్‌లకు కేరాఫ్. పవర్‌ఫుల్ డైలాగ్‌లో ఆడియెన్స్ ని ఉర్రూతలూగిస్తారు. ముఖ్యంగా ఆయన సినిమాలే కాదు, ఆయన డైలాగ్‌లు కూడా లార్జన్ దెన్ లైఫ్ అనేలా ఉంటాయి. కానీ వాటిని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అలా టాలీవుడ్‌లో బాలయ్య డైలాగ్‌లు చాలా ఫేమస్. ఇప్పటికీ అవి మీమ్స్ రూపంలో వినిపిస్తూనే ఉంటాయి. అయితే బాలయ్య డైలాగ్ లు ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ నోటి వెంట రావడం విశేషం.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బాలకృష్ణ పేరు
బాలకృష్ణ చిత్ర పరిశ్రమలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా యూకేకి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి బాలయ్య పేరు చేరింది. గోల్డ్ ఎడిషన్ లో ఆయనకు గుర్తింపు దక్కింది. దీనికి సంబంధించిన ప్రశంస పత్రాన్ని అందజేసే కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి నారా లోకేష్, సీనియర్ నటి జయసుధ, అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్, అలాగే రజనీకాంత్.. బాలయ్యకి తమ అభినందనలు పంపించారు. నిజానికి ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా అమితాబ్ బచ్చన్ హాజరు కావాల్సింది. కానీ `కౌన్ బనేగా కరోడ్ పతి` ప్రోగ్రామ్ వల్ల రాలేకపోతున్నట్టు తెలిపారు బిగ్ బీ. తన అభినందనలు తెలిపారు.
`కత్తితో కాదురా, కంటిచూపుతో చంపేస్తా`ః రజనీకాంత్
మరోవైపు రజనీకాంత్.. బాలయ్య కోసం ప్రత్యేకమైన వీడియోని పంపించారు. ఇందులో బాలయ్య డైలాగ్‌లతో రచ్చ చేశారు రజనీకాంత్. బాలయ్య సినిమాల్లోని డైలాగ్‌లతో స్టార్ట్ చేశారు. ``ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు.. కత్తితో కాదురా, కంటి చూపుతో చంపేస్తా`.. ఇలాంటి పంచ్ డైలాగ్‌లు బాలయ్య చెబితేనే బాగుంటుంది, వేరెవరు చెప్పినా అంతగా పండవు. బాలయ్య అంటేనే పాజిటివిటీ. నెగటివిటీ ఆయన వద్ద ఎంత మాత్రం కూడా ఉండదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం, నవ్వులే ఉంటాయి. ఆయనకు పోటీ ఆయనే, వేరెవ్వరూ లేరు. బాలయ్య సినిమా బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులే కాదు, అందరి ఆర్టిస్ట్ ల అభిమానులు సంతోషంగా ఉంటారు. చూసి ఎంజాయ్ చేస్తారు. బాలయ్య సినిమా ఇండస్ట్రీలో యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. ఆయనకు నా అభినందనలు తెలియజేస్తున్నా. ఇలానే సంతోషంగా ఉంటూ, చుట్టూ పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఇండస్ట్రీలో 75ఏళ్లు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ లవ్ యూ బాలయ్య` అని తెలిపారు రజనీకాంత్. ఈ మేరకు వీడియో పంపించగా, ఇది వైరల్ అవుతుంది.
`కూలీ`తో సందడి చేసిన రజనీకాంత్
రజనీకాంత్ ఇటీవల `కూలీ` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతి హాసన్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకుడు. ఈ మూవీ ఆగస్ట్ 14న విడుదలై ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.500కోట్లు వసూలు చేసింది. కానీ హిట్ కాలేకపోయింది. మరోవైపు తాజాగా రజనీకాంత్ `జైలర్ 2`లో నటిస్తున్నారు. ఇందులో బాలయ్య గెస్ట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
