MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఇలాంటి కూతురు ఎందుకు పుట్టిందా అని తండ్రి బాధపడ్డారు.. ఫ్రెండ్ పరువు తీసిన సంజన, కిస్సింగ్ సీన్ పై ఇలా

ఇలాంటి కూతురు ఎందుకు పుట్టిందా అని తండ్రి బాధపడ్డారు.. ఫ్రెండ్ పరువు తీసిన సంజన, కిస్సింగ్ సీన్ పై ఇలా

బిగ్ బాస్ హౌస్ లో సంజన సంచలనంగా మారారు. సంజన ఇంత డేరింగ్ గా మారడానికి ఆమె కెరీర్ బిగినింగ్ లో జరిగిన ఒక సంఘటనే కారణం. ఆమె తండ్రి కూడా ఇలాంటి కూతురు ఎందుకు పుట్టిందా అని బాధపడ్డారట. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 30 2025, 07:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బిగ్ బాస్ హౌస్ లో సంజన వివాదం 
Image Credit : Instagram/@sanjjanaagalrani

బిగ్ బాస్ హౌస్ లో సంజన వివాదం 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సంజన గల్రాని ప్రకంపనలు సృష్టిస్తోంది. రీతూ చౌదరి వివాదంతో ఒక్కసారిగా సంజన సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. పవన్, రీతూ రిలేషన్ గురించి సంజన ఘాటుగా స్పందించింది. ఆమె మాటలు వివాదానికి కారణం అయ్యాయి. కానీ సంజనకి కూడా ఈ వివాదంలో అభిమానుల నుంచి సపోర్ట్ లభిస్తోంది. తనమాటపై తాను స్ట్రాంగ్ గా నిలబడి హౌస్ నుంచి వెళ్లిపోవడానికి కూడా సంజన సిద్దపడింది. నాగార్జున ఆమెని హౌస్ లో ఉంచాలా వద్దా అనే డెసిషన్ ని వేరేవాళ్ళ చేతుల్లో పెట్టారు. కానీ ఎవరి డెసిషన్ అవసరం లేదని తానే వెళ్లిపోతానని సంజన చెప్పడంతో  అంతా షాక్ అయ్యారు. చివరికి నాగార్జున కన్విన్స్ చేసి ఆమెని హౌస్ లో ఉంచాల్సి వచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సంజనకి అభిమానుల సపోర్ట్ 
Image Credit : Instagram/@sanjjanaagalrani

సంజనకి అభిమానుల సపోర్ట్ 

ఒకరకంగా బలవంతంగా సంజన చేత సారీ చెప్పించారు అనే చెప్పాలి. ఈ సంఘటనతో ఆమె అభిమానులు ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. బిగ్ బాస్ లో సంజన ఐరన్ లేడీ అని అభివర్ణిస్తున్నారు. సంజన ఇంత డేరింగ్ గా మారడానికి కారణం ఆమెకి కెరీర్ బిగినింగ్ లో ఎదురైన సంఘటనలే అని తెలుస్తోంది. చాలా ఏళ్ళ క్రితమే తనకి కెరీర్ బిగినింగ్ లో ఎదురైన కష్టాలని సంజన అలీతో సరదాగా అనే కార్యక్రమంలో వివరించింది. 

36
కన్నడలో బోల్డ్ మూవీ 
Image Credit : Instagram/@sanjjanaagalrani

కన్నడలో బోల్డ్ మూవీ 

బిగ్ బాస్ హౌస్ లో రీతూ లాగానే.. 17 ఏళ్ళ వయసులోనే తన కాలేజ్ ఫ్రెండ్ కి రీతూ వార్నింగ్ ఇచ్చిందట. అలీతో జరిగిన ఇంటర్వ్యూలో సంజన మాట్లాడుతూ.. మాది ముందు నుంచి ధనిక కుటుంబమే. నాన్నకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఉంది. వెల్ సెటిల్డ్. కానీ నాకు సినిమాలపై ఆసక్తి ఉంది. సినిమాల్లో అవకాశం వస్తే ఆ డబ్బుతో కారు కొనుక్కోవాలనే ఆశ ఉండేది. కన్నడలో గండ హెండతి  అనే చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ మూవీలో నాది కాస్త బోల్డ్ రోల్. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. 

46
బలవంతంగా కిస్సింగ్ సీన్స్ చేయించారు 
Image Credit : Instagram/@sanjjanaagalrani

బలవంతంగా కిస్సింగ్ సీన్స్ చేయించారు 

 కానీ ఆ విషయం నాకు ముందు తెలియదు. అప్పుడు నా ఏజ్ 17 ఏళ్ళు. అంత మెచ్యూరిటీ కూడా లేదు.  కథ తెలియకుండా సినిమాకి సైన్ చేశాను. 2 లక్షలు రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. అది మర్డర్ అనే హిందీ చిత్రానికి రీమేక్ అని తెలిసినప్పుడు షాక్ అయ్యా. వెంటనే రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేద్దాం అని వెళ్ళా. సార్ ఇంత బోల్డ్ గా నేను నటించలేను. ఈ కథకి నేను న్యాయం చేయలేను అని చెప్పా. అంత బోల్డ్ గా ఏమీ ఉండదు. భయపడాల్సిన అవసరం లేదు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ నేను ఒప్పుకోలేదు. నువ్వు ఇప్పుడు ఈ సినిమా చేయకపోతే ఆల్రెడీ సైన్ చేశావు కాబట్టి నీ పరువు తీస్తాం. చీటింగ్ చేసింది అని మీడియాకి చెబుతాం అంటూ బెదిరించారు. 

56
ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగావు కదా.. 
Image Credit : Instagram/@sanjjanaagalrani

ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగావు కదా.. 

దీనితో తప్పని పరిస్థితిల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ఆ టైంలో ఎందుకు ఇండస్ట్రీకి వచ్చానా అని బాధపడ్డాను. తొలి రోజు షూటింగ్ కి మా అమ్మా నాన్నా వచ్చారు. కిస్సింగ్ సీన్ చూసి ఇలాంటి కూతురు ఎందుకు పుట్టిందా అని నాన్న బాధపడ్డారు. కానీ అమ్మ నాకు సపోర్ట్ చేసింది. నువ్వు సినిమాలో కిస్ చేశావు అట కదా అని నా ఫ్రెండ్స్ కూడా అసభ్యంగా మాట్లాడడం ప్రారంభించారు. నన్ను అన్నవాళ్ళే కాలేజ్ లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ని నా కళ్ళముందే కిస్ చేశారు. ఒక ఫ్రెండ్ ఈ కిస్ గురించి నన్ను అడిగితే నేను వార్నింగ్ ఇచ్చాను. నువ్వు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ని మార్చావు. నా కళ్ళముందే కిస్ చేశావు కదా, నువ్వేంటి నాకు చెప్పేది అని ప్రశ్నించా. దీనితో ఆమె ఛీ ఛీ అంటూ వెళ్ళిపోయింది. 

66
ఆ సంఘటనల వల్లే ఇలా 
Image Credit : Instagram/@sanjjanaagalrani

ఆ సంఘటనల వల్లే ఇలా 

షూటింగ్ లో ఆ డైరెక్టర్ నాతో సైకోలాగా ప్రవర్తించాడు. తన శాడిజం మొత్తాన్ని నాపై చూపించాడు. నా కెరీర్ మొత్తంలో నాకు ఎదురైన చేదు సంఘటన అదే. ఆ సంఘటనలే నన్ను ధైర్యవంతురాలిగా మార్చాయి అని సంజన పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Related Stories
Recommended image1
ఎట్టకేలకు వెంకీ కోరిక నెరవేరబోతోంది.. వెంకటేశ్వర్లు, నందు, ఆశా, పింకీ చేసే రచ్చకి గెట్ రెడీ
Recommended image2
హౌస్ నుంచి వెళ్ళిపోతా, ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు.. నాగార్జునకి చుక్కలు చూపించిన సంజన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved