- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషి కోసం వసుకు స్పాట్ పెట్టిన సాక్షి.. జగతికి ప్రశాంతత లేకుండా చేస్తున్న దేవయాని!
Guppedantha Manasu: రిషి కోసం వసుకు స్పాట్ పెట్టిన సాక్షి.. జగతికి ప్రశాంతత లేకుండా చేస్తున్న దేవయాని!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక మే 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జగతి (Jagathi) వసుపై నీది ప్రేమ కాదంటావా? అని చెప్పి జగతి రిషి దాచుకున్న లెటర్ ను రిషి (Rishi) కి చూపిస్తుంది. ఇది కూడా నీ ప్రేమ కాదంటావా అని అడుగుతుంది. ఇక నిజాన్ని అబద్ధం చేస్తావో.. నిజాన్ని ఒప్పుకుంటావో నీ ఇష్టం అని జగతి అంటుంది.
ఇక రిషి (Rishi) నేను వసు ను అనవసరంగా తిట్టాను. తొందరపడ్డానా? అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు వసు.. సాక్షి రిషి సార్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపు వసుకు జగతి (Jagathi) ఎదురవుతుంది. ఇక రిషి అన్న మాటలను అపార్థం చేసుకోవద్దని జగతి వసుకు నచ్చజెప్తుంది.
ఆ తర్వాత రిషి (Rishi) కి ఒక కొరియర్ వస్తుంది. ఆ కొరియర్ రిసీవ్ చేసుకున్న రిషి దానిని జగతి మేడం కి ఇవ్వండి అని మహేంద్ర కు చెబుతాడు. మరోవైపు దేవయాని (Devayani) ప్రయత్నం చెస్తే ఫలితం దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని సాక్షికి అనేక మాటలు నూరిపోస్తుంది.
మరోవైపు రిషి (Rishi) వసు (Vasu) ను హాల్ టికెట్ కలెక్ట చేసుకున్నావ ఎప్పుడు వెళ్తున్నావ్ అని అడుగుతాడు. వసు మీరు రారా సార్ అని అడుగుతుంది. రిషి రావడంలేదని కోపంగా చెబుతాడు. ఇక నిన్ను ప్రతిసారీ వేలు పట్టి నడిపించాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇక రిషి కి వెళ్లాలని ఉన్న.. నేను రాను అన్నట్టుగా చెప్పి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఇక దీనంగా వసు (Vasu) జగతి దంపతుల దగ్గరికి వెళ్లి స్కాలర్షిప్ ఎగ్జామ్ దగ్గరికి రిషి సార్ రాను అని అంటున్నారు అని చెబుతుంది. అంతేకాకుండా మొహం మీదే చెప్పేశారు అని బాధపడుతుంది. ఇక జగతి (Jagathi) రిషి కి ఏం పని ఉన్నదో ఏమో పూర్తిగా తెలియకుండా బ్లేమ్ చేయకు అని మహేంద్ర తో అంటుంది.
ఇక తర్వాతి భాగంలో వసు (Vasu) కు రిషి ఆల్ ద బెస్ట్ చెప్పడానికి రానందుకు ఫీల్ అవుతుంది. జగతి రిషి సాక్షి విషయంలో నలిగిపోతున్నాడు వసు అని మనసులో అనుకుంటుంది. ఇక దేవయాని (Devayani) వసు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది అని సాక్షి తో అంటుంది. ఇక సాక్షి ఆ వసు సంగతి నేను చూసుకుంటాను అని అంటుంది.