అక్కడ రాజమౌళికి వంద ఎకరాల ఫార్మ్ హౌస్, స్టార్ డైరెక్టర్ రహస్యాలు బట్టబయలు
దర్శకుడు రాజమౌళికి ఒక గ్రామం అంటే చాలా ఇష్టం. ఆ ఊరిలో వంద ఎకరాల ఫార్మ్ హౌస్ ఆయనకు ఉంది. ఇంతకీ రాజమౌళికి ఆ ఊరు అంటే ఎందుకంత ఇష్టం. అక్కడ ఎవరున్నారు?
దర్శకుడు రాజమౌళి రిచెస్ట్ దర్శకుల్లో ఒకరు. ఆయన సినిమాకు వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. రాజమౌళి దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడు. ఆయనతో మూవీ చేసే ఛాన్స్ కోసం ప్రతి హీరో ఎదురు చూస్తారు.
అలాగే తన సినిమాకు సంబంధించి ఆయన డిక్టేటర్. ప్రతి నిర్ణయం ఆయనే తీసుకుంటారు. వందల కోట్లు ఖర్చు చేసే నిర్మాత కూడా ఆయన మాట వినాల్సిందే. కేవలం దర్శకత్వ శాఖకే పరిమితం కారు. మంచి సినిమా అందించడం కోసం వివిధ క్రాప్ట్స్ ని పర్యవేక్షిస్తూ ఉంటారు. సినిమా బిజినెస్ వ్యవహారాలు కూడా ఆయన కనుసన్నల్లో నడుస్తూ ఉంటాయి.
రాజమౌళి గొప్ప మార్కెటింగ్ ఎక్స్పర్ట్ కూడాను. తన సినిమాను ఎలా జనాల్లోకి తీసుకెళాల్లో ఆయనకు బాగా తెలుసు. సినిమా ప్రారంభం నుండే ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక విడుదలకు ముందు చాలా బిజీ అవుతారు. పలు రాష్ట్రాలు తిరుగుతారు. అనేక భాషల మీడియా సంస్థలతో ఇంటరాక్ట్ అవుతారు. రాజమౌళి ప్రమోషనల్ స్ట్రాటజీస్ మీద అధ్యయనాలు కూడా జరిగాయి.
rajamouli
ఈ మధ్య యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు. బ్రాండ్ అంబాసిడర్ గా సైతం వ్యవహరిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారు. అయితే రాజమౌళికి పరిశ్రమలో ఓ చెడ్డ పేరుంది. అందరూ ఆయన్ని పిసినారి అంటారు. రాజమౌళికి మిగతా దర్శకుల వలె ఇతర వ్యాపకాలు ఉండవు. ఆయన ఆల్కహాల్ కూడా సేవించరు అని సమాచారం. సంపాదించిన ప్రతి రూపాయిని మదుపు చేస్తారు. అప్పుడప్పుడు నిర్మాతగా చిన్న చిత్రాలు నిర్మిస్తారు.
కరోనా సమయంలో హీరోలు, దర్శకుడు, నిర్మాతలు భారీగా విరాళాలు ఇచ్చారు. రాజమౌళి చాలా తక్కువ మొత్తం ఇచ్చారు. ఆయన స్థాయికి అది చాలా కొద్ది దానం అనే వాదన వినిపించింది. ఆ అమౌంట్ కూడా ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య ఇచ్చాడనే ప్రచారం జరిగింది. అయితే ప్రచారం అవుతున్నట్లు రాజమౌళి అంత పిసినారి కాదు. ఆయన సామాజిక సేవ చేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది.
ముఖ్యంగా ఓ గ్రామం అంటే రాజమౌళి చాలా ఇష్టం అట. అక్కడ రాజమౌళికి వంద ఎకరాల ఫార్మ్ హౌస్ ఉందట. నల్గొండ జిల్లా, కట్టంగూరు మండలం పరిధిలో ఈదులూరు అనే గ్రామంలో రాజమౌళికి వంద ఎకరాల ఫార్మ్ హౌస్ ఉందట. ఆ ఊరిలో రాజమౌళి అత్తయ్య రాధమ్మ ఉంటారట. సదరు గ్రామానికి రాజమౌళి అనేక మౌలిక సదుపాయాలు కల్పించాడట.
ఓ ప్రముఖ మీడియా ఈ మేరకు కథనం ప్రచురించింది. ఆ ఊరి ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మించాడట. క్లాస్ రూమ్స్ లేకపోవడంతో నిర్మించాడట. నిరుద్యోగుల కోసం ఒక లైబ్రరీ ఏర్పాటు చేశాడట. అలాగే కామినేని హాస్పిటల్స్ నేతృత్వంలో తరచుగా హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తారట. ఈ విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కాబట్టి రాజమౌళిలో మనకు తెలియని కోణం మరొకటి ఉంది.
Rajamouli and Mahesh Babu
ప్రస్తుతం ఆయన ఎస్ఎస్ఎంబి 29కి సిద్ధం అవుతున్నారు. మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం. ఇది పాన్ వరల్డ్ మూవీగా ఉంటుందట. అందుకే యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్నారు.
స్క్రిప్ట్ పూర్తి చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.2025 జనవరి నుండి మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటులు పని చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్ సరికొత్తగా ఉండనుంది. మహేష్ బాబు లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి