డ్యూడ్ మూవీ ట్విట్టర్ రివ్యూ, ప్రదీప్ రంగనాథన్ మరో హిట్ కొట్టేశాడా.. హైలైట్స్ ఇవే
యువ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డ్యూడ్ మూవీ అంచనాలకు తగ్గట్లుగా ఉందా లేదా అనేది ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ మూవీ ట్విట్టర్ రివ్యూ
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే, డ్రాగన్ లాంటి యూత్ ఫుల్ మూవీస్ తో మంచి గుర్తింపు పొందారు. ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఈ చిత్రంలో ప్రదీప్ కి జోడిగా యంగ్ సెన్సేషన్ మమిత బైజు హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో శరత్ కుమార్, నేహా శెట్టి కీలక పాత్రల్లో నటించారు. డ్యూడ్ మూవీ కూడా ట్రైలర్ తోనే యువతని ఆకర్షించింది. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రిలీజ్ అవుతున్న డ్యూడ్ పై ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. యువ దర్శకుడు కీర్తి స్వరన్ ఈ చిత్రాన్ని లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ కన్ఫ్యూజన్ డ్రామాగా రూపొందించారు. నేడు శుక్రవారం అక్టోబర్ 17న డ్యూడ్ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే యుఎస్ ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. యుఎస్ ప్రీమియర్స్ నుంచి ఈ చిత్రానికి రెస్పాన్స్ మొదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు అనే వివరాలు ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ చిత్రం
డ్యూడ్ మూవీలో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు మధ్య క్యూట్ రొమాన్స్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. ట్రైలర్ కూడా వీరి రొమాన్స్, అల్లరి బాగా వైరల్ అయింది. ప్రీమియర్స్ షోలకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రొమాంటిక్ కామెడీ డ్రామాకి అవసరమైన అన్ని ఎలిమెంట్స్ పక్కాగా డ్యూడ్ చిత్రంలో ఉన్నాయి. కథ రొటీన్ అయినప్పటికీ డైరెక్టర్ తెరకెక్కించిన విధానం, ట్రీట్మెంట్ సూపర్బ్ అనిపించేలా ఉంది.
ఇంటర్వెల్ ఎపిసోడ్ అదిరింది
ప్రారంభంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా అనిపిస్తాయి. కానీ ఇంటర్వెల్ కి చేరే సమయానికి మూవీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఫస్ట్ హాఫ్ లో చాలా సన్నివేశాలు విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. యూత్ కి ఈ చిత్రం ఫీస్ట్ అనిపించేలా ఉంది. ప్రదీప్ రంగనాథన్, మమిత జోడీ వైబ్ ని ఆడియన్స్ ఫీల్ అవుతారు. ప్రతి సన్నివేశం వినోదం అందిస్తూనే నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంటుంది.
ఇటీవల కాలంలో బెస్ట్ రోమ్ కామ్ మూవీ
ప్రదీప్ రంగనాథన్ తన ఓన్ స్టైల్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక శరత్ కుమార్ పాత్ర కూడా కథకి చాలా బలాన్ని చేకూర్చింది. ఆడియన్స్ మూవీ చూశాక ట్విట్టర్ లో రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో డ్యూడ్ మూవీ బెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు సన్నివేశాలుచాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సాయి అభ్యంకర్ సంగీతం ఆ సీన్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్ళింది అని ఆడియన్స్ అంటున్నారు.
సెకండ్ హాఫ్ ఎమోషనల్
మరికొందరు ఆడియన్స్ ప్రదీప్ రంగనాథన్ మళ్ళీ కొట్టేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా సాగగా.. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా డ్యూడ్ మూవీ ప్రదీప్ రంగనాథన్ కి మరో హిట్ హిట్ చిత్రం అవుతుందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.