ఆ హీరోయిన్ 'పుష్ప 3'లో ఐటెం సాంగ్ చేస్తే ఇక తిరుగులేదు.. దేవిశ్రీ క్రేజీ కామెంట్స్
దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్ అంటే తప్పనిసరిగా ఐటెం సాంగ్ ఉండాల్సిందే. పుష్ప 3లో ఐటెం సాంగ్ చేసే హీరోయిన్ ఎవరు అనే చర్చని దేవిశ్రీ ప్రసాద్ లేవనెత్తారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1800 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలని అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. పుష్ప 3 చిత్రం కూడా ఉంటుందని ఆల్రెడీ చెప్పారు. కాకపోతే మధ్యలో సుకుమార్ రాంచరణ్ తో ఒక సినిమా చేస్తారు.
దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్ అంటే తప్పనిసరిగా ఐటెం సాంగ్ ఉండాల్సిందే. పుష్ప మొదటి భాగంలో సమంత ఊ అంటావా అంటూ అల్లు అర్జున్ తో డ్యాన్స్ అదరగొట్టింది. సమంత చేసిన ఐటెం సాంగ్ ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప 2లో శ్రీలీల కిసిక్ అంటూ ఐటెం సాంగ్ చేసింది. ఆమె డ్యాన్స్ కి అంతా ఫిదా అయ్యారు.
Janhvi Kapoor
పుష్ప 3లో ఐటెం సాంగ్ చేసే హీరోయిన్ ఎవరు అనే చర్చని దేవిశ్రీ ప్రసాద్ లేవనెత్తారు. దేవిశ్రీ మాట్లాడుతూ.. పుష్ప 3లో ఐటెం సాంగ్ చేసేది ఎవరు అనే ఊహాగానాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. కానీ ఆ విషయంలో ఫైనల్ డెసిషన్ దర్శకుడు, నిర్మాతలదే. సాయి పల్లవి డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. జాన్వీ కపూర్ కూడా డ్యాన్స్ బాగా చేస్తుంది. వాళ్ళ అమ్మ శ్రీదేవిలో ఉండే గ్రేస్ జాన్వీ కపూర్ లో కూడా ఉంది. పుష్ప 3లో జాన్వీ కపూర్ ఐటెం సాంగ్ చేస్తే అదిరిపోతుంది. ఇది తన పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.