MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హేమ మాలినితోనే కాదు, ఈ ఐదుగురు హీరోయిన్లతో ధర్మేంద్ర లవ్‌ ఎఫైర్స్.. వామ్మో మన్మథుడే

హేమ మాలినితోనే కాదు, ఈ ఐదుగురు హీరోయిన్లతో ధర్మేంద్ర లవ్‌ ఎఫైర్స్.. వామ్మో మన్మథుడే

Dharmendra Love Affairs: ధర్మేంద్ర సినిమా జీవితమే కాదు, పర్సనల్‌ లైఫ్‌ కూడా చాలా పెద్దదే. అందులో ప్రేమ కథలు చాలానే ఉన్నాయి.  ధర్మేంద్ర జీవితంలోకి వచ్చిన హీరోయిన్లు ఎవరు,  లవ్ ఎఫైర్స్ గురించి తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 24 2025, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
 సినిమాల్లోకి రాకముందే ప్రకాష్‌ కౌర్‌తో పెళ్లి
Image Credit : Social Media

సినిమాల్లోకి రాకముందే ప్రకాష్‌ కౌర్‌తో పెళ్లి

బాలీవుడ్ హీ-మ్యాన్ ధర్మేంద్ర మరణంతో ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ధర్మేంద్ర లవ్‌ స్టోరీస్‌ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తున్నాయి.  అయితే ధర్మేంద్రకి సినిమాల్లోకి రాకముందే పెళ్లి అయ్యింది. ఆయన 1954లో ప్రకాష్‌ కౌర్‌ని పెళ్లి చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వీరికే సన్నీడియోల్‌, బాబీ డియోల్‌, విజేతా, అజీతా జన్మించారు.   

26
ధర్మేంద్ర లవ్‌ ఎఫైర్స్.. ఫస్ట్ మీనా కుమారి
Image Credit : Social Media

ధర్మేంద్ర లవ్‌ ఎఫైర్స్.. ఫస్ట్ మీనా కుమారి

ధర్మేంద్ర సినిమాల్లో రాణించాక అనతి కాలంలోనే స్టార్‌ అయిపోయాడు. ఆయన అందంతో ఎంతోమందిని ఆకర్షించాడు.  నటుడిగానూ విశేష క్రేజ్‌ అందుకున్న నేపథ్యంలో హీరోయిన్లు  ఆయన వెంటపడేవారట. ఈ క్రమంలో చాలా మంది హీరోయిన్లతో ధర్మేంద్ర లవ్‌ ట్రాక్‌లు నడిపించారని టాక్‌. అందులో భాగంగా ఒకప్పుడు ధర్మేంద్రకు మీనా కుమారి అంటే చాలా ఇష్టం. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో పనిచేశారు. ఆ సమయంలో డేటింగ్ మొదలుపెట్టి, కొంతకాలానికి విడిపోయారట. 

Related Articles

Related image1
ధర్మేంద్ర ఫ్యామిలీ డిటెయిల్స్.. స్టార్స్ గా రాణిస్తోన్న కుమారులు, కానీ వారిని దూరం పెట్టిన లెజెండరీ నటుడు
Related image2
లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూత.. శోకసంద్రంలో భారతీయ సినిమా
36
హీరోయిన్‌ రాఖీతోనూ లవ్‌ స్టోరీ న్యూస్‌
Image Credit : Social Media

హీరోయిన్‌ రాఖీతోనూ లవ్‌ స్టోరీ న్యూస్‌

 ధర్మేంద్ర, రాఖీలు కలిసి పలు సినిమాలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరి స్నేహం ఏర్పడింది.  అది కాస్త ప్రేమగా మారిందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఆ తర్వాత ఈ వార్తలను వాళ్ళు ఖండించారు.

46
ఆశా పరేఖ్‌తో
Image Credit : Social Media

ఆశా పరేఖ్‌తో

ధర్మేంద్ర అప్పట్లో స్టార్‌ హీరోయిన్‌ ఆశా పరేఖ్‌తో  డేటింగ్‌ చేశారట. ఈ ఇద్దరు కలిసి తిరిగారని వార్తలొచ్చాయి. అయితే, ఆశాకు అప్పటికే పెళ్లి కావడంతో వారి బంధం ముందుకు సాగలేదు.

56
హేమా మాలినితో స్ట్రక్‌ అయిపోయిన ధర్మేంద్ర
Image Credit : Social Media

హేమా మాలినితో స్ట్రక్‌ అయిపోయిన ధర్మేంద్ర

వీరందరి తర్వాత ధర్మేంద్ర మనసు హేమ మాలినిపై పడింది. ఇద్దరూ డేటింగ్ చేసుకుని, కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లి బంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. చివరి వరకు కలిసే ఉన్నారు. వీరికి కూతుళ్లు ఈషా డియోల్‌, ఆహానా డియోల్‌ జన్మించారు.

66
హేమా మాలిని తర్వాత కూడా?
Image Credit : Social Media

హేమా మాలిని తర్వాత కూడా?

హేమ మాలినితో పెళ్లి తర్వాత ధర్మేంద్ర పేరు అనితా రాజ్‌తో వినిపించింది. సినిమా షూటింగ్‌లో ఇద్దరూ దగ్గరయ్యారు. ఈ విషయం హేమకు తెలియడంతో ఆమె గట్టి వార్నింగ్‌ ఇచ్చిందట. దీంతో వీరిద్దరు దూరం కావాల్సి వచ్చింది. ఇలా ఐదుగురు హీరోయిన్లతో ధర్మేంద్ర లవ్‌ ఎఫైర్స్ నడిపించారని బాలీవుడ్‌ టాక్‌. ఇందులో నిజమెంతా అనేది వాళ్లకే తెలియాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Sneha Ullal: ఐశ్వర్య రాయ్‌లా ఉన్నందుకే సల్మాన్ ఛాన్స్ ఇచ్చాడు.. ఇన్నేళ్ల తర్వాత సీక్రెట్ చెప్పిన స్నేహా ఉల్లాల్
Recommended image2
Lavanya Tripathi: డైరెక్టర్ వేధించాడు.. సినిమా వదిలేస్తే కేసు పెట్టారు.. మెగా కోడలు బయటపెట్టిన నిజం
Recommended image3
Krishnam Raju Favorite Hero: కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన సినిమా వస్తుందంటే టీవీకి అతుక్కుపోతాడు
Related Stories
Recommended image1
ధర్మేంద్ర ఫ్యామిలీ డిటెయిల్స్.. స్టార్స్ గా రాణిస్తోన్న కుమారులు, కానీ వారిని దూరం పెట్టిన లెజెండరీ నటుడు
Recommended image2
లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూత.. శోకసంద్రంలో భారతీయ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved