- Home
- Entertainment
- చేతులు పైకెత్తి కుర్రాళ్లని రెచ్చగొడుతూ `ఢీ` భామ కైపెక్కించే పోజులు.. ఆ విరహ వేదన చూడతరమా!
చేతులు పైకెత్తి కుర్రాళ్లని రెచ్చగొడుతూ `ఢీ` భామ కైపెక్కించే పోజులు.. ఆ విరహ వేదన చూడతరమా!
హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మెప్పించిన నందిత శ్వేత ఇప్పుడు `ఢీ`లో సందడి చేస్తుంది. షో కోసం ఆమె గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. మత్తెక్కించే పోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.

`ఢీ`లో జడ్జ్ గా రాణిస్తూ విశేష ఆదరణ పొందుతుంది నందిత శ్వేత(Nandita Swetha). హీరోయిన్‌గా అనుకున్న ఆఫర్స్ రాలేకపోయినప్పటికీ ఇప్పుడీ డాన్స్ షోతో మాత్రం మంచి గుర్తింపుతోపాటు క్రేజ్‌ని తెచ్చుకుంటుంది. వరుస ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ సోషల్ మీడియా అభిమానులను ఎంగేజ్ చేస్తుంది నందిత.
తాజాగా రెడ్ కలర్ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. నడుము అందాలను, బెల్లీ షోని లెహంగా దాయగా, చేతులు పైకెత్తి సోకులు చూపిస్తుంది నందిత శ్వేత. విరహ వేదనతో కూడిన ఆమె కైపెక్కించే పోజులు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో నెటిజన్లు హాట్ కామెంట్లు చేస్తున్నారు. ఇంతటి విరహ వేదన చూడతరమా అంటున్నారు.
బెంగుళూరుకి చెందిన నందితా శ్వేత `నాందా లవ్స్ నందితా` చిత్రంతో కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఆమెకి సరైన గుర్తింపు తేలేకపోయింది. ఆ తర్వాత నాలుగేండ్ల గ్యాప్ తర్వాత 2012లో `అట్టకత్తి` చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మంచి గుర్తింపు పొందింది. నటిగా, గ్లామర్ పరంగా కనువిందు చేసింది. దీంతో ఆమెకి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.
2013 నుంచి వరుసగా తమిళంలో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అయితే 2016లో `ఎక్కడికి పోతావు చిన్నవాడా` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఘోస్ట్ పాత్రలో కనిపించి అలరించింది. గ్లామర్ సైడ్ కూడా మంచి ట్రీట్‌నిచ్చింది. అయితే తమిళంలో సక్సెస్ అయినట్టుగా, తెలుగులో సక్సెస్ కాలేకపోవడం గమనార్హం.
తెలుగులో ఆ తర్వాత నటించిన `శ్రీనివాస కళ్యాణం`, `బ్లఫ్ మాస్టర్`, `ప్రేమ కథ చిత్రం 2`, `అభినేత్రి 2`, `7`, `కల్కీ`, `కపటదారి`, `అక్షర` చిత్రాల్లో నటించింది. ఇందులో ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు. దీంతో నందితా శ్వేతకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. ఈ క్రమంలో ఆమెకి `ఈటీవీ` లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు.
ఈటీవీలో ప్రసారమయ్యే డాన్సు షో `ఢీ` లో జడ్జ్ గా ఎంటర్ అయ్యింది. పూర్ణ స్థానంలో జడ్జ్ గా వచ్చింది నందితా శ్వేత. వచ్చీ రావడంతోనే యమ క్రేజ్‌ని సొంతం చేసుకుంటుంది. చలాకీ తనంతో, అల్లరితనంతో, ఫుల్ ఎనర్జీతో షో రక్తికట్టడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. రష్మి, దీపికా పిల్లి లు లేని లోటుని నందిత భర్తీ చేస్తుండటం విశేషం.
పూర్ణ గ్లామరస్‌గా కనువిందు చేసేది. అప్పుడప్పుడు ముద్దుముద్దు మాటలతో, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌లతో డబుల్ మీనింగ్ డైలాగ్‌లకు బలవుతూ ఎంటర్‌టైన్ చేసేది. ఇప్పుడు ఆమె స్థానాన్ని నందితా శ్వేత భర్తీ చేస్తుంది. అయితే పూర్ణని మించి హంగామా చేస్తూ మరింతగా పాపులర్ అవుతుంది నందితా శ్వేత. చిలిపి పనులతో మరింత హాట్ టాపిక్ అవుతుంది.
ఈ షో కోసం గ్లామరస్‌గా ముస్తాబై హోయలు పోతూ వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకోగా అవి తెగ ఆకట్టుకుంటున్నాయి. పొట్టి దుస్తుల్లో తన హాట్ థైస్ తో, క్లీవేజ్ అందాలతో రచ్చ చేస్తుంది. ఇటీవల కాలంలో నందిత పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు నందిత సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా భారీగా పెరగడం విశేషం.
తెలుగులో అవకాశాలు లేని ఈ సమయంలో నందితా శ్వేతకి `ఢీ` షోలో ఛాన్స్ రావడం లక్కీగా భావించవచ్చు. ఈ షోతో ఆమెకి మంచి గుర్తింపు, పాపులారిటీ, ఫాలోయింగ్ వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి నందితా ఈ షోని తన కెరీర్‌కి ఏ విధంగా మలుచుకుంటుందనేది చూడాలి.