MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గుడ్ న్యూస్.. మళ్లీ ఒక్కటవ్వబోతున్న ధనుష్ - ఐశ్వర్య.. సూపర్ స్టార్ ఇంట సందడి.!

గుడ్ న్యూస్.. మళ్లీ ఒక్కటవ్వబోతున్న ధనుష్ - ఐశ్వర్య.. సూపర్ స్టార్ ఇంట సందడి.!

కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ - ఐశ్వర్య రజినీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. భేదాభిప్రాయాలతో విడిపోయిన ఈ జంట మళ్లీ ఒక్కటవ్వబోతున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ఇంట సందడి నెలకొంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 05 2022, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కోలీవుడ్ స్టార్ కపుల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తమిళస్టార్ హీరో ధనుష్ (Dhanush) - ఐశ్వర్యా  రజినీకాంత్ (Aishwarya Rajinikanth). సరిగ్గా 9 నెలల కింద ఈ జంట అభిప్రాయ భేదాలతో విడిపోయిన విషయం తెలిసిందే.  వీరు డివోర్స్ పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు కూడా చాలా అప్సెట్ అయ్యారు.
 

26

ఈ ఏడాది ప్రారంభంలోనే ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికన సుధీర్ఘమైన నోట్ ద్వారా ప్రకటించారు. అయితే వీరు ఏ కారణం  చేత విడిపోతున్నారనే విషయం ఎవ్వరికీ తెలియదు. సంవత్సరం కూడా గడవకముందే ఏమైందో ఏమోగానీ ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 

36

ఒకరంటే మరొకరికి అమితమైన ప్రేమాభిమానాలు ఉన్న ధనుష్ - ఐశ్వర్య మళ్లీ ఒక్కటవ్వబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో గట్టగానే ప్రచారం జరుగుతోంది. ఇటీవలనే విడాకులను కూడా రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రజనీకాంత్ ఇంట్లో ఇరు కుటుంబ సభ్యులు సమావేశమైనట్టు  సమాచారం. 
 

46

ఈ సందర్భంగా కుటుంబ పెద్దలు ధనుష్ - ఐశ్వర్య మధ్య గొడవను సద్దుమణిగించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ధనుష్ - ఐశ్వర్య కూడా తమ డివోర్స్ పిల్లల భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం చూపకూడదని, ఇకపై కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారంట. దీంతో రజనీకాంత్ కుటుంబీకులు,  ధనుష్ కుటుంబ సభ్యులు ఖుషీ అవుతున్నారంట. 
 

56

ఈ స్టార్ కపుల్ విడాకుల విషయం అప్పట్లో సంచలనంగా మారింది. విషయం తెలియగానే అభిమానులు, సినీ ప్రముఖులు కూడా వీరిద్దరూ మళ్లీ  ఒక్కటవ్వాలని  కూడా ఆకాంక్షించారు. ప్రస్తుతం వారి బలమైన కోరికే నిజం కాబోతోంది. ఈ మేరకు ధనుష్, ఐశ్వర్య కలుస్తారనే వార్త అభిమానులను సంతోష పెడుతోంది. 
 

66

ఐశ్వర్య - ధనుష్ విడిపోయినప్పటి నుంచి ఎవరి లైఫ్ లో వారు బిజీ అయ్యారు. ధనుష్ మాత్రం సినిమాల్లో ఫుల్ బిజీ అయ్యారు. మూడు నెలలకో సినిమాను రిలీజ్ చేస్తూ వచ్చారు. ఈ ఏడాది ‘మారన్’, ‘ది గ్రేట్ మ్యాన్’,‘తిరుచిత్రంబలం’తో అలరించారు. ‘నేను  వస్తున్నా’,‘వాతీ’,‘సార్’ చిత్రాలు రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’లో నటిస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Gaddar Film Awards: చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు.. కమల్‌కి పైడి జయరాజ్‌ అవార్డ్, జయసుధకి ఏఎన్నార్‌ అవార్డు
Recommended image2
Puneeth Rajkumar: అప్పు చెప్పిన స్పెషల్ చిత్రాన్నం.. పునీత్‌ అసలైనదే మర్చిపోయాడు, నవ్వులే నవ్వులు
Recommended image3
Brahmamudi: రోడ్డుపై రాజుకు బుద్ధి చెప్పిన ఇందు..ఇన్విజిలేటర్ కు దొరికిపోయిన ఐశ్వర్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved