త్రిష పెళ్లి వల్లే కొంప మునిగింది.. అదే పెద్ద మైనస్ అంటూ డైరెక్టర్ హాట్ కామెంట్స్
ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ టాలీవుడ్ లో అనేక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు తెరకెక్కించారు. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా లాంటి హిట్ చిత్రాలు తెరకెక్కించింది ఆయనే.

ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ టాలీవుడ్ లో అనేక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు తెరకెక్కించారు. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా లాంటి హిట్ చిత్రాలు తెరకెక్కించింది ఆయనే. ఇటీవల జయంత్ సి పరాన్జీ దర్శకుడిగా యాక్టివ్ గా లేరు. చివరగా ఆయన జయదేవ్ అనే డిజాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఆ తర్వాత జయంత్ నుంచి మరో మూవీ రాలేదు. జయంత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు మరో ఫ్లాప్ గా ఈ మూవీ నిలిచింది.
హిందీలో హిట్ అయిన లవ్ ఆజ్ కల్ అనే చిత్రాన్ని రీమేక్ చేశారు. కానీ తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఆ మూవీ వర్కౌట్ కాలేదు. దీనిపై తాజాగా జయంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తీన్ మార్ కథ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీగా భావిస్తాను. కానీ అది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి సెట్ కాలేదు. అలాగే అందులో కొన్ని అంశాలు కూడా నాకు నచ్చలేదు.
ముఖ్యంగా త్రిష సోనూసూద్ ని వివాహం చేసుకోవడం, తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరకి రావడం లాంటివి ఫ్యాన్స్ తో పాటు నాకు కూడా నచ్చని అంశాలు. ముఖ్యంగా త్రిష సోనూసూద్ ని వివాహం చేసుకోవడం వల్లే ఈ చిత్రం నిరాశపరిచిందేమో అని నా ఫీలింగ్ అంటూ జయంత్ ఆసక్తిర వ్యాఖ్యలు చేసారు. ఈ మూవీ ఫెయిల్ కావడానికి ఇంకా చాలా కారణాలు ఉండిఉండొచ్చు అని అన్నారు.
పవన్ కళ్యాణ్ గారి మాస్ ఇమేజ్ కి ఈ ఇలాంటి కథలు సెట్ కావు. కథలో కొంత మార్పులు చేసి అప్పుడున్న లవర్ బాయ్ హీరోస్ తో తీన్ మార్ మూవీ చేసి ఉంటే మరోలా ఉండేది అని జయంత్ సి పరాన్జీ అన్నారు.
పవన్ కళ్యాణ్, కళ్యాణ్ త్రిష, కృతి కర్బంద కలిసి నటించిన తీన్ మార్ మూవీ 2011లో విడుదలై నిరాశపరిచింది. ఈ చిత్ర మ్యూజిక్ మాత్రం ఫ్యాన్స్ కి ఎప్పటికి స్పెషలే. బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత మరోసారి గబ్బర్ సింగ్ నిర్మించగా ఆ మూవీ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.