- Home
- Entertainment
- అనసూయ మగాళ్ల కంటపడకుండా దాచుకుని తిరిగిందా?.. తన జీవితంలో ఎవరికీ తెలియని రహస్యాలు.. అసలు డ్రీమ్ ఏంటంటే?
అనసూయ మగాళ్ల కంటపడకుండా దాచుకుని తిరిగిందా?.. తన జీవితంలో ఎవరికీ తెలియని రహస్యాలు.. అసలు డ్రీమ్ ఏంటంటే?
అనసూయ ఇప్పుడు స్టార్ యాంకర్‌గా, నటిగా రాణిస్తుంది. తాజాగా ఆమె జీవితంలో ఉన్న చాలా రహస్యాలు బయటకొచ్చాయి. తన డ్రీమ్, పడ్డ కష్టాలు రివీల్ అయ్యాయి.

అనసూయ పేరుకు సోషల్ మీడియా ఊగిపోతుంది. ఆమెపై తరచు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. నెటిజన్లు ఆమెపై కామెంట్లు చేయడం, దానికి అనసూయ కౌంటర్లు ఇవ్వడంతో రచ్చ రచ్చ అవుతుంటుంది. కానీ సోషల్ మీడియాలో చాలా మంది దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. మొత్తంగా అనసూయ తరచూ ఇంటర్నెట్‌కి కంటెంట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఏదో రకంగా తను కూడా వార్తల్లో నిలుస్తుంది.
anasuya instagram
అయితే ఈ సారి ఆమె మరోలా వార్తల్లో నిలిచింది. తాను పడ్డ కష్టాల విషయంలో చర్చల్లో నిలిచింది. తన డ్రీమ్ విషయంలో, తనకున్న ఫాలోయింగ్ విషయంలో, తన ఫ్యామిలీలో ఉండే రిస్టిక్షన్స్ విషయంలో వార్తల్లో నిలిచింది. ఎవరికీ తెలియని రహస్యాలు బయటపడ్డాయి. మరి అసలు అనసూయ గతం ఏంటి? కాలేజ్ డేస్‌లో ఏం చేసేదో చూస్తే..
అనసూయ.. కాలేజ్ చదువుకునే సమయంలో చాలా ఫాలోయింగ్ ఉండేదట. పొరగాళ్లు ఆమె వెంటపడేవారట. ఆమె ఫాలోయింగ్‌కి అంతా షాక్. అంతేకాదు ఏకంగా వాళ్ల కంటపడకుండా దాచుకుని, దాచుకుని తిరగేదట. ఆ సమయంలో తనని కాపాడుకోవడం చాలాకష్టంగా మారిందట. ఈ విషయాన్ని ఆమె ఎన్‌సీసీ ట్రైనింగ్ ఆఫీసర్ సరోజ బాలా వెల్లడించారు. ఎప్పుడు ఎవరు పడేస్తారో అనే భయంతో తిరిగేదట అనసూయ.
అంతేకాదు దాచుకుని దాచుకుని తిరిగే క్రమంలో సీసీ కెమెరాల్లో అనసూయని సుశాంత్ చూశాడట. ఆమెకి ఫిదా అయినా ఆయన ఆమెని పడేసే కార్యక్రమం పెట్టుకున్నాడట. మొత్తంగా పడేయడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం జరిగిందట. అయితే ఆ రిలేషన్ చాలా సీక్రెట్‌గా మెయింటేన్ చేయాల్సి వచ్చిందట. ఈ క్రమంలో కనీసం ఒక్క ఫోటో కూడా తీసుకోలేదని చెప్పింది అనసూయ.
తన ఫ్యామిలీలో చాలా రిస్టిక్షన్స్ ఉండేవాట. ఏదైనా కల్చరల్ ఈవెంట్‌కి వెళ్లాలంటే, బయటకు వెళ్లాలంటే వెళ్లనిచ్చే వారు కాదని, చాలా రూల్స్ పెట్టేవారని, దీంతో చాలా ఇబ్బంది పడిందని చెప్పింది ట్రైనింగ్ ఆఫీసర్ సరోజా బాలా. తానే ఆమెని ఇంటినుంచి తీసుకెళ్లి డ్రాప్ చేసేదాన్ని అని, ఆ సమయంలో చాలా కష్టపడిందని చెప్పింది.
ఈ క్రమంలో మరో రహస్యాన్ని వెల్లడించింది. నిజానికి కాలేజ్ టైమ్‌లో ఆమెకి డాక్టర్ కావాలనుకుందని, కానీ యాంకర్ అయ్యిందని చెప్పింది. డాక్టర్ కాలేనందుకు బాధ లేదని, కానీ యాంకర్‌గా, నటిగా ఈ స్థాయికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉందని చెప్పింది ఆ సరోజబాలా. ఆమె గర్వపడుతున్నందుకు తనకు గర్వంగా ఉందని, అప్పటి తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు.
ఇదంతా శ్రీముఖి యాంకర్ గా, అనసూయ, శేఖర్ మాస్టర్ జడ్ట్ లుగా వ్యవహరిస్తున్న `కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షోలోని సన్నివేశాలు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.