MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'వారసుడు' వివాదం: దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ ,మొత్తం 'ఓపెన్' అయ్యిపోయాడే

'వారసుడు' వివాదం: దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ ,మొత్తం 'ఓపెన్' అయ్యిపోయాడే

 ఇక 'వారసుడు' థియేటర్ల ఇష్యూ వెనక ఏం జరుగుతోందో, ఎవరు ఉన్నారో స్పష్టంగా  మరీ వివరించారు. ఇంతకీ 'వారసుడు' వివాదంపై దిల్ రాజు ఏం చెప్పారు? .. ఆయన వెర్షన్ ఏంటీ? ఇంతకీ ఈ వివాదం వెనక ఎవరున్నారు?  వారి ప్రధాన ఉద్దేశ్యం ఏంటీ? అన్నది ఆసక్తికరంగా మారింది.

5 Min read
Surya Prakash
Published : Nov 28 2022, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116
dil raju

dil raju


 సినిమా రిలీజ్ ల విషయంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గత కొంత కాలంగా కార్నర్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'వారసుడు' రిలీజ్ థియేటర్ల కేటాయింపు విషయంలో మరో సారి వార్తల్లో నిలిచారు.  'వారసుడు' చుట్టూ థియేటర్ల వివాదం మొదలైంది. తెలుగు నిర్మాతల మండలి దిల్ రాజుకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తే అల్లు అరవింద్ అశ్వనీదత్ వంటి నిర్మాతలు దిల్ రాజుకు అండగా నిలిచారు. ఇంత జరుగుతున్నా 'వారసుడు' వివాదంపై దిల్ రాజు నోరు విప్పలేదు. సైలెంట్ గా గమనిస్తున్నారే కానీ ఇలా ఎందుకు జరుగుతోంది? అని వివరణ ఇవ్వలేదు.

216


 అయితే  ఈ వివాదంపై స్పందిస్తానంటూ 'మసూద' మూవీ సక్సెస్ మీట్ లో దిల్ రాజు స్పష్టం చేశారు. తాజాగా ఈ  వివాదంపై ఫస్ట్ టైమ్ దిల్ రాజు.. ఓ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. ఎటువంటి ప్రాబ్లమ్ లేని చోట.. కావాలని కొందరు ప్రాబ్లమ్ సృష్టిస్తున్నారని తెలుపుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా సంక్రాంతి విషయంలో ఏం జరుగుతుందో వివరంగా ఆయన చెప్పుకొచ్చారు.
 

316

 దిల్ రాజు మాట్లాడుతూ.... ‘‘2019లో నేనొక స్టేట్‌మెంట్ ఇచ్చా. అప్పుడు మూడు తెలుగు సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. చరణ్‌గారి ‘వినయ విధేయ రామ’, బాలయ్యగారి ‘ఎన్టీఆర్ బయోపిక్’, ‘ఎఫ్ 2’.. విడుదల తేదీలతో సహా సిద్ధంగా ఉన్న సమయంలో.. రజినీకాంత్‌గారి ‘పేట’ అనే సినిమాని కరెక్ట్‌గా 10 రోజుల ముందు లైన్‌లోకి తెచ్చారు. అయితే అప్పటికే ఈ మూడు సినిమాలకు సంబంధించి థియేటర్లు లాక్ అయ్యాయి. 
 

416

సంక్రాంతి అనగానే కాంపిటేషన్ ఎక్కువ ఉంటుంది. మూడు నెలల ముందు నుంచి వర్క్ చేయాలి. మూడు తెలుగు సినిమాలు అన్నీ లాక్ చేసుకున్న సమయంలో ‘పేట’ని తీసుకొచ్చి.. దిల్ రాజు థియేటర్లు ఇవ్వడం లేదని గొడవ స్టార్ట్ చేశారు. అప్పుడు నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత.. ఇప్పుడు ‘పేట’ అంటున్నారు. తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇచ్చిన తర్వాతే.. మిగిలిన థియేటర్లు ‘పేట’కి ఇస్తామని చెప్పా. ఇది 2019 సంక్రాంతికి జరిగింది. 

516
Dilraju, rajani

Dilraju, rajani


 అలాగే 2020లో ‘సరిలేరు నీకెవ్వురు’, ‘అల వైకుంఠపురములో’ విడుదలకు రెడీగా ఉన్నాయి. నైజాంలో ఈ రెండు సినిమాలు నేనే విడుదల చేశా. ఒకటి చినబాబుగారిది. ఇంకో సినిమాని అనిల్‌గారితో కలిసి మేమే నిర్మించాం. రెండు సినిమాల మధ్య భారీ పోటీ. నేనప్పుడు హాలీడే ట్రిప్‌లో ఉన్నా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు హీరోలతో మాట్లాడి.. ఇలా ఇలా రిలీజ్ చేద్దామని చెప్పా.

616


 థియేటర్లు అన్ని బ్యాలెన్స్ చేస్తాం.. అని ఇద్దరిని కన్విన్స్ చేశా. రెండు సినిమాలని అద్భుతమైన ప్లానింగ్‌తో విడుదల చేశాం. స్టార్ హీరోల సినిమాలు, బిగ్ రిలీజ్.. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. రెండూ బిగ్ సక్సెస్ సాధించాయి. ఏం ప్రాబ్లమ్ రాలేదు. ఇది 2020 సంక్రాంతికి జరిగింది. 
 

716


 2021లో మా ద్వారా రెండో మూడో సినిమాలు రిలీజయ్యాయి. ‘క్రాక్’ అనే సినిమా వరంగల్ శ్రీను అనే అతను రిలీజ్ చేశాడు. అప్పటి వరకు వరంగల్ శ్రీను అనే అబ్బాయి.. ఏ సినిమా కొన్నా.. మా ఆఫీస్‌కి వచ్చి, మా బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్లేవాడు. మేం ఎంకరేజ్ చేసేవాళ్లం. ఇది ఒక సముద్రం వంటిది. ఎవరి సినిమా, ఎవరి వ్యాపారం వాళ్లది. అప్పుడు ‘క్రాక్’ అనే సినిమాకు థియేటర్ల ఇష్యూ వచ్చిందని.. కావాలని రాద్దాంతం చేశారు. 

816
Vaarasudu first look-Vijay is ‘The Boss’ in Vamshi Paidipally film

Vaarasudu first look-Vijay is ‘The Boss’ in Vamshi Paidipally film


దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎవరేం చేశారనేది నాకెప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. కానీ నేనెప్పుడూ ఓపెన్‌గా కౌంటర్ చేయను. ఎందుకు చేయనంటే.. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ ఎప్పుడూ ఒక్కటే చెబుతారు. నువ్వు కౌంటర్ చేస్తే వెంటనే ఇంకో కౌంటర్ వస్తుంటుందని. ఆ వివాదం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందని.. సొల్యూషన్ రాదని చెబుతూ ఉంటారు. ఇది 2021 సంక్రాంతికి జరిగింది. 

916

  2022 సంక్రాంతికి కోవిడ్ కారణంగా నాగార్జున సినిమా మినహా పెద్ద హీరోల సినిమాలేవీ విడుదల కాలేదు. నాగార్జున ‘బంగార్రాజు’, ‘రౌడీ బాయ్స్’, ‘హీరో’ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. రౌడీ బాయ్స్ చిత్రం దిల్ రాజు సంస్ద నుంచి వచ్చింది. అప్పుడు పోటీ ఏం లేదు. సమస్యలు లేవు. 
 

1016


 ఇప్పుడు 2023కి వస్తే.. ‘వారిసు’ అనే సినిమా నేను మొదలు పెట్టినప్పుడే 2023 సంక్రాంతికి అని.. నేను డేట్ అనౌన్స్ చేసిన ఫస్ట్ ఫిల్మ్. తెలుగు, తమిళ్, హిందీ.. మూడు లాంగ్వేజెస్‌లో చేస్తున్నామని చెప్పాం. మే నెలలో డేట్ అనౌన్స్ చేసిన సినిమాపై ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారు. ఇందులో వాళ్లది కూడా తప్పులేదు. ఇప్పుడు ఒక్కటే ప్రొడక్షన్ హౌస్ నుంచి సంక్రాంతికి చిరంజీవిగారు, బాలకృష్ణగారి సినిమాలు వస్తున్నాయి. అలాగే ‘ఆదిపురుష్’ సంక్రాంతికి బిగ్ రిలీజ్ ఉంది. నిజంగా ‘ఆదిపురుష్ రిలీజ్ ఉన్నట్లయితే.. ఖచ్చితంగా థియేటర్ల విషయంలో పెద్ద ప్రాబ్లమ్ అయ్యేది. 
 

1116


ఎందుకంటే నాలుగు పెద్ద సినిమాలకు అడ్జస్ట్ చేసేంతగా థియేటర్లు లేవు. ‘ఆదిపురుష్’ నైజాం, ఉత్తరాంధ్ర మేమే రిలీజ్. మొన్నటి వరకు మైత్రీ సినిమాలు కూడా మేమే డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఇప్పుడు వాళ్లు సొంతగా నైజాంలో ఆఫీస్ పెట్టుకుంటున్నారు. ఆఫీస్ పెట్టుకుంటున్నారు కాబట్టే.. వేరే వాళ్లు దీనిని అడ్వాంటేజ్ తీసుకుని దీనిని న్యూస్ చేస్తున్నారు. వెనుక ఉన్న విషయం ఎవరికీ తెలియదు. సంక్రాంతి రేసు నుండి ‘ఆదిపురుష్’ తప్పుకుంది. ఇప్పుడున్న చిరంజీవిగారి, బాలకృష్ణగారి పెద్ద సినిమాలు.. మూడోది ‘వారసుడు’ మా సినిమా. ఈ మూడు సినిమాలకు తెలుగు స్టేట్స్‌లో సరిపోయేంత కంఫర్టబుల్ థియేటర్స్ ఉన్నాయి. 
ప్రాబ్లమ్ ఏమీ లేదు. 

1216
varisu release date announced vijay Vamshi Paidipally Sri Venkateswara Creations

varisu release date announced vijay Vamshi Paidipally Sri Venkateswara Creations

మైత్రీ నుంచే రెండు సినిమాలు వస్తున్నాయి. 75 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో సంక్రాంతికి ఒకే బ్యానర్ నుంచి రెండు పెద్ద సినిమాలు.. వాళ్లే రిలీజ్ చేయడం అనేది ఫస్ట్ టైమ్. వాళ్లకి ఏంటంటే.. ఇద్దరు స్టార్ హీరోలు. ఇద్దరూ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే.. మేము మే లో అనౌన్స్ చేశాం. చిరంజీవిగారి సినిమా జూన్, జూలై‌లో అనౌన్స్ చేశారు. ‘ఆదిపురుష్’ ఏప్రిల్‌లో అనౌన్స్ చేశారు. బాలకృష్ణగారిది అక్టోబర్‌లో అనౌన్స్ చేశారు.

1316


 వాస్తవానికి బాలకృష్ణ‌గారి సినిమా డిశంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. వర్క్ పూర్తి కాలేదనో.. సంక్రాంతి అడ్వాంటేజ్ అనో, సెంటిమెంట్ అనో.. సంక్రాంతికి పెట్టుకున్నారు. ఇప్పుడు మైత్రీ వాళ్లకి ప్రాబ్లమ్ లేదు. మాకూ ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ కౌన్సిల్‌కి.. అదీ సమస్య. 

1416


మైత్రీ వాళ్లు వెళ్లి.. కౌన్సిల్‌కి ఏమైనా కంప్లయింట్ చేశారా? అంటే అదీ లేదు. అప్పుడెప్పుడో దిల్ రాజు ఇలా మాట్లాడాడు కాబట్టి.. దిల్ రాజుని కౌంటర్ చేయడానికని దీనిని బయటికి తీసుకువచ్చారు. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే.. సినిమా వ్యాపారాన్ని ఎవరం శాసించలేం. ఎవరికీ తెలియని విషయాన్ని నేనిప్పుడు చెబుతాను. నైజాంలో మొత్తం 420 స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఏషియన్ సునీల్ వాళ్ల దగ్గర 100 స్క్రీన్లు ఉన్నాయి. 37 స్క్రీన్లు మాత్రం మావి. ఈ 100, మా 37 కాకుండా.. మిగతా వాటి విషయంలో ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇస్తారు. 

1516
Varisu

Varisu


ఎందుకంటే.. మేము ఏదైనా చెబితే.. సంవత్సరం అంతా వాళ్లు ఇచ్చే డబ్బు సేఫ్‌గా ఉంటుందని భావిసారు. నా సినిమా వస్తుంది అంటే.. వాళ్లు హోల్డ్ చేస్తారు. ఎందుకంటే మా సంస్థకి ఉన్న గుడ్ విల్ అది. మా దగ్గర డబ్బులు ఆగిపోవు అని నమ్మకం. నేను తీసేవి కానీ, విడుదల చేసేవి కానీ.. దాదాపు సంవత్సరానికి 10, 12 సినిమాలతో వాళ్లకి ఫీడింగ్ ఇస్తా. 

1616


మా శిరీష్ మాట్లాడితే.. ఆ వర్డ్‌కి వేల్యూ ఉంటది. అంతేకానీ.. 37 థియేటర్లతో నేను శాసించగలనా? సంవత్సరంలో ఎప్పుడూ.. ఏదో రకంగా మా సినిమా ఉంటూనే ఉంటుంది. అందుకే ఎగ్జిబిటర్స్ మాకు ఇంపార్టెన్స్ ఇస్తారు. వ్యాపారంగా నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి కదా. నా వ్యాపారం పక్కన పెట్టి.. వేరొకరికి సినిమా ఇవ్వలేను కదా. ఎప్పుడు సంక్రాంతి వచ్చినా.. నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అందుకే 4 ఇయర్స్ హిస్టరీ చెప్పాను. ఇప్పుడు కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదు. ప్రాబ్లమ్ లేకుండానే ప్రాబ్లమ్ క్రియేట్ చేశారు. ఎందుకంటే దిల్ రాజు అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. ప్రతి సంక్రాంతికి నేను ఫిక్స్ అయ్యాను అంతే..’’ అని దిల్ రాజు ‘వారసుడు’ వివాదంపై వివరణ ఇచ్చారు.  
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Recommended image2
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Recommended image3
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved