- Home
- Entertainment
- నమ్రతని మహేష్ లవ్ మ్యారేజ్ చేసుకోకుంటే ఆ మూవీలో.. కృష్ణ మనసులో మాట బయటపెట్టిన డైరెక్టర్
నమ్రతని మహేష్ లవ్ మ్యారేజ్ చేసుకోకుంటే ఆ మూవీలో.. కృష్ణ మనసులో మాట బయటపెట్టిన డైరెక్టర్
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతని ప్రేమ వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం. వీళ్ళిద్దరూ వంశీ అనే చిత్రంలో నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. కానీ సడెన్ గా పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో కృష్ణ.. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేశాం అని మీడియా కి తెలిపారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతని ప్రేమ వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం. వీళ్ళిద్దరూ వంశీ అనే చిత్రంలో నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. కానీ సడెన్ గా పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో కృష్ణ.. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేశాం అని మీడియా కి తెలిపారు. ప్రస్తుతం మహేష్, నమ్రత అన్యోన్యంగా జీవిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ బాబు లవ్ మ్యారేజ్ గురించి ట్యాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మోహన్ కృష్ణ ఇంద్రగంటి, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వచ్చిన అష్టాచమ్మా చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కలర్స్ స్వాతి మహేష్ బాబు అభిమానిగా నటించింది. స్వాతి పాత్రని మహేష్ బాబు అభిమానిగా పెట్టడానికి గల కారణాన్ని మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణపై.. మహేష్ లవ్ మ్యారేజ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. అష్టా చమ్మా చిత్రంలో మహేష్ బాబు గెస్ట్ రోల్ లో నటించే సన్నివేశాలు కూడా మోహన్ కృష్ణ రాసుకున్నారట. హీరోయిన్ కి మహేష్ బాబు అంటే పిచ్చి. ఎలాగైనా మహేష్ ని కలవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పట్లో థమ్స్ అప్, పెప్సీ లాంటి శీతల పానీయాలు కొంటే లక్కీ డ్రా ద్వారా స్టార్ హీరోలని కలిసే ఛాన్స్ ఉంటుంది.
ఆ విధంగా మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చేలా సీన్స్ రాసుకున్నాను అని మోహన్ కృష్ణ అన్నారు. కానీ మహేష్ బాబుని గెస్ట్ రోల్ లో నటింపజేయడం కుదర్లేదు. ఆయా టైం లో మహేష్ బాబు బాగా ట్రెండింగ్ లో ఉన్నారు. మహేష్ కి లేడి ఫ్యాన్స్ ఎక్కువ. మహేష్ లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో తిరుపతిలో మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఒక అమ్మాయి నానా హంగామా చేసింది.
నన్ను మహేష్ బాబు పెళ్లి చేసుకున్నాడు అంటూ వీధుల్లో రచ్చ చేసింది. అది న్యూస్ లో వచ్చింది. అష్టాచమ్మా షూటింగ్ జరుగుతున్నప్పుడే పోకిరి కూడా రిలీజ్ అయింది. అందుకే మహేష్ బాబు పేరుని మా సినిమాలో బాగా వాడుకున్నాం అని మోహన్ కృష్ణ ఇంద్రగంటి అన్నారు. కృష్ణ గారిని కలసి అష్టాచమ్మా కథ కూడా వినిపించాను.
ఒరిజినల్ కథలో హీరోయిన్ కృష్ణ గారిని ఇంటికి రప్పించుకుంటుంది. మహేష్ బాబుని కలవాలని రిక్వస్ట్ చేస్తుంది. అప్పుడే మహేష్ బాబు లవ్ మ్యారేజ్ కావడంతో.. అమ్మా ఈ టైం లో కుదరదు. ఆంధ్రదేశం మొత్తం అట్టుడిగిపోతోంది అమ్మాయిలంతా గొడవ చేస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ వల్ల కావడం లేదు అని కృష్ణ తన మనసులో మాట బయట పెట్టినట్లు కొన్ని సన్నివేశాలు రాసుకున్నానని ఇంద్రగంటి అన్నారు.
ఆ సీన్స్ లో నటించమని కృష్ణ గారిని అడిగితే.. నేను లేకుండానే ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది. నేను నటిస్తే ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు అని చెప్పారు. నమ్రత, మహేష్ లవ్ మ్యారేజ్ హంగామా లేకుంటే మహేష్ ని గెస్ట్ రోల్ లో నటింపజేయడానికి రిక్వస్ట్ చేసేవాడిని అని ఇంద్రగంటి అన్నారు. మహేష్ మాత్రం గెస్ట్ రోల్ లో చేసి ఉంటే మూవీ ఇంకా అదిరిపోయేది అన్నారు.