- Home
- Entertainment
- Jr NTR: ఆ సాహసం చేయగలిగేది కమల్ హాసన్ తర్వాత ఎన్టీఆర్ ఒక్కడే.. ప్రశంసల వర్షం కురిపించిన డైరెక్టర్
Jr NTR: ఆ సాహసం చేయగలిగేది కమల్ హాసన్ తర్వాత ఎన్టీఆర్ ఒక్కడే.. ప్రశంసల వర్షం కురిపించిన డైరెక్టర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతటి అద్భుతమైన నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఎన్టీఆర్ ఒదిగిపోయి నటిస్తాడు. అందుకే చాలా మంది దర్శకులు ఎన్టీఆర్ తో వర్క్ చేసేందుకు ఇష్టపడుతుంటారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతటి అద్భుతమైన నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఎన్టీఆర్ ఒదిగిపోయి నటిస్తాడు. అందుకే చాలా మంది దర్శకులు ఎన్టీఆర్ తో వర్క్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం తనకు ఇష్టమైన నటుడు ఎన్టీఆర్ అని చెప్పాడంటే.. అతడి నటనా ప్రతిభని అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుత జనరేషన్ లో నవరసాలు పలికించగల అతి కొద్దిమంది నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ చివరగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీం పాత్రకు ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా కొమురం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ నభూతో నభవిష్యతి అన్నట్లుగా నట విశ్వరూపం ప్రదర్శించాడు.
rrr movie review,
తాజాగా దర్శకుడు కన్మణి ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. కన్మణి తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడిగా గుర్తింపు పొందారు. తెలుగులో కన్మణి.. నా ఊపిరి, బీరువా, చిన్నోడు లాంటి చిత్రాలని తెరకెక్కించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ని కమల్ హాసన్ తో పోల్చారు కన్మణి.
rrr movie first review,
కన్మణి మాట్లాడుతూ.. నాకు వ్యక్తిగతంగా తారక్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్న హీరోల్లో కమల్ హాసన్ తర్వాత పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ మాత్రమే అని కన్మణి అన్నారు. కమల్ హాసన్, ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవ్వరికి సాధ్యం అని ఓ ప్రతిభ ఉంది.
క్లోజప్ షాట్స్ లో ఏడ్చే సన్నివేశంలో నటించేందుకు ఏ హీరో సాహసం చేయరు. ఒక వేళ నటించినా అందులో సోల్ ఉండదు. సహజత్వం ఉండదు. కానీ కమల్ హాసన్, ఎన్టీఆర్ ఇద్దరూ క్లోజప్ షాట్స్ లో ఏడ్చే సన్నివేశంలో అద్భుతంగా నటించగలరు. వాళ్లిద్దరూ అలాంటి సన్నివేశాల్లో అద్భుతంగా నటిస్తారు అని కన్మణి ప్రశంసలు కురిపించారు.
Kamal Haasan
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎమోషన్స్ పరంగా ఎన్టీఆర్ నటన అద్భుతం అని ప్రశంసించారు. ముఖ్యంగా కొమరం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ పలికించిన హావభావాలు, ఎమోషనల్ పెర్ఫామెన్స్ అతడి నటనకు నిదర్శనం అని కన్మణి అన్నారు.