MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Meher Ramesh: ఎన్టీఆర్ 'శక్తి' మూవీ ఫ్లాప్‌కు కారణం అదే.. యాక్షన్ సినిమా అనుకుంటే.! మెహర్ రమేష్

Meher Ramesh: ఎన్టీఆర్ 'శక్తి' మూవీ ఫ్లాప్‌కు కారణం అదే.. యాక్షన్ సినిమా అనుకుంటే.! మెహర్ రమేష్

Meher Ramesh: దర్శకుడు మెహర్ రమేష్ ఎన్టీఆర్ 'శక్తి' సినిమా ఎందుకు ప్లాప్ అయిందో వివరిస్తూ, అసలు కథ నుంచి సోషియో ఫ్యాంటసీకి మారడమే ప్రధాన కారణం అని పేర్కొన్నారు. ఆయన పంచుకున్న మరిన్ని విశేషాలు ఇక్కడ తెలుసుకోండి. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 29 2026, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
'శక్తి' సినిమా వెనుక అసలు కథ..
Image Credit : Pinterest

'శక్తి' సినిమా వెనుక అసలు కథ..

కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న మెహర్ రమేష్.. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో పనిచేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన 'శక్తి' సినిమా ఎందుకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదో వివరించారు. మెహర్ రమేష్ తన సినీ ప్రస్థానాన్ని పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించారు. పూరి నమ్మకంతో కన్నడలో 'వీర కన్నడిగ' చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే పునీత్ రాజ్‌కుమార్‌తో విడదీయలేని అనుబంధం ఏర్పడిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎన్టీఆర్ 'కంత్రి' ఒక విజయం
Image Credit : our own

ఎన్టీఆర్ 'కంత్రి' ఒక విజయం

ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన 'కంత్రి' సినిమా ఫలితంపై ఆయన స్పందిస్తూ.. అది ఒక హిట్ చిత్రం అని పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌కు మంచి ఆదరణ లభించిందని, ఆర్థికంగా అశ్వినిదత్‌కి అది లాభసాటి ప్రాజెక్ట్ అని వెల్లడించారు.

35
'శక్తి' సినిమా తారుమారైన వైనం
Image Credit : our own

'శక్తి' సినిమా తారుమారైన వైనం

'శక్తి' సినిమా గురించి మాట్లాడుతూ.. మొదట తాను ఎన్టీఆర్‌తో ఒక పక్కా యాక్షన్ సినిమా(మిషన్ ఇంపాజిబుల్ తరహాలో) తీయాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే నిర్మాత అశ్వినిదత్ అభిరుచి మేరకు ఆ కథలోకి డివోషనల్, సోషియో ఫ్యాంటసీ అంశాలు వచ్చి చేరాయి. ఎండమూరి వీరేంద్రనాథ్, జె.కె. భారవి లాంటి దిగ్గజ రచయితల ప్రమేయంతో కథా గమనం మారిపోయిందని ఆయన వివరించారు.

45
ఎఫర్ట్ ఉన్నా కనెక్ట్ అవ్వని కథ
Image Credit : our own

ఎఫర్ట్ ఉన్నా కనెక్ట్ అవ్వని కథ

ప్రొడక్షన్ వాల్యూస్, సాంగ్స్, ఎన్టీఆర్ కష్టానికి ఎక్కడా లోటు లేకపోయినా, కథ జనాలకు కనెక్ట్ కాలేదని మెహర్ రమేష్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఎన్టీఆర్ తన కష్టాన్ని గుర్తించారని, సినిమా ఫలితం ఎలా ఉన్నా తన పక్కనే నిలబడ్డారని ఆయన ఎన్టీఆర్ మెచ్యూరిటీని కొనియాడారు.

55
మళ్లీ కథే కీలకం
Image Credit : our own

మళ్లీ కథే కీలకం

సినిమా విజయానికి హీరో ఇమేజ్ కంటే కథే ముఖ్యం అని, పూరి జగన్నాథ్ 'ఆంధ్రావాలా'తో ప్లాప్ చూసినా మళ్ళీ 'టెంపర్'తో ఎన్టీఆర్‌కు భారీ హిట్ ఇచ్చారని గుర్తు చేశారు. తన తదుపరి చిత్రాల్లో కూడా బలమైన కథలకే ప్రాధాన్యం ఇస్తానని మెహర్ రమేష్ స్పష్టం చేశారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image2
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Recommended image3
ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Related Stories
Recommended image1
Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? టాలీవుడ్‌లోనే అదొక సంచలనం
Recommended image2
Chiranjeevi ముందు బ్రహ్మానందం కనిపించరు.. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved