MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'డెవిల్' నా సినిమానే, కేవలం ఇగో వల్లే తొలగించారు.. బహిరంగ లేఖతో డైరెక్టర్ నవీన్ మేడారం సంచలనం 

'డెవిల్' నా సినిమానే, కేవలం ఇగో వల్లే తొలగించారు.. బహిరంగ లేఖతో డైరెక్టర్ నవీన్ మేడారం సంచలనం 

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్ చిత్రం మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 29న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. బ్రిటిష్ కాలంలో సాగే పీరియాడిక్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 27 2023, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్ చిత్రం మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 29న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. బ్రిటిష్ కాలంలో సాగే పీరియాడిక్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యే సమయానికి వివాదం తెరపైకి వచ్చింది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

టైటిల్ కార్డ్స్, పోస్టర్స్ లో దర్శకుడు నవీన్ పేరు మాయమైపోయింది. నిర్మాత అభిషేక్ నామానే దర్శకుడిగా తన పేరు వేసుకున్నారు. చిత్రీకరణ సమయంలో నవీన్ కి, అభిషేక్ నామా కి మధ్య జరిగిన గొడవలే దీనికి కారణం అని తెలుస్తోంది. రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ నవీన్ ని పూర్తిగా ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలలో ఎక్కడా నవీన్ కనిపించలేదు. 

37

అభిషేక్ దర్శకుడిగా ఈ చిత్రాన్ని టేకోవర్ చేసుకుని ముందుకు వచ్చారు. అయితే తెరవెనుక ఏం జరిగింది.. అభిషేక్, నవీన్ మధ్య గొడవలకు కారణాలు ఏంటి అనే ప్రశ్నలకు పూర్తిగా సమాధానం లభించడం లేదు. అయితే రిలీజ్ కి రెండు రోజులే సమయం ఉన్న తరుణంలో దర్శకుడు నవీన్ మేడారం బహిరంగ లేఖతో సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనితో రిలీజ్ కి ముందు డెవిల్ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 

47

నవీన్ తన బహిరంగ లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు. డెవిల్ చిత్రాన్ని తీర్చి దిద్దడానికి నేను మూడేళ్లకు పైగా కష్టపడ్డాను. మొదట కాన్సెప్ట్ ఆ తర్వాత స్క్రిప్ట్, కాస్ట్యూమ్స్ ఎంపిక చేసుకోవడం, లొకేషన్స్, సెట్స్ ఇలా ప్రతి అంశంలో నా ప్రమేయం ఉంది. డెవిల్ చిత్రాన్ని మొత్తం నేను 105 రోజుల పాటు వైజాగ్, కరైకుడి, హైదరాబాద్ లాంటి లొకేషన్స్ లో చిత్రీకరించాను. కేవలం చిన్న ప్యాచ్ వర్క్ మాత్రం నేను చేయలేదు. డెవిల్ పూర్తిగా నా క్రియేషన్. 

57

నాకు డెవిల్ కేవలం ఒక ప్రాజెక్టు కాదు.. అది నా బేబీతో సమానం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డెవిల్ చిత్రం నవీన్ మేడారం అనే పేరుగల నా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. ఇన్ని రోజులపాటు నేను ఓపికతో సైలెంట్ గా ఉన్నాను. నా మౌనాన్ని కొందరు చేతకాని తనంగా భావించారు. ఇప్పుడు చెబుతున్నా డెవిల్ చిత్రం తెరకెక్కించే సమయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. 

67

ఈ రోజు నేను ఎదురుకొంటున్న ఈ సమస్య, వివాదం కేవలం కొందరు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఇగో వల్లే వచ్చింది. అయితే నేను ఎవరి మీదా ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవడం లేదు. ఏది ఏమైనా నేను సృష్టించి చిత్రీకరించిన డెవిల్ చిత్రానికి డైరెక్టర్ గా నాకు క్రెడిట్స్ ఇవ్వడకపోవడం చాలా బాధగా ఉంది. కానీ డెవిల్ చిత్రం వల్ల నాకు వచ్చిన అనుభవం, ప్రతిభ, కాన్ఫిడెన్స్ నాతోనే ఉంటాయి. 

77

ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం నా కెరీర్ పైనే ఉంటుంది. తిరిగి స్ట్రాంగ్ గా కం బ్యాక్ అవుతా. ఈ చిత్రం కోసం తన 100 శాతం డెడికేషన్ చూపించిన కళ్యాణ్ రామ్ సర్ కి నా కృతజ్ఞతలు. నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. డెవిల్ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. డిసెంబర్ 29న ప్రతి ఒక్కరూ డెవిల్ చిత్రాన్ని థియేటర్స్ లో చూడండి. ప్రస్తుతం నేను ఒక కొత్త చిత్రానికి సైన్ చేశాను. త్వరలో ఆ వివరాలతో మీ ముందుకు వస్తా.. థాంక్యూ అంటూ నవీన్ మేడారం ఎమోషనల్ లెటర్ రాశారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image2
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Recommended image3
Manchu Manoj: ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ సెటైర్లు.. తనకు అలా న్యాయం జరిగిందంటూ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved