20 కోట్లతో భారీ భవనాన్ని కొన్న ప్రశాంత్ వర్మ..నందమూరి మోక్షజ్ఞ కోసం దిమ్మతిరిగే స్కెచ్, కలలో కూడా ఊహించలేం
వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. హను మాన్ చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు. హనుమాన్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. హను మాన్ చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు. హనుమాన్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హను మాన్ చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దానికి సీక్వెల్ గా జై హను మాన్ అనౌన్స్ చేశారు.
సూపర్ హీరో చిత్రాలని భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించగల దర్శకుడిగా ప్రశాంత్ వర్మకి క్రేజ్ ఏర్పడింది. ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తో ఒక చిత్రం చేయాల్సింది. కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ఇంతలో మరో అద్భుతమైన అవకాశం ప్రశాంత్ వర్మని వరించింది. అదేంటంటే బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞని లాంచ్ చేసే చిత్రం ప్రశాంత్ వర్మ చేతుల్లోకి వచ్చింది.
తాజాగా ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ చిత్రం గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ప్రశాంత్ వర్మ 20 కోట్లతో భారీ భవనాన్ని కొనుగోలు చేశారట. ప్రశాంత్ వర్మ ఈ భవనాన్ని తన ఆఫీస్ గా మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ భవనం ఎవరిదో కాదు. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నుంచే ప్రశాంత్ వర్మ 20 కోట్లు పెట్టి కొన్నారట. డైరెక్టర్ ఆఫీస్ కోసం అంత పెద్ద భవనం ఎందుకు ? అదికూడా కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనే అనుమానం రావచ్చు.
Mokshagna
ప్రశాంత్ వర్మ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం మేరకు జై హను మాన్, మోక్షజ్ఞ డెబ్యూ మూవీ భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రాలు. మోక్షజ్ఞ చిత్రం అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండబోతోందట. ఈ చిత్రానికి సంబంధించిన ప్లానింగ్, స్క్రిప్ట్ వర్క్, సిజి వర్క్.. అదే విధంగా జై హను మాన్ చిత్రానికి సంబంధించిన వర్క్ కూడా ఇక్కడే జరగనుందట.
దీనితో ప్రశాంత్ వర్మ ఈ మాత్రం భవనం అవసరం అని భావించారు. ఈ భవనంలో మొత్తం తన టీం ఉండేలా ప్రశాంత్ వర్మ జాగ్రత్తలు తీసుకోనున్నారు. మోక్షజ్ఞ మూవీ ప్లానింగ్ కోసమే ప్రశాంత్ వర్మ ఈ రేంజ్ లో సెటప్ రెడీ చేసుకుంటుంటే.. ఇక సినిమా ఎలా ఉండబోతోంది అనే ఆలోచనే అంచనాలు పెంచేస్తోంది. మొత్తంగా ప్రశాంత్ వర్మ కలలో కూడా ఊహించలేని భారీ స్కెచ్ వేస్తున్నారు.