MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వెండితెరపై దొరబాబు అద్భుతాలు చూడాల్సిందే, చిరంజీవి టాప్ 3 మూవీస్ లో ఇది కూడా.. వామ్మో ఆ కాన్ఫిడెన్స్ ఏంటి 

వెండితెరపై దొరబాబు అద్భుతాలు చూడాల్సిందే, చిరంజీవి టాప్ 3 మూవీస్ లో ఇది కూడా.. వామ్మో ఆ కాన్ఫిడెన్స్ ఏంటి 

భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం విశ్వంభర. ఈ చిత్రంలో చిరంజీవి దొరబాబు అనే పాత్రలో నటిస్తున్నాడు. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 05 2024, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం విశ్వంభర. ఈ చిత్రంలో చిరంజీవి దొరబాబు అనే పాత్రలో నటిస్తున్నాడు. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార చిత్రంలో జానపద కథని వశిష్ఠ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. రొటీన్ కి భిన్నంగా ఉండడంతో ఆడియన్స్ ఆ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. 

26
Vishwambhara

Vishwambhara

ఇప్పుడు విశ్వంభర చిత్రం తెరకెక్కుతున్న విధానం చూస్తుంటే జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్ర వైబ్స్ వస్తున్నాయి అని అంటున్నారు. తాజాగా వశిష్ఠ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర రిఫరెన్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కానీ ఆ చిత్రానికి విశ్వంభరకి సంబంధం లేదు. 

36
Vishwambhara

Vishwambhara

చిరంజీవి ఒక వైవిధ్యమైన చిత్రం చేసి చాలా రోజులు అవుతోంది. అలాగని సందేశాత్మక చిత్రం కాదు. కథ గమ్మత్తుగా ఉంటుంది. మర్వెల్ చిత్రాల తరహాలో స్టోరీ రూపొందించాం. చిరంజీవి టాప్ 3 చిత్రాలు తీసుకుంటే అందులో విశ్వంభర ఉంటుందని వశిష్ఠ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. 

46

విజువల్స్, యాక్షన్స్ సీన్స్, సెట్లు అన్నీ భారీగా ఉంటాయని వశిష్ఠ చెబుతున్నాడు. వశిష్ఠ చెప్పిన ఈ మాటలు మెగా అభిమానులని కుదురుగా ఉండనీయడంలేదు. విశ్వంభర చిత్రం సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. 

56

కాన్సెప్ట్ టీజర్ చూసినప్పుడు ఈ చిత్రం విశ్వం మొత్తానికి రిలేట్ అయి ఉందని హింట్ ఇచ్చారు. మరి సామాన్యుడైన దొరబాబు ఎలాంటి అద్భుతాలు చేసాడో తెలుసుకోవాలంటే విశ్వంభర రిలీజ్ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే. 

66

డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రం గురించి ఇంతలా చెబుతుంటే.. ఆ కాన్ఫిడెన్స్ ఏంటి బాబోయ్ అని అంతా ఆశ్చర్యపోతున్నారు. విశ్వంభర చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గరు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
Recommended image3
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved