- Home
- Entertainment
- Guppedantha Manasu: దేవయాని ముందే రిషి, వసుధార రొమాన్స్.. జగతి, మహేంద్రల కోసం వసు కొత్త ప్లాన్?
Guppedantha Manasu: దేవయాని ముందే రిషి, వసుధార రొమాన్స్.. జగతి, మహేంద్రల కోసం వసు కొత్త ప్లాన్?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. వసుధార కిచెన్ లో పని చేస్తుంటే.. ఏంటి వసుధార ఇది ఈ పనులన్నీ మీకు ఎందుకు అని గౌతమ్ అంటాడు. మన అనుకున్నప్పుడు ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి సార్ తప్పేం లేదు అని అంటుంది. యూనివర్సిటీ టాపర్ అవ్వాలనుకున్నవ్ అయ్యావు.. నెక్స్ట్ ఏంటి అని అడిగితే యూనివర్సిటీ టాపర్ తో సరిపోదు కదండి సార్ అని వసుధార అంటుంది. ఇప్పుడు గౌతం మాట్లాడుతూ నీ కెరియర్ గురించి కాదు నేను చెప్తుంది రిషితో నీ జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను అంటాడు. ఆ విషయం గురించి ఏం చేశావ్ అని అడుగుతాడు. ఆ ఒక్క అడ్డుతేరా పోయింది కదా అని అంటాడు. సర్ మీరు ఏమి అడుగుతున్నారో నాకు తెలుసు రిషి సార్.. జగతి మేడంని అమ్మ అని పిలవడం గురించి కదా మీరు మాట్లాడుతుంది అని వసుధర అడుగుతుంది.
అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా రిషీ దగ్గర లేరు కదా.. ఈ టైమ్ లో ఇవన్నీ ఎందుకని.. నీ ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతాడు. జగతి మేడంని రిషి సార్ మామ్ అని పిలవడం కోసం నేను ప్రయత్నం చేశాను అని అంటే.. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నం మానేసినట్టేనా అని గౌతమ్ అడుగుతాడు.. కాదు సార్.. కేవలం అమ్మ అని పిలవడం కాదు తన మనసులో నుంచి అమ్మ అని రావాలి.. అమ్మ అనే అనుభూతిని రిషి సార్ ఆస్వాదించాలి అంటూ చెబుతుంది. నువ్వు డ్రాప్ అయ్యావు కాదు.. రిషీకి ఇంకా ఏ టెన్షన్ లేదు కదా అంటే నేను మారడం.. మారిపోవడం ఇలాంటివి ఏం జరగవు అని చెబుతుంది. నేను కేవలం దారి మార్చుకున్నాను గమ్యాన్ని మార్చుకోలేదు.. ఇచ్చిన మాటను మర్చిపోలేదు అని అంటుంది.
ఆ తర్వాత రిషి అక్కడికి వచ్చి నువ్వు కాలేజ్ టాపర్ అయినా సందర్భంగా నీకోసం సెలబ్రేషన్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్తాడు. సర్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని వసుధార అంటుంది. ఎందుకు ఏంటి వసుధార.. నువ్వు సాధించింది గొప్ప విషయం.. అందుకే సెలబ్రేట్ చేస్తున్నారు అంటే.. జగతి మేడం మహేంద్ర సారు లేనప్పుడు ఏ సెలబ్రేషన్స్ ని నేను ఆస్వాదించలేను సార్ అని వసుధారా అంటుంది. ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ రావు కదా వస్తారా ఒప్పుకోవచ్చు కదా అని గౌతమ్ అంటాడు. పార్టీ సెలబ్రేషన్స్ వద్దంటున్నావు కానీ నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వస్తోంది వాళ్లను వద్దని లేవు కదా అని రిషి కూడా అంటాడు. వద్దు అనకు వసుధార నీ విజయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది అంటారు.
