Intinti Gruhalakshmi: నందుకి వార్నింగ్ ఇచ్చిన ధనుంజయ్ దంపతులు.. విక్రమ్ పై చెయ్యెత్తిన జాహ్నవి!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు కాపురాన్ని పాడు చేయాలని చూస్తున్న ఒక సవతి తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో ప్రమాదం కాస్తలో తప్పిపోయింది ఏమాత్రం జాగ్రత్తగా ఉన్న కంటికి తగిలేది అయినా భార్యాభర్తల మధ్యలో దూరాలనుకోవటం ఏమిటి అని కేకలు వేస్తాడు నందు. చిన్న పిల్ల బావతో ఆడాలని ముచ్చట పడింది అయినా అనుకోకుండా జరిగిందానికి ఎందుకు పెద్దది చేస్తున్నారు అంటుంది తులసి. అలా కాదు అత్తయ్య చూసుకోవాలి కదా అంటాడు విక్రమ్.
ఇక ఆ సంగతి వదిలేయండి అని చెప్పి విక్రమ్ సాయంతో దివ్యని ఇంట్లోకి తీసుకు వెళుతుంది. నొప్పిగా ఉందా అని భార్యని అడుగుతాడు విక్రం. మనసుకు తగిలిన గాయం కన్నా పెద్దదేమీ కాదు అంటుంది దివ్య. విక్రం ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కడతాడు ఇప్పుడు ఎలా ఉంది అంటుంది తులసి. నొప్పి ఉన్నట్టుండి మాయమైపోయినట్లుగా ఉంది అంటుంది దివ్య. సరే ఇక ఇంటికి వెళ్దాం అంటాడు విక్రమ్.
రాత్రికి ఉండమంటుంది తులసి. నాకు పని ఉంది దివ్య ఎక్కడ ఉంటాను అంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు అంటాడు విక్రమ్. లేదమ్మా నేను కూడా వెళ్తాను నేను ఇప్పుడు అక్కడే ఉండాలి అంటుంది దివ్య. సీన్ కట్ చేస్తే విక్రమ్ అందరి ముందు తనని తిట్టడాన్ని భరించలేక పోతుంది జాహ్నవి. ఏడుస్తూ సోఫాలో కూర్చుంటుంది ఆమెని తల్లి తండ్రి అత్త ఓదారుస్తూ ఉంటారు.
అయినా బావ అందరిలో నన్ను నామీద అరటమేమిటి నేనేమైనా తన పెళ్ళాన్నా.. అయినా వాళ్ళిద్దరూ బానే ఉన్నారు కదా అత్త ఎందుకు సంతోషంగా లేరని నాతో అబద్ధం చెప్పావు అని రాజ్యలక్ష్మి నిలదీస్తుంది జాహ్నవి. అత్త అబద్ధం చెప్పలేదు నిజంగానే బావని ఒక ఆట ఆడుకుంటుంది ఆ దివ్య నువ్వు వచ్చాకే అతని కళ్ళల్లో ఒక వెలుగు కనిపిస్తుంది అంటాడు బసవయ్య.
నువ్వు గాని ఇప్పుడు బావని పట్టించుకోకుండా వదిలేస్తే నువ్వు వచ్చేటప్పటికి అతనిని ఏ ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలోనూ కలుసుకోవాల్సి వస్తుంది కానీ కూతురికి నచ్చచెప్తాడు బసవయ్య. తండ్రిని ఒక చూపు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జాహ్నవి. మరోవైపు ధనుంజయ్ దంపతులకి కాఫీ తీసుకొని వస్తుంది వాళ్ల కూతురు. తులసి చాలా తెలివైనది సామ్రాట్ ని తన వలన వేసుకోవాలని చూసింది.
అప్పుడు మాజీ బట్ట అడ్డుపడి ఉంటాడు అందుకే ఇప్పుడు హనీకి దగ్గర అవ్వాలని చూస్తుంది అంటుంది ధనుంజయ్ భార్య. ఎందుకు మమ్మీ వంకరగా ఆలోచిస్తావ్ తులసి ఆంటీ మంచిది అంటుంది ధనుంజయ కూతురు. ఆమెని మందలించి లోపలికి పంపించేస్తుందిధనుంజయ్ భార్య. నిన్న కాక మొన్న పరిచయమైంది ఇది కూడా తులసి పార్టీయే అంటూ కోపంతో రెచ్చిపోతుంది.
ఆ తర్వాత హనీ ని డ్రాప్ చేయడానికి వస్తాడు నందు. అప్పుడు ధనుంజయ భార్య తీసుకొచ్చినప్పుడు ఇంత మర్యాదగా తీసుకువచ్చారు కదా తీసుకు వెళ్ళినప్పుడు కూడా అంతే మర్యాదగా తీసుకు వెళ్ళవలసింది మమ్మల్ని అడక్కుండా ఎందుకు తీసుకువెళ్లారు అంటుంది. తులసి హనీ వాళ్ళ తాతయ్యని అడిగాం కదా అంటాడు నందు. అతను ఈ ఇంట్లో ఆశ్రయం పొందిన వ్యక్తి.
అంతేకానీ రక్తసంబంధీకుడమీ కాదు. ఈరోజు తులసి ఎండ చూసుకొని ఆ ముసలాడు కూడా మమ్మల్ని లెక్క చేయటం లేదు. తులసిని ఈ ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్పండి లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరిస్తారు ధనంజయ్ దంపతులు. మీరు అనుకుంటున్నట్లు తులసికి ఈ ఆస్తి అవసరం లేదు. కేవలం తను హనీ గురించి మాత్రమే ఆలోచిస్తుంది.
అయినా మీరు నాతో మాట్లాడినట్లు తులసి తో మాట్లాడకండి పరిణామాలు వేరేగా ఉంటాయి అని నందు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే బయటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత తులసి హనీ ఇంట్లో విశేషాలు అన్ని అడుగుతుంది కానీ నిజం చెప్తే తులసి ఎక్కడ ఆవేశ పడుతుందో అని నిజం చెప్పడు నందు. హనీ పడుకుందో లేదో తెలుసుకుందామని ఫోన్ చేయబోతుంది తులసి.
అయితే ఆమె దగ్గర ఫోన్ లాక్కొని కార్ లోనే హనీ నిద్రతో తూలుతుంది. ఈపాటికి మంచి నిద్రలో ఉండి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం అంటాడు. కరెక్టే కానీ ఆ విషయం మామూలుగా చెప్పొచ్చు కదా ఎందుకు ఇంత ఆవేశం అని నందు దగ్గర ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంది తులసి. అప్పుడు పరంధామయ్య దంపతులు అక్కడికి వస్తారు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఎందుకు తులసి తో ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నావు అని అడుగుతాడు పరంధామయ్య.
తరువాయి భాగంలో ఇంట్లోంచి వెళ్లిపోవటానికి రెడీ అవుతుంది జాహ్నవి. అడ్డుపడతాడు విక్రమ్. చిన్నప్పుడు నీ మీద కోపం వస్తే చెంప పగలగొట్టే దాన్ని నా కోపం తీరిపోయేది అంటుంది జాహ్నవి. ఇప్పుడైనా కొట్టు అని చెంప చూపిస్తాడు విక్రమ్. కొట్టటానికి చెయ్యద్దుతుంది జాహ్నవి కానీ కొట్టకుండా అతనిని హగ్ చేసుకుంటుంది. జాహ్నవి తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు విక్రమ్.