దర్శకుడు భారతీరాజా ఇంట్లో విషాదం.. కొడుకు గుండెపోటుతో కన్నుమూత
Manoj Bharathi Passed Away: చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు, నటుడు భారతీరాజా కొడుకు మనోజ్ భారతి హఠాన్మరణం చెందారు.

భారతీరాజా, మనోజ్
దర్శకుడు భారతీరాజా దర్శకుడిగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. దిగ్గజ దర్శకుడిగా రాణించారు. ఇప్పుడు నటుడిగా అడపాదడపా కనిపిస్తున్న ఆయన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన కొడుకు హఠాన్మరణం చెందారు.
భారతీరాజా కొడుకు మనోజ్ భారతి కొన్ని సినిమాల్లో నటించాడు. `తాజ్ మహల్` సినిమాతో మనోజ్ పరిచయం అయ్యాడు. `సముద్రం`, `కడల్ పూక్కల్` సినిమాల్లో కూడా నటించాడు.
మనోజ్ భారతి కన్నుమూశారు
మనోజ్ భారతీరాజాకి సడెన్‌గా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయన వయసు 48 ఏళ్లు. ఈ ఏజ్‌లోనే ఆయన గుండెపోటుతో కన్నుమూయడం అత్యంత విచాకరం. 1999 నుంచి నటుడిగా రాణిస్తున్నారు. ఇప్పటి వరకు 18 సినిమాల్లో నటించారు. నటుడిగా పెద్దగా గుర్తింపు రాలేదు.
దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రెండేళ్ల క్రితం `మార్గాజి తింగల్` అనే మూవీని రూపొందించారు. కానీ ఈ సినిమా ఆడలేదు. ఆయన 2006లో నటి నందనని పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.