ఆ మాటలకు వసుధర ఆలోచనలో పడుతుంది ఇక అదంతా చూసిన దేవయాని.. ఏం చేయాలి ఇప్పుడు ఈ వసుధారపట్టు విడిచేలా లేదు.. నిజంగానే జగతిని రిషితో అమ్మ అని పిలిపించేలా ఉంది అని భయపడుతుంది. వసుధారపై దృష్టి పెట్టాలి.. అందరి మనసు మార్చేసి నన్ను ఒంటరిదాన్ని చేస్తుందా? అని భయపడుతుంది. ఈ పరిస్థితిని ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలి.. జగతి లాంటి తెలివైన దాన్ని 20 ఏళ్లు ఇంట్లో లేకుండా పక్కకు తప్పించా నువ్వు ఒక లెక్క నాకు అని.. నీ ఎత్తుకు పైఎత్తు నేను తప్పకుండా వేస్తాను అంటూ చిటికె వేస్తుంది.. ఇక మరో సీన్ లో వంట చేస్తున్న ధరణి దగ్గరకు దేవాయని వస్తుంది. ఏంటి ధరణి ఏంటి వార్త విశేషాలు అని అంటే వీడికి వార్తాపత్రికను అయిపోయాను.. ప్రొద్దున్నే వచ్చి వార్తలు అడుగుతుంది అని మనసులో అనుకుంటుంది.
అత్తయ్య గారు విశేషాలు ఏం ఉంటాయి అని ధరణి అంటే ఎన్నో ఉంటాయి.. నువ్వు పట్టించుకోవు అంతే.. ఇంకా రిషీ నిద్ర లేవలేదు.. వసుధార కూడా నిద్ర లేవలేదు కాబట్టి మనం ఇది ఉపయోగించుకోవాలి అని దేవాయని అంటుంది. అత్తయ్య గారు నేను మీలా ఆలోచించలేను కదండీ అంటే నేర్చుకోవాలి ధరణి అని దేవయాని అంటుంది.. ఆ వసుధారని మనం గెలవాలి.. అలా గెలవాలంటే మనిద్దరం ఒకేలా ఆలోచించాలి అని దేవయాని అంటుంది. ఈ విషయం నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు.. ఏమో నన్ను ఒక రాక్షసిలా చూస్తుంటావు కదా.. అయ్యో అత్తయ్య గారు నేను ఎందుకు మిమ్మల్ని అలా చూస్తాను అని అంటుంది. ఆ వసుధారకు నువ్వు జై కొట్టాకు అని అంటుంది.
అసలు నువ్వు ఎవరు ధరణి.. నువ్వు నా కోడలువి.. ది గ్రేట్ దేవయాని కోడలివి.. నువ్వెలా ఉండాలి నాలా దర్జాగా ఉండాలి అంటూ ధరణికి నూరిపొస్తుంది. అతర్వాత దేవయాని కాఫీ కలిపితే అయ్యో అత్తయ్య గారు కాఫీ నేను కలుపుతాను కదా మీరు నాకు కాఫీ ఇవ్వడం ఏంటి అని ధరణి అంటే.. ఇదే చెప్పేది.. ఎదుటి వాళ్ళని చూసి అర్ధం చేసుకోవాలి అని అంటుంది. అతర్వాత కాఫీ తీసుకోని దేవాయని రిషీ గదికి వస్తుంది.. అక్కడ వసుధార, రిషిని కలిసి రొమాంటిక్ గా మాట్లాడుకోవడం చూసి దేవాయని షాక్ అవుతుంది. అక్కడ రిషీకి దేవాయని కాఫీ ఇస్తే ఆ కాఫీ ఎక్కడ రిషీ వసుధారకు సగం ఇస్తాడు ఏమోనని వసుదారకు ఇంకో కాఫీ తెప్పిస్తాలే అని చెబుతుంది. కానీ వసుధార మాత్రం రిషీ కాఫీ షేర్ చేసేలా చేస్తుంది. దేవాయని ముందే ఇద్దరు కాఫీ షేర్ చేసుకుంటారు.. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..