MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun, స్నేహారెడ్డిది లవ్‌ మ్యారేజ్‌ కాదా? ఎవరికీ తెలియని నిజం చెప్పిన బన్నీ, వామ్మో ఇంత జరిగిందా?

Allu Arjun, స్నేహారెడ్డిది లవ్‌ మ్యారేజ్‌ కాదా? ఎవరికీ తెలియని నిజం చెప్పిన బన్నీ, వామ్మో ఇంత జరిగిందా?

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. అల్లు స్నేహారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? తెరవెనుక జరిగిన కథ వేరే ఉందా? పెళ్లికి ముందే ఈ ఇద్దరికి పరిచయం ఉందా? ఎవరికీ తెలియని విషయాలను బన్నీ బయటపెట్టాడు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 25 2026, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇటీవలే 15వ మ్యారేజ్‌ యానివర్సరీ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి
Image Credit : @Varinder Chawla

ఇటీవలే 15వ మ్యారేజ్‌ యానివర్సరీ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి

అల్లు అర్జున్‌ ఇప్పుడు ఐకాన్‌స్టార్‌గా రాణిస్తున్నారు. `పుష్ప 2`తో ఆయన ఇమేజ్‌ పాన్‌ ఇండియా దాటిపోయింది. ఇప్పుడు గ్లోబల్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో ఆయన `ఏఏ 22` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ ఇటీవల తన 15వ మ్యారేజ్‌ యానివర్సరీ సెలబ్రేట్‌ చేసుకున్నారు. స్నేహారెడ్డిని ఆయన 2011 మార్చి 6న వివాహం చేసుకున్నారు.  వీరిద్దరు మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారు. ఆదర్శ జంటగా రాణిస్తున్నారు. అయితే వీరిది ప్రేమ పెళ్లి అనే వార్తలు కూడా వచ్చాయి.

25
అల్లు అర్జున్‌ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా?
Image Credit : our own

అల్లు అర్జున్‌ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా?

అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారనే వార్తలు అడపాదడపా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు అంత క్లోజ్‌గా ఉంటారు. దీంతో బన్నీది లవ్‌ మ్యారేజ్‌ అనే కామెంట్స్ వచ్చాయి. ఈ విషయం ఆయన వరకు వెళ్లింది. దీంతో బన్నీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలు రావడానికి కారణమేంటో తెలిపారు. తమది నిజంగానే లవ్‌ మ్యారేజా? అరెంజ్‌ మ్యారేజా అనే విషయాన్ని అల్లు అర్జున్‌ చెప్పాడు. ఈ క్రమంలో  ఎవరికీ తెలియని విషయాలను ఆయన బయటపెట్టాడు.

Related Articles

Related image1
Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? టాలీవుడ్‌లోనే అదొక సంచలనం
Related image2
Savitri: జెమినీ గణేషన్‌ని సావిత్రి పెళ్లి చేసుకోవడానికి కారణమైన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? అన్నా అని పిలిచి
35
స్నేహారెడ్డి ముందే పరిచయం, కానీ
Image Credit : our own

స్నేహారెడ్డి ముందే పరిచయం, కానీ

`మాది ప్రేమ పెళ్లి అనుకుంటారు. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లినే` అని స్పష్టం చేశారు అల్లు అర్జున్‌. స్నేహ తనకు మంచి స్నేహితురాలు అని, తమ ఇద్దరి అభిరుచులు కలిశాయని, `మీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది` అని తన ఫ్రెండ్స్ చెప్పారని,  ఆ తర్వాత తాను కూడా ఆ దిశగా ఆలోచించినట్టు చెప్పాడు అల్లు అర్జున్‌. ఆ తర్వాత మూడు నెలలు గడిచాక ఇంట్లో వాళ్లు ఏకంగా పెళ్లి సంబంధమే చూశారట. ఈ సంబంధాన్ని ఫిక్స్ చేసినట్టు తెలిపాడు బన్నీ.

45
ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని చేసుకోవద్దు అనుకున్న బన్నీ
Image Credit : our own

ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని చేసుకోవద్దు అనుకున్న బన్నీ

ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని చెప్పాడు అల్లు అర్జున్‌. ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని ముందే అనుకున్నాడట. అయితే దానికి ప్రత్యేక కారణం ఏం లేదన్నాడు. మన ఆలోచన దృక్పథం ఇంకాస్త విస్తృతమవ్వడానికి మరో రంగానికి చెందిన వాళ్లతో కలిసి ఉంటే మంచిదని, స్నేహకు సినిమాల గురించి పెద్దగా తెలియదని, తమ ఇద్దరి మైండ్‌ సెట్‌ వేరు అని, భిన్న ధృవాలు పరస్పరం ఆకర్షించుకుంటాయని అంటారు. అలా తమ బంధం మరింత బలపడిపోయిందని చెప్పాడు బన్నీ. కొన్నేళ్ల క్రితం ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌ ఈ విషయాలను పంచుకున్నారు.

55
సోషల్‌ మీడియాలో ఫుల్‌యాక్టివ్‌గా ఉంటోన్న అల్లు స్నేహారెడ్డి
Image Credit : our own

సోషల్‌ మీడియాలో ఫుల్‌యాక్టివ్‌గా ఉంటోన్న అల్లు స్నేహారెడ్డి

అల్లు అర్జున్‌, స్నేహా రెడ్డి 2011లో పెళ్లి చేసుకోగా, వీరికి కొడుకు అయాన్‌, కూతురు అర్హ జన్మించారు. అల్లు స్నేహారెడ్డి పొలిటికల్‌ ఫ్యామిలీ. నాన్న కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి వ్యాపారవేత్త. రాజకీయనాయకుడు. విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. అల్లు స్నేహారెడ్డి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడున్నస్టార్స్ హీరోల భార్యల్లో అత్యంత యాక్టివ్‌గా ఉన్నది స్నేహారెడ్డినే. ఆమె సోషల్‌ మీడియాలో రెగ్యూలర్‌ గా పోస్ట్ లు పెడుతుంది. ఫిట్‌నెస్‌ వీడియోలు, షాపింగ్‌ వీడియోలు, తమ పిల్లల వీడియోలు పంచుకుంటుంది. కొత్త కొత్తవి ఎక్స్ ఫ్లోర్‌ చేస్తుంటుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood: మోహ‌న్ బాబును కాపీ కొట్టిన మ‌హేష్ బాబు.. 35 ఏళ్ల క్రిత‌మే పోకిరీ సీన్‌. వైర‌ల్ వీడియో
Recommended image2
Brahmamudi Serial Today Episode: సొంత ఇంటికే కన్నం వేసిన ఐశ్వర్య, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు
Recommended image3
Karthika Deepam 2 Today Episode:దీప భయం-మెంటల్ షాక్‍లో సుమిత్ర-దశరథ కంగారు-జ్యోకు కార్తీక్ వార్నింగ్
Related Stories
Recommended image1
Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? టాలీవుడ్‌లోనే అదొక సంచలనం
Recommended image2
Savitri: జెమినీ గణేషన్‌ని సావిత్రి పెళ్లి చేసుకోవడానికి కారణమైన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? అన్నా అని పిలిచి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved