- Home
- Entertainment
- దూకుడు పెంచిన ధనుష్.. ‘నేనే వస్తున్నా’ నుంచి అదిరిపోయే సాంగ్ ఔట్.. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.!
దూకుడు పెంచిన ధనుష్.. ‘నేనే వస్తున్నా’ నుంచి అదిరిపోయే సాంగ్ ఔట్.. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.!
తమిళ స్టార్ హీరో ధనుష్ గ్యాప్ ఇవ్వకుండా వరుస పెట్టి చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. నిన్ననే ‘సార్’ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయగా.. తాజాగా ‘నేనే వస్తున్నా’ చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటారు. విభిన్న కథలతో అలరిస్తున్న ధనుష్ ప్రస్తుతం వరుస పెట్టి చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. గ్యాప్ ఇవ్వకుండా ఒక్కో చిత్రాన్ని విడుదల చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు.
రోటీన్ కు భిన్నంగా కథలను ఎంచుకుంటున్న సౌత్ స్టార్ ధనుష్.. ఈ ఏడాది ఇప్పటికే మూడు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ధనుష్ - మాళవికా మోహనన్ జంటగా నటించిన ‘మారన్’ చిత్రం ఈ ఏడాది మార్చి 11న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఆ వెంటనే ధనుష్ నటించిన హాలీవుడ్ ఫిల్మ్ కూడా విడుదలైంది.
హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించిన ‘ది గ్రే మ్యాన్’ చిత్రంలో ధనుష్ కీలక పాత్ర పోషించించారు. ఈ చిత్రం కూడా ‘మారన్’ విడుదలైన మూడు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 22న ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’లో ఈ హాలీవుడ్ చిత్రాన్ని విడుదల చేశారు. భారీ బడ్జెట్ తో రూపొందించగా.. $500 మిలియన్ డాలర్ల ను వసూల్ చేసింది.
ఇదిలా ఉంటే గతనెలలోనే కామెడీ డ్రామా ‘తిరుచిత్రంబలం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ - ధనుష్ కలిసి నటించిన ఈ చిత్రం ఆగస్టు 18న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. అదేవిధంగా నిన్ననే డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ‘సార్’(SiR) చిత్ర రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా మరో చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ధనుష్ నటించిన మరో లేటెస్ట్ చిత్రం ‘నేనే వస్తున్నా’ (Nene Vasthunna). ఈ చిత్ర రిలీజ్ డేట్ ను కూడా ఈరోజు అనౌన్స్ చేశారు. తమిళంలో ఈ మూవీ ‘ననే వరువేన్’గా రూపుదిద్దుకోగా తెలుగులోనూ డబ్ వెర్షన్ ను రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 29న (ఈ నెలలోనే) గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
ధనుష్, ఇందుజా కలిసి నటిస్తున్న ‘నేను వస్తున్నా’ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. వీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కలైపులి ఎస్. థాను నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మూవీలో ధనుష్ కౌబాయ్‌గా కనిపించనున్నాడు. అలాగే ద్విపాత్రాభినయంలో ఆకట్టుకోనున్నారు. ‘మయక్కం ఎన్నా’ తర్వాత సెల్వరాఘవన్, ధనుష్ కాంబోలో వస్తున్న చిత్రమిది. తాజాగా ఈ చిత్రం నుంచి `వీరా సూర ధీర రారా.. `అంటూ సాగే పాటని విడుదల చేశారు. దీనికి చంద్రబోస్ సాహిత్యం అందించగా, రాహుల్ నంబియార్ ఆలపించారు. ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతుంది.