త్రివిక్రమ్, రానా సిగ్గుపడాలి... హిరణ్యకశ్యప రేపిన మంట, గుణశేఖర్ ట్వీట్ తో!
హీరో రానా హిరణ్యకశ్యప టైటిల్ తో భారీ పౌరాణిక చిత్రం ప్రకటించారు. ఇది దర్శకుడు గుణశేఖర్ గుండెల్లో మంటరేపింది. ఆయన పరోక్షంగా రానా నైతికతను ప్రశ్నించారు.

Hiranyakashyap
దర్శకుడు గుణశేఖర్ సీనియర్ డైరెక్టర్స్ లో ఒకరు. నేషనల్ అవార్డు విన్నర్. ఒక్కడు వంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా చూశారు. ఆచి తూచి సినిమాలు చేసే గుణశేఖర్ ముప్పై ఏళ్ల కెరీర్లో చేసిన సినిమాలు తక్కువే. గుణశేఖర్ అంటే భారీ సెట్స్ కి ఫేమస్. ఒక్కడులో చార్మినార్ సెట్, అర్జున్ మూవీలో మధుర మీనాక్షి టెంపుల్ సెట్ గురించి జనాలు గొప్పగా చెప్పుకున్నారు.
పూర్వవైభవం గుణశేఖర్ కి లేదు. ఆయన కమర్షియల్ హిట్ ఇచ్చి చాలా కాలం అవుతుంది. రుద్రమదేవి హిట్ అంటారు కానీ, ప్రేక్షకుల మదిలో గట్టి ముద్ర వేయలేకపోయింది. రుద్రమదేవి క్లీన్ హిట్ అయితే గుణశేఖర్ కి స్టార్స్ ఆఫర్స్ ఇచ్చేవారు. ఇక శాకుంతలం మూవీతో ఉన్న కొద్దో గొప్ప ఇమేజ్ కూడా పోగొట్టుకున్నారు. గుణశేఖర్ పనైపోయిందని జనాలు ఫిక్స్ అయ్యారు.
శాకుంతలం చిత్రాన్ని సీరియల్ గా అభివర్ణించారు. నిర్మాత దిల్ రాజు ఇది నాకు భారీ దెబ్బ అని ఓపెన్ గా ఇంటర్వ్యూలో చెప్పారు. సాయంత్రానికి థియేటర్స్ నుండి సినిమా ఎత్తేసే పరిస్థితి. రూ. 60-70 కోట్లు ఖర్చు చేసి తీస్తే... పది కోట్ల షేర్ కూడా రాలేదు. సమంత కెరీర్లో ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది.
ఇక గుణశేఖర్ ని నమ్మి ఎవరైనా సినిమాలు ఇస్తారా అంటే కష్టమే అయితే గుణశేఖర్ 2019లోనే ఒక భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. దాని పేరు హిరణ్యకశ్యప. రానా హీరోగా పౌరాణిక గాథ రూపొందనుందని ప్రకటించారు. ఏళ్ల తరబడి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు. హిరణ్యకశ్యప గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా కొంత ఖర్చు చేసి ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు.
Hiranyakashyap
ప్రాజెక్ట్ ఆలస్యమయ్యేలా ఉండటంతో శాకుంతలం మూవీ స్టార్ట్ చేశారు. శాకుంతలం రిజల్ట్ చూసి హిరణ్యకశ్యప ఇక లేనట్లే అని జనాలు ఫిక్స్ అయ్యారు. సడన్ గా నిన్న రానా హిరణ్య కశ్యప ప్రాజెక్ట్ ప్రకటించారు. అయితే గుణశేఖర్ పేరు లేదు. త్రివిక్రమ్ కథ అందిస్తున్నట్లు ప్రకటనలో తెలియజేశారు. గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ దర్శకుడు కాదని చెప్పకనే చెప్పారు.
Hiranyakashyap
హిరణ్యకశ్యప కోసం ఏళ్ల తరబడి పని చేసిన గుణశేఖర్ గుండెల్లో అగ్నిపర్వతం పేలింది. రానా చేసిన పనికి రగిలిపోతున్నారు. తన అసహనాన్ని పరోక్షంగా బయటపెట్టారు. ''దేవుడిని మీ కథకు ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక విలువలతో సమాధానం చెప్పే రోజు వస్తుంది' అని ట్వీట్ చేశాడు.
Hiranyakashyap
ఇక్కడ గుణశేఖర్ ఎవరి పేరు ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆయన రానా, త్రివిక్రమ్ లను టార్గెట్ చేశారని తెలుస్తోంది. తన శ్రమను మరిచి ప్రాజెక్ట్ వేరే వాళ్ళ చేతిలో పెట్టిన రానాను, ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన త్రివిక్రమ్ లకు నీతి లేదని ఆయన భావన, అని నెటిజెన్స్ అభిప్రాయం.
గుణశేఖర్ ట్వీట్ క్రింద అభిమానులు ఇదే అభిప్రాయం వెల్లడిస్తున్నారు. హిరణ్యకశ్యప కోసం మీరు చాలా కష్టపడ్డారు, అది మీ డ్రీమ్ ప్రాజెక్ట్... రానా, త్రివిక్రమ్ సిగ్గుపడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ ఒకింత వివాదాస్పదం అవుతుందనిపిస్తుంది.