MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆడియెన్స్ ని మేమే చెడగొడుతున్నాం.. దిల్‌ రాజు హాట్‌ కామెంట్‌.. ఈ సినిమాకి తానే రివ్యూ రాస్తానంటూ షాక్‌..

ఆడియెన్స్ ని మేమే చెడగొడుతున్నాం.. దిల్‌ రాజు హాట్‌ కామెంట్‌.. ఈ సినిమాకి తానే రివ్యూ రాస్తానంటూ షాక్‌..

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు..ఓటీటీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడియెన్స్ ని థియేటర్‌కి రాకుండా కిల్‌ చేస్తున్నామంటూ షాకిచ్చాడు దిల్‌ రాజు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 16 2024, 11:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Dil Raju

Dil Raju

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు.. ప్రస్తుతం తెలుగులో టాప్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. ఆయన భారీ సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల `ఫ్యామిలీ స్టార్‌` చిత్రంతో గట్టిగా దెబ్బతిన్న దిల్‌ రాజు ఇప్పుడు రామ్‌ చరణ్‌తో `గేమ్‌ ఛేంజర్‌` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుమారు మూడు వందలకోట్లతో ఈ మూవీని రూపొందిస్తున్నారు దర్శకుడు శంకర్‌. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దిల్‌ రాజు ఆ మధ్య తరచూ మీడియాలో కనిపించే వారు. ఇప్పుడు తగ్గించారు చాలా రోజుల తర్వాత ఇప్పుడు `రేవ్‌` సినిమా కోసం ఆయన మీడియా ముందుకు వచ్చారు. `రేవ్‌` మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి గెస్ట్ గా దిల్‌ రాజు హాజరయ్యారు. ఈ సినిమాలో భాగమైన జర్నలిస్ట్ లు రాంబాబు, ప్రభులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇన్నాళ్లు తమ సినిమాలకు వీళ్లు రివ్యూలు రాసేవాళ్లు అని, ఇప్పుడు వాళ్ల సినిమాలే వస్తున్నాయి. దీనికి నేనే రివ్యూ రైటర్‌ని అవుతాను. సినిమా చూశాక తానే రివ్యూ రాస్తా అని తెలిపారు దిల్‌రాజు. 
 

35

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమాను జనం వద్దకు తీసుకెళ్లడం కష్టమని, కంటెంట్‌తోనే వెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో పాడింగ్‌ కూడా తోడవుతుంది. తమలాంటి పెద్దలా సపోర్ట్ కూడా ఉండాలని తెలిపారు. అయితే ఇప్పుడు కంటెంట్ చాలా ముఖ్యమని, అది బాగుంటే, సినిమా జనాల్లోకి వెళ్తుందని, మీడియా సపోర్ట్ చేస్తుందని చెప్పారు. ఇలాంటి సినిమాలు చాలా స్లోగా వెళ్తాయని తెలిపారు. 
 

45

ఈ క్రమంలోనే దిల్‌ రాజు హాట్‌ కామెంట్‌ చేశాడు. కంటెంట్‌ బాగున్నా సినిమాలకు స్లోగా జనం వస్తారని, కానీ అంత వరకు మనం వెయిట్‌ చేయడం లేదని, నాలుగు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నామని, కానీ మన ఆడియెన్స్ మంచి సినిమాలను ఆదరిస్తారని, కానీ వాళ్లనే మనం చెడగొడుతున్నామని తెలిపారు. ఆడియెన్స్ ని థియేటర్‌ వద్దకు రాకుండా చేస్తున్నామని తెలిపారు. ఓటీటీల కారణంగా నాలుగు వారాల్లోనే సినిమా ఓటీటీలలో వస్తుందని, అందుకే వాళ్లకి థియేటర్‌కి ఆడియెన్స్ కి ఆడియెన్స్ రావడం తగ్గిపోయిందని తెలిపారు. ఓ రకంగా తనతోపాటు ఇతర మేకర్స్ కి ఆయన  వార్నింగ్‌ ఇచ్చాడు దిల్‌ రాజు. 
 

55

`రేవ్‌` సినిమా గ్లింప్స్, పాటలు, టీజర్‌, ట్రైలర్‌ చూశానని, బాగుందని, ఇలాంటి సినిమాలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని, తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని దిల్‌ రాజు కోరుకున్నారు. ఈ మూవీ ఈ నెల 23న విడుదల కాబోతుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
దిల్ రాజు
ఓటీటీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రభాస్ ముఖం మీదే అడిగేసి కళ్ళు తెరిపించిన కమెడియన్, మనసులో దాచుకుని మదనపడడం ఎందుకు
Recommended image2
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Recommended image3
Divya Bharathi: ఇండస్ట్రీలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved