టాలీవుడ్‌లోకి దిల్‌రాజు రెండో భార్య వైఘా రెడ్డి.. ఏం చేయబోతుందంటే?

First Published Dec 3, 2020, 2:53 PM IST

టాలీవుడ్‌ నిర్మాత దిల్‌రాజు లాక్‌డౌన్‌ టైమ్‌లో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో షూటింగ్‌ ఆగిపోవడంతో రెండో భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తన భార్యని టాలీవుడ్‌కి పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇంతకి దిల్‌రాజు రెండో భార్య ఏం చేయబోతుందనేది చూస్తే..

దిల్‌రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో కన్నుమూసింది. అనంతరం ఆయన చాలా కుంగిపోయారు. ఒంటరయ్యారు. మూడేళ్ళు ఒంటరిగా ఉన్న ఆయన ఈ   ఏడాది లాక్‌డౌన్‌ టైమ్‌లో సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్నారు.

హైదరాబాద్‌కి చెందిన తేజస్విని(వైఘా రెడ్డి) మ్యారేజ్‌ చేసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని నర్సింగ్‌పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ   సభ్యుల సమక్షంలో చాలా నిరాడంబరంగా ఈ వివాహం చేసుకున్నారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని వచ్చారీ నూత దంపతులు.ఆ ఫోటో  ఆ మధ్య హల్‌చల్‌ చేశాయి.

అంతేకాదు స్టార్స్ తరహాలో ఫోటో షూట్‌లతో రెచ్చిపోయారు. దిల్‌రాజు, వైఘా రెడ్డి ఫోటోల్లోని ఘాటు రొమాన్స్ ని ఒలకబోశారు. ఈ ఫోటోలు సైతం వైరల్‌ అయ్యాయి.

ఇదిలా ఉంటే త్వరలో తన భార్య వైఘారెడ్డిని టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నారట దిల్‌రాజు. ఆమెలోని క్రియేటివికి పదును పెట్టాలని, దానికి గుర్తింపు ఇవ్వాలని ప్లాన్‌   చేస్తున్నారట.

కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ఓటీటీ మాధ్యమాలు మంచి ఆదరణ ఏర్పడింది. బలమైన కంటెంట్‌ ఉన్న వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు వస్తున్నాయి. ఆదరణ పొందుతున్నాయి.

దిల్‌రాజు సైతం ఓటీటీ కోసం సినిమాలు చేయాలని భావిస్తున్నారట. ఆయా కథల కోసం అన్వేషణ చేపడుతున్నారు. అయితే ఆయన భార్య కూడా ఓ కథని దిల్‌రాజుకి   చెప్పిందట.

వైఘా రెడ్డి సైతం స్వయంగా ఓ కథను రెడీ చేశారని తెలుస్తుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఆమె కొత్త కథలపై దృష్టి సారించారని, ఓటీటీకి అనుగుణంగా   సృజనాత్మకతతో కూడిన ఓ కథని దిల్‌రాజుకి గిఫ్ట్ గా ఇచ్చారట. భార్య స్టోరీకి ఇంప్రెస్‌ అయిన దిల్‌రాజు, ఆ కథకి మరింత మెరుగులు దిద్దేందుకు ఓ రైటర్స్ టీమ్‌ని ఏర్పాటు   చేశారని సమాచారం.

ఓటీటీ విస్తరిస్తున్న నేపథ్యంలో భార్య రూపొందించిన కథాంశాన్ని తెరక్కించాలని నిర్ణయించినట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. అనుకున్నట్లు కథ కార్యరూపం దాల్చితే   తేజస్వీని సైతం చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇదే నిజమైతే రైటర్‌గానో, లేక డైరెక్టర్‌గానో వైఘారెడ్డి టాలీవుడ్‌కి పరిచయం కానుందని చెప్పొచ్చు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?