- Home
- Entertainment
- సిల్క్ స్మిత దగ్గర పనిచేసి..స్టార్ డైరెక్టర్ అయ్యాక ఆమె ముందే సిగరెట్ కాల్చుతూ, కారు ఆపి ఏం చేసిందంటే
సిల్క్ స్మిత దగ్గర పనిచేసి..స్టార్ డైరెక్టర్ అయ్యాక ఆమె ముందే సిగరెట్ కాల్చుతూ, కారు ఆపి ఏం చేసిందంటే
టాలీవుడ్ అందించిన అద్భుతమైన దర్శకులలో కృష్ణ వంశీ ఒకరు. మూస పద్దతిలో సినిమాలు చేయడం ఈయనకి తెలియదు. కుటుంబ బంధాలు విలువలకు ప్రాధాన్యత ఇస్తూనే అనేక వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించారు.

టాలీవుడ్ అందించిన అద్భుతమైన దర్శకులలో కృష్ణ వంశీ ఒకరు. మూస పద్దతిలో సినిమాలు చేయడం ఈయనకి తెలియదు. కుటుంబ బంధాలు విలువలకు ప్రాధాన్యత ఇస్తూనే అనేక వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించారు. డైరెక్టర్ కావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. చాలా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తర్వాత గులాబీ చిత్రంతో 1995లో డైరెక్టర్ గా మారారు.
కృష్ణవంశీని చాలా మంది సినీ ప్రముఖులు అభిమానిస్తారు. ఇక కృష్ణ వంశీ అభిమానించే వారిలో సిల్క్ స్మిత ఒకరు. ఆమె అంటే కృష్ణ వంశీకి ఎంతో గౌరవం. కొంతకాలం పాటు కృష్ణ వంశీకి ఆమె ఉపాధి కల్పించారు. సిల్క్ స్మిత చిత్ర పరిశ్రమలో ఒక విషాద గాధ. కానీ ఆమె ఎంతో మందికి సహాయం చేసిందట.
తాను చిత్ర పరిశ్రమలో రాణించాలని ఎక్కడ షూటింగ్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళేవాడిని. పరిచయాలు పెంచుకునే వాడిని. ఆ విధంగా షూటింగ్స్ కి వెళ్లి వాళ్ళు చెప్పే పని చేసేవాడిని. నేను యాక్టివ్ గా ఉండడం అంతా గమనించారు. అలా పరిచయమైన ఒక వ్యక్తి నన్ను త్రిపురనేని వరప్రసాద రావు దగ్గరకి తీసుకెళ్లారు. అదే సమయంలో ఆయన సిల్క్ స్మితతో సినిమా చేస్తున్నారు.
ఆ షూటింగ్ లో నేను యాక్టివ్ గా పనిచేయడం సిల్క్ స్మిత గారు చూశారు. ఆ తర్వాత సిల్క్ స్మిత గారు తన సొంత నిర్మాణంలో సినిమా నిర్మించారు. అది వీరవిహారం అనే సినిమా. నన్ను ఆమె తన ప్రొడక్షన్ లో చేర్చుకున్నారు. కొన్ని నెలల పాటు ఆ ప్రొడక్షన్ లోనే వర్క్ చేశా. ఆ విధంగా సిల్క్ స్మిత గారితో మంచి అనుబంధం ఏర్పడింది.
ఆమె అందరిని సమానంగా చూసే వ్యక్తిత్వం. కొంతకాలానికి నాకు దర్శకుడిగా అవకాశం వచ్చింది, గులాబీ చిత్రం తెరక్కించా. సినిమా రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. నాకు మంచి పేరు వచ్చింది. ఒక రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో సిగరెట్ కాల్చుతూ నిలుచున్నా. నా ముందే ఒక కారు వెళ్ళింది. అందులో ఎవరున్నారో నేను గమనించలేదు.
వెంటనే కారు వెనక్కి వచ్చి నా ముందు ఆగింది. కొంపదీసి ఏఎన్నార్ గారు వచ్చారేమో అని సిగరెట్ కింద పడేశా. కారు అద్దం కిందకి దిగింది. చూస్తే అందులో సిల్క్ స్మిత ఉన్నారు. ఇలా రా అని పిలిచారు. నేను బిక్కి బిక్కుమంటూ వెళ్ళాను. నా తడబాటు చూసి ఏంటి నన్ను గుర్తు పట్టలేదా అని అడిగారు. నేను మిమ్మల్ని గుర్తు పట్టకపోవడం ఏంటమ్మా ? మీకు నేను గుర్తున్నానో లేదో అని ఆలోచిస్తున్నా అని చెప్పా.
silk smitha
నేను తీసిన గులాబీ చిత్రం గురించి ఆమెకి తెలిసిపోయింది. సినిమా నేను చూశా. చాలా అద్భుతంగా తీశావ్ అని శుభాకాంక్షలు తెలిపినట్లు కృష్ణ వంశీ గుర్తు చేసుకున్నారు. తన దగ్గర పనిచేసే డ్రైవర్ అయినా, మేకప్ మెన్ అయినా ఆమె సొంత మనిషి లాగే చూసుకునేవారు అని కృష్ణ వంశీ తెలిపారు.