MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి, గుంటూరు కారం కూడా అంతే.. దిల్ రాజు

మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి, గుంటూరు కారం కూడా అంతే.. దిల్ రాజు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. మహేష్, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం శుక్రవారం రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 13 2024, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. మహేష్, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం శుక్రవారం రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. రిలీజ్ రోజున ఒక రేంజ్ లో మహేష్ అభిమానుల హంగామా కనిపించింది. అయితే తొలి షో నుంచే గుంటూరు కారం చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలయింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్, క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ ఈ చిత్రంలో ఎక్కడా కనిపించలేదు అంటూ అభిమానులు గోల చేశారు. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్, శ్రీలీల డ్యాన్సులు తప్ప ఈ మూవీలో పాజిటివ్ అంశాలు ఇంకేమి లేవని కామెంట్స్ వినిపించాయి. 

36

అయితే మహేష్ బాబు క్రేజ్ తో ఈ చిత్రంతొలి రోజు 94 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం తొలి రోజు 80 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా మహేష్ బాబు క్రేజ్ వల్లే సాధ్యం. అయితే రెండవ రోజు నుంచి కలెక్షన్స్ ఎలా ఉంటాయో అనేది వేచి చూడాలి. మరోవైపు హను మాన్ చిత్రం యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. 

46

ఈ క్రమంలో గుంటూరు కారం నిర్మాత నాగవంశీ, ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. దిల్ రాజు మాట్లాడుతూ.. రాత్రి 1 గంటకు ప్రదర్శించిన బెనిఫిట్ షోలు, ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చిన మాట వాస్తవమే అని అన్నారు. నేను కూడా సోషల్ మీడియాలో యావరేజ్ అని, మిక్స్డ్ టాక్ చూశాను. 

 

56

కానీ ప్రతి షోకి టాక్ మారుతోంది అని దిల్ రాజు అన్నారు. త్రివిక్రమ్ డైలాగులకు, మహేష్ క్యారెక్టర్ కి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెనింగ్ షోలు ప్రారంభమయ్యే సరికి టాక్ కాస్త మారింది. గతంలో నెగిటివ్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్స్ అయిన చిత్రాలు చాలా ఉన్నాయి అని అదిల్ రాజు అన్నారు. 

66

అయితే గుంటూరు కారం ఏ రేంజ్ కి వెళుతుంది అనేది పండగ తర్వాత వచ్చిన లెక్కల బట్టే అర్థం అవుతుందని అన్నారు. ప్రతి సంక్రాంతికి సినిమాల విషయంలో పోటీ, గొడవలు సహజమే. ఎందుకంటే ఇది బిజినెస్ కాబట్టి అని దిల్ రాజు అన్నారు. నిర్మాత నాగవంశీ కూడా అదే విషయాన్నీ చెప్పారు. ఈవెనింగ్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే సరికి నెగిటివ్ టాక్ బాగా తగ్గింది అని అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Recommended image2
100 కోట్ల క్లబ్‌లో సూర్య ఆరో సినిమా.. లిస్టులో ఇంకా ఏ మూవీస్ ఉన్నాయంటే?
Recommended image3
60 ఏళ్లలోనూ 20ల ఎలా? సల్మాన్ ఖాన్ ఇంత ఫిట్‌గా ఉండటానికి.. ఆఒక్కటి అస్సలు తినడని తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved