MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీజ, శిరీష్‌లకు మరో కొడుకు ఉన్నాడా? శిరీష్‌ భరద్వాజ్‌ తల్లి ఏం చెప్పిందంటే? చనిపోవడానికి కారణం ఏంటంటే?

శ్రీజ, శిరీష్‌లకు మరో కొడుకు ఉన్నాడా? శిరీష్‌ భరద్వాజ్‌ తల్లి ఏం చెప్పిందంటే? చనిపోవడానికి కారణం ఏంటంటే?

శ్రీజ మాజీ భర్త శిరీష్‌ భరద్వాజ్‌ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. శిరీష్‌కి మరో కొడుకు ఉన్నాడనే వార్తలు వైరల్‌గా మారిన క్రమంలో ఆయన తల్లి స్పందించింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 03 2024, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, శిరీష్‌ భరద్వాజ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లు కలిసి ఉన్నారు. అనంతరం విడిపోయారు. వీరికి కూతురు నివృతి ఉంది. అనంతరం శ్రీజ కళ్యాణ్‌ దేవ్‌ని వివాహం చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరు కూడా విడిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇదిలా ఉంటే శిరీష్‌కి కూతురు నివృతితోపాటు కొడుకు కూడా ఉన్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఓ మహిళా సామాజికవేత్త యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో శిరీష్‌కి కొడుకు కూడా ఉన్నాడనే ఆరోపణలు చేసింది. ఈ కామెంట్స్ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై శిరీష్‌ భరద్వాజ్‌ తల్లి స్పందించారు. ఆమె ఆద్య టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది. 
 

37
pic-aadhya tv

pic-aadhya tv

శిరీష్‌కి కొడుకు ఉన్నాడనేది పూర్తి రాంగ్‌ న్యూస్‌ అని, ఆమె ఫాల్స్ అలిగేషన్స్ చేసిందని తెలిపింది. కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు, కొడుకు ఎలా ఉంటాడని ప్రశ్నించింది. ఆ మహిళా సామాజికవేత్త అనవసరంగా తమ ఫ్యామిలీపై, శిరీష్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని, దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది శిరీష్‌ తల్లి. 
 

47

అయితే ఈ సందర్భంగా మరో ఆశ్చర్యకరమైన వార్త వెల్లడించింది. శిరీష్‌కి రెండో పెళ్లి విషయం  బయటపెట్టింది. ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అయితే ఆయనకు ఇష్టం లేదని, కానీ తన బలవంతంతోనే మ్యారేజ్‌ చేసుకున్నారని, ఆ బంధం అంతంత మాత్రంగానే ఉందని, మంచిగా నడవలేదని వెల్లడించింది. రెండో భార్య విడాకులకు సంబంధించి కేసు వేద్దామనుకుందని, కానీ ఆ తర్వాత విరమించుకుందని, అనంతరం శిరీష్‌ అనారోగ్యంతో కన్నుమూయడం జరిగిపోయిందని చెప్పింది శిరీష్‌ తల్లి. 
 

57

శిరీష్‌ భరద్వాజ్‌ మరణానికి సంబంధించి ఆమె మాట్లాడుతూ, పెళ్లిళ్లు విఫలం కావడంతో చాలా బాధపడ్డాడని, డిస్టర్బ్ అయ్యాడని తెలిపింది. తాగుడుకి బానిస అయినట్టు వార్తలు వస్తోన్న నేపథ్యంలో మరీ అంత తాగేవాడు కాదని, అందరిలాగే తీసుకునేవాడని, దానివల్లే చనిపోయాడనేది నిజం కాదని చెప్పింది. లివర్‌ పాడైంది, దానివల్లే చనిపోయాడనేది నిజం కాదు, అదంతా ఫాల్స్ న్యూస్‌ అని, తప్పుగా ప్రచారం చేశారని చెప్పింది. అనారోగ్యంతో ఆయన నెల రోజులకు ముందే జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యాడట. ఈ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న క్రమంలోనే గుండెపోటు వచ్చిందని చెప్పింది. 
 

67

శిరీష్‌ చాలా మంచి వాడని, చాలా మందికి సహాయంచేశాడని తెలిపింది. మోడీ నుంచి, కిషన్‌ రెడ్డి వరకు అందరితోనూ పరిచయాలున్నాయి. వాటి ద్వారా చాలా మందికి హెల్ప్ చేశాడు.కానీ ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదని ఆవేదన చెందింది. కిషన్‌రెడ్డి వంటి వారు ఫోన్‌లో మాట్లాడారని,వాళ్లు ఎప్పుడూ సపోర్ట్ గానే ఉన్నారు, కానీ శిరీష్‌ని వాడుకున్న వాళ్లే ఇప్పుడు కనిపించడం లేదని తెలిపింది శిరీష్‌ తల్లి. పీజీఆర్‌ ఫ్యామిలీతో తమకి రిలేషన్స్ ఉన్నట్టు గా వెల్లడించింది శిరీష్‌ తల్లి. 

77
pic-aadhya tv

pic-aadhya tv

ఈ సందర్భంగా ఆమె శిరీష్‌పై అనవసరమైన ఆరోపణలు చేయోద్దని, మమ్మల్ని బ్లేమ్‌ చేయోద్దని రిక్వెస్ట్ చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు ఆరోపణలు చాలా బాధగా ఉన్నాయని, ఇప్పటికే కొడుకు పోయిన బాధలో ఉన్నాం, పైగా ఈ ఆరోపణలు మరింత బాధ పెడుతున్నాయని చెప్పింది. శ్రీజ మాజీ భర్త శిరీష్‌ భరద్వాజ్‌ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved