తన రెమ్యునరేషన్ డబుల్ చేసిన శ్రీలీల, టాలీవుడ్ నిర్మాతలకు బిగ్ షాక్ ?
టాలీవుడ్‌లో యువ నటిగా వేగంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి శ్రీలీల తన రెమ్యునరేషన్ విషయంలో వార్తల్లో నిలిచింది.

టాలీవుడ్‌లో యువ నటిగా వేగంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల మరోసారి వార్తల్లో నిలిచింది. వరుస చిత్రాలతో శ్రీలీల దూసుకుపోతోంది. ఈసారి శ్రీలీల తన రెమ్యునరేషన్ విషయంలో వార్తల్లో నిలిచింది.శ్రీలీల భారీగా తన రెమ్యునరేషన్ పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ చిత్రంలోని ఆమె స్పెషల్ డాన్స్ నంబర్ ‘కిస్సిక్’ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సాంగ్ వైరల్ కావడంతో ఆమెకు క్రేజ్ బాగా పెరిగింది. దీంతో పాటు బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్ సరసన ఆమె భారీ ప్రాజెక్ట్‌తో ఎంట్రీ ఇవ్వనుండటం సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
అయితే శ్రీలీల ఇటీవల అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనితో శ్రీలీల టాలీవుడ్ చిత్రాలని తగ్గిస్తోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే శ్రీలీల తన పారితోషికాన్ని రెండు రెట్లు పెంచిందని వార్తలు వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం ఒక సినిమాకు రూ. 7 కోట్లు డిమాండ్ చేస్తోందని, ఇది గతంలో తీసుకుంటున్న రూ. 3.5 నుంచి 4 కోట్లు కంటే రెండింతలు అని సమాచారం. రెమ్యునరేషన్ పెంచడం వల్లే ఆమె టాలీవుడ్ చిత్రాలకు దూరం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పుష్ప 2 సినిమాలో డాన్స్ నంబర్‌కు శ్రీలీలకు సుమారు రూ. 2 కోట్లు పారితోషికంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ పాట ఆమె పాపులారిటీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించిందని పరిశీలకులు భావిస్తున్నారు.మొత్తంగా శ్రీలీల తన రెమ్యునరేషన్ ని రెట్టింపు చేయడం నిర్మాతలకు షాకింగ్ పరిణామమే అని చెప్పాలి.
ఇక శ్రీలీల లెనిన్ సినిమా నుంచి వైదొలిగిన విషయం మరోసారి హాట్ టాపిక్ అయింది. శ్రీలీల ప్రస్తుత డేట్స్ ఇప్పటికే ఇతర ప్రాజెక్టులకు కేటాయించబడి ఉండటంతో లెనిన్ షూటింగ్ షెడ్యూల్‌తో క్లాష్ అవుతున్నాయి. ఆమె డేట్లను రీషెడ్యూల్ చేయాలనుకున్నా, చివరకు వీలుకాలేదు అని వార్తలు వస్తున్నాయి.అయితే శ్రీలీల లెనిన్ మూవీ నుంచి తప్పుకోవడానికి అసలైన కారణం ఏంటి అనేది క్లారిటీ లేదు.
ప్రస్తుతం శ్రీలీల రవితేజ మాస్ జాతర, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో ఆమె కార్తీక్ ఆర్యన్ సరసన ఆషికి 3 చిత్రంలో నటిస్తోంది.