ఐటీ రైడ్స్ ప్రభావం.. దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత, అధికారులు ఏం చేశారో తెలుసా
టాలీవుడ్ నిర్మాతలపై జరుగుతున్న ఐటీ దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కాలంలో ఎక్కువ బిజినెస్ చేసిన దిల్ రాజు, మైత్రి నిర్మాతలని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు.

టాలీవుడ్ నిర్మాతలపై జరుగుతున్న ఐటీ దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కాలంలో ఎక్కువ బిజినెస్ చేసిన దిల్ రాజు, మైత్రి నిర్మాతలని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో సంక్రాంతికి 2 చిత్రాలు విడుదలయ్యాయి. గేమ్ ఛేంజర్ నిరాశ పరచగా, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రం వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లతో దూసుకుపోతోంది. గత మూడు రోజులుగా దిల్ రాజు ఇల్లు, ఆఫీస్ లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
దిల్ రాజు భార్య తేజస్వినిని కూడా అధికారులు విచారణ చేశారు. బ్యాంకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా అధికారులు రైడ్స్ చేస్తున్న సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకి గురైనట్లు తెలుస్తోంది. దీనితో అధికారులే స్వయంగా వారి వాహనంలో ఆమెని ఆసుపత్రికి తరలించారట.
ఈ సంఘటన దిల్ రాజు ఫ్యామిలీని కలవరపెడుతోంది. ఐటీ దాడులపై దిల్ రాజు స్పందించారు. ఐటీ రైడ్స్ తానొక్కడిపైనే జరగడం లేదని అన్నారు. ఇండస్ట్రీలో చాలా మందిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. పుష్ప 2 చిత్రాన్ని నిర్మించిన మైత్రి సంస్థ నిర్మాతలు నవీన్, రవిశంకర్ పై కూడా రైడ్స్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.