దిగజారిపోయి చిరంజీవి కాళ్ళు పట్టుకుంటావా, లెజెండ్రీ డైరెక్టర్ ఇంట్లో గొడవ..భావోద్వేగానికి గురైన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో మాస్ చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. చిరంజీవి కేవలం మాస్ యాక్షన్ చిత్రాలకే పరిమితం కాకుండా ఎన్నో కళాత్మక చిత్రాలలో కూడా నటించారు. రుద్రవీణ, స్వయం కృషి, ఆపద్బాంధవుడు లాంటి చిత్రాల్లో చిరంజీవి నటన చిరస్థాయిగా నిలిచిపోతుంది.
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో మాస్ చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. చిరంజీవి కేవలం మాస్ యాక్షన్ చిత్రాలకే పరిమితం కాకుండా ఎన్నో కళాత్మక చిత్రాలలో కూడా నటించారు. రుద్రవీణ, స్వయం కృషి, ఆపద్బాంధవుడు లాంటి చిత్రాల్లో చిరంజీవి నటన చిరస్థాయిగా నిలిచిపోతుంది. చిరంజీవితో సినిమా చేసిన లెజెండ్రీ దర్శకులలో జంధ్యాల ఒకరు.
జంధ్యాల, చిరంజీవి కాంబినేషన్ లో చంటబ్బాయ్ అనే చిత్రం వచ్చింది. ఈ మూవీలో చిరంజీవి కామెడీ టైమింగ్ ని జంధ్యాల బాగా వాడుకున్నారు. ఎన్నో చిత్రాలకు జంధ్యాల డైలాగ్ రచయితగా కూడా పనిచేశారు. చిరంజీవి, కె విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రానికి డైలాగ్స్ రాసింది జంధ్యాల గారే.
ఈ చిత్రంలో స్కూల్ టీచర్ పాత్ర ఒకటి ఉంది. ఈ పాత్రకి ఎవరైతే బావుంటుంది అని అనుకుంటున్న తరుణంలో జంధ్యాల అయితే బావుంటుంది అనిపించిందట. విశ్వనాథ్ ఈ పాత్ర గురించి జంధ్యాలకి చెబితే మీరు చెప్పాలే కానీ నేనెందుకు చేయను అని అన్నారు. ఆ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో జంధ్యాల చిరంజీవి కాళ్ళు పట్టుకునే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఈ సన్నివేశం గురించి జంధ్యాల సతీమణి అన్నపూర్ణ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జంధ్యాల గారు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి ఎన్ని చిరంజీవి చాలా బాధపడినట్లు ఆమె తెలిపారు. ఆ రోజంతా చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. కానీ సినిమా కాబట్టి తప్పలేదు. జంధ్యాల గారు మాత్రం చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ఆ విషయం మా అత్తగారికి తెలిసింది. ఆయన ఇంటికి వచ్చాక పెద్ద గొడవ చేసింది. సినిమాల్లో ఇవన్నీ సహజం అని ఆమెకి తెలియదు. వెళ్లి చిరంజీవి కాళ్ళు పెట్టుకుంటావా, దిగజారుతావా అంటూ తిట్టేసింది.
దీనికితోడు ఆపద్బాంధవుడు చిత్రంలో జంధ్యాల గారి పాత్ర మరణిస్తుంది. చనిపోయే క్యారెక్టర్ ఆయనది. అది కూడా మా అత్తగారికి నచ్చలేదు అంటూ జంధ్యాల సతీమణి సరదాగా తెలిపారు. ఆపద్భాందవుడు చిత్రానికి బెస్ట్ డైలాగ్ రైటర్ గా జంధ్యాలకి నంది అవార్డు వచ్చింది.