- Home
- Entertainment
- ఎన్టీఆర్ కి తెలిసే ఇదంతా జరిగిందా ? చిరంజీవికి దారుణ అవమానం.. కట్ చేస్తే 9 ఏళ్లలో సీన్ రివర్స్
ఎన్టీఆర్ కి తెలిసే ఇదంతా జరిగిందా ? చిరంజీవికి దారుణ అవమానం.. కట్ చేస్తే 9 ఏళ్లలో సీన్ రివర్స్
ఎన్టీఆర్, చిరంజీవి కలిసి తిరుగులేని మనిషి చిత్రంలో నటించారు. మరో సినిమాలో కూడా వీరిద్దరూ నటించాల్సింది. కానీ అవమానకరంగా ఆ చిత్రం నుంచి చిరంజీవిని తొలగించారు.

ఎన్టీఆర్ తో చిరంజీవి నటించిన చిత్రం
మెగాస్టార్ చిరంజీవి 1979 నుంచి నెమ్మదిగా టాలీవుడ్ లో తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో కెరీర్ బిగినింగ్ లో చిన్న పాత్రలు కూడా చేశారు. ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు లాంటి లెజెండ్స్ తో చిరంజీవి కలిసి నటించారు. కెరీర్ లో నిలదొక్కుకునే క్రమంలో కష్టాలు, అవమానాలు సహజం. చిరంజీవి ఎన్నో కష్టాలు, అంతకి మించిన అవమానాలు ఎదుర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుతో చిరంజీవి తిరుగులేని మనిషి అనే చిత్రంలో నటించారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం విజయం సాధించలేదు. ఈ మూవీలో చిరంజీవి కీలక పాత్రలో నటించారు. చిరంజీవి, ఎన్టీఆర్ కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదే. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ తో కలిసి నటించే ఛాన్స్ చిరంజీవికి వచ్చింది.
మరో సినిమాలో చిరంజీవికి ఛాన్స్
అది కూడా రాఘవేంద్ర రావు చిత్రమే. తిరుగులేని మనిషి రిలీజ్ అయ్యాక వెంటనే ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో కొండవీటి సింహం అనే చిత్రం ప్రారంభం అయింది. ఈ మూవీలో శ్రీదేవి కూడా నటించారు. చిరంజీవిని కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. అధికారికంగా పేపర్ లో ప్రకటన కూడా వచ్చింది. కానీ ఊహించని విధంగా తొలి షెడ్యూల్ జరిగిన తర్వాత ఈ చిత్రం నుంచి చిరంజీవిని తప్పించారు.
చిరంజీవికి దారుణ అవమానం
చిరంజీవిని తప్పించి ఆ పాత్ర కోసం మోహన్ బాబుని ఎంపిక చేసుకున్నారు. అంతకు ముందే రిలీజైన తిరుగులేని మనిషి చిత్రం ఆశించిన స్థాయిలో రాణించేలేదు. దీనితో ఎన్టీఆర్ తో చిరంజీవి కాంబినేషన్ వర్కౌట్ కావడం లేదని రాఘవేంద్రరావు భావించారు. చిరంజీవి నటిస్తే ఆ మూవీ ఫ్లాప్ అయింది. కాబట్టి సెంటిమెంట్ ప్రకారం చిరంజీవిని వద్దనుకున్నారు. అధికారికంగా ప్రకటించిన తర్వాత చిరంజీవిని ఈ చిత్రం నుంచి తొలగించారు. ఈ సంఘటనపై ఎన్టీఆర్ ప్రమేయం ఉందో లేదో తెలియదు. కానీ చిరంజీవికి మాత్రం అవమానం ఎదురైంది.
9 ఏళ్లలో సీన్ రివర్స్
విచిత్రం ఏంటంటే.. చిరంజీవి నటిస్తే ఫ్లాప్ అవుతుందని భావించిన రాఘవేంద్రరావే ఆయనతో అత్యధిక సినిమాలు చేశారు. ఏకంగా వీరిద్దరి కాంబినేషన్ లో 14 చిత్రాలు వచ్చాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా చిరు, రాఘవేంద్రరావు కాంబోలో ఉన్నాయి. చిరంజీవి నటిస్తే తన సినిమాకి కలిసి రావడం లేదని రాఘవేంద్ర రావు కొండవీటి సింహం మూవీ టైంలో భావించారు. కానీ సరిగ్గా 9 ఏళ్ళ తర్వాత చిరంజీవి చిత్రంతోనే రాఘవేంద్రరావు కి లైఫ్ లభించింది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి ముందు రాఘవేంద్రరావు వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్నారు.
ఎన్టీఆర్ ప్రశంసలు
చివరికి ఎన్టీఆర్ కూడా చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి స్టార్ అయ్యాక ఎన్టీఆర్ ఒక మాట అన్నారట. బాగా వృద్ధిలోకి వస్తున్నారు బ్రదర్ అని ప్రశంసించారు. అదే సమయంలో మంచి సలహా కూడా ఇచ్చారు. మీ సంపాదనని కార్లు లాంటి ఇనుప డబ్బాల కోసం వృధా చేసుకోవద్దు. భూములు కొనుక్కోండి.. రేపటి రోజున మీ కుటుంబానికి అవి ఉపయోగపడతాయి అని ఎన్టీఆర్ చిరంజీవితో అన్నారు.