- Home
- Entertainment
- అల్లు అర్జున్ మూవీ పక్కన పెట్టి శ్రీలీలతో రూ.150 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్న డైరెక్టర్.. సరికొత్త చరిత్ర
అల్లు అర్జున్ మూవీ పక్కన పెట్టి శ్రీలీలతో రూ.150 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్న డైరెక్టర్.. సరికొత్త చరిత్ర
డైరెక్టర్ అట్లీ భారీ బడ్జెట్ లో శ్రీలీలతో ఒక ప్రాజెక్టు చేస్తున్నారు. ఒకవైపు అల్లు అర్జున్ సినిమాతో అట్లీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకీ శ్రీలీలతో చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

అల్లు అర్జున్ తో 800 కోట్ల బడ్జెట్ చిత్రం
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన సౌత్ డైరెక్టర్స్ లో అట్లీ ఒకరు. షారుఖ్ ఖాన్ తో జవాన్ చిత్రం తెరకెక్కించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఏకంగా 800 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ భారీ స్థాయిలో ఉండే సైన్స్ ఫిక్షన్ మూవీ అని వార్తలు వస్తున్నాయి. పార్లల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఉండబోతోందట.
శ్రీలీలతో రూ.150 కోట్ల యాడ్
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కొనసాగుతోంది. ఇంతటి భారీ చిత్రం టేకప్ చేసినప్పుడు మరొక ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టే తీరిక ఉండదు. కానీ డైరెక్టర్ అట్లీ పాన్ ఇండియా సినిమాల బడ్జెట్ కు ఏమాత్రం తీసిపోని మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. అయితే ఇది సినిమా కాదు.. కమర్షియల్ యాడ్. డైరెక్టర్ అట్లీ ఏకంగా 150 కోట్ల బడ్జెట్ లో భారీ కమర్షియల్ యాడ్ చేస్తున్నారు. ఈ యాడ్ లో రణ్వీర్ సింగ్, బాబీ డియోల్, శ్రీలీల లాంటి స్టార్లు నటిస్తున్నారు.
ఇండియాలోనే కాస్ట్లీ యాడ్
ఇది 'చింగ్స్ దేశీ చైనీస్' అనే బ్రాండ్ కి సంబంధించిన యాడ్. ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ యాడ్ గా ఇది రూపొందుతోంది. డైరెక్టర్ అట్లీ ఈ యాడ్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ యాడ్ కోసం భారీ సెట్లు నిర్మించారట. అదే విధంగా ఇందులో కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా సినిమాలని మించే బడ్జెట్
రణ్వీర్ సింగ్ ఇండియాలో అత్యధిక యాడ్స్ చేసే నటుడిగా ఉన్నారు. ఇక శ్రీలీలకి హీరోయిన్ గా సౌత్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఈ యాడ్ కొన్ని పాన్ ఇండియా సినిమాలని మించే బడ్జెట్ లో రూపొందుతుండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచినా ఛావా బడ్జెట్ కేవలం 130 కోట్లు మాత్రమే.
అల్లు అర్జున్ మూవీ కోసం వెయిటింగ్
150 కోట్ల బడ్జెట్ లో రూపొందుతున్న ఈ యాడ్ లో అసలు ఎలాంటి కంటెంట్ ఉండబోతోంది ? డైరెక్టర్ అట్లీ ఏం చేశారు ? అనేది తెలియాలంటే యాడ్ రిలీజ్ అయ్యే వరకు ఎదురుచూడాల్సిందే. మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం అట్లీ తెరకెక్కించే చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో రిలీజ్ కానుంది.