- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషికి ప్రేమతో హాగ్ ఇచ్చిన వసు.. జగతి కనిపించకపోవటంతో రచ్చ చేసిన దేవయాని!
Guppedantha Manasu: రిషికి ప్రేమతో హాగ్ ఇచ్చిన వసు.. జగతి కనిపించకపోవటంతో రచ్చ చేసిన దేవయాని!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమౌతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఒక తల్లి కొడుకుపై చూపించే ప్రేమ అనే కాన్సెప్టుతో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

రిషి (Rishi) అందరి ముందు తన తండ్రితో బాగా ఎమోషనల్ గా మాట్లాడుతాడు. అంతేకాకుండా జగతి తో సహా తనను ఆ ఇంట్లో ఉండమని అనడంతో దేవయానికి అక్కడున్నవారంతా సంతోషంగా కనిపిస్తారు. మహేంద్ర వర్మ, జగతిలు (Jagathi) మాత్రం ఆశ్చర్యపోతారు.
మీ నిర్ణయాన్ని రేపటి వరకు చెప్పండి రిషి (Rishi) తన తండ్రితో అంటాడు. అదే సమయంలో దేవయాని ఏం చేస్తున్నావ్ రిషి అంటూ కోపంతో రగిలి పోతూ ఉండగా.. తన తండ్రి అంటే ఇష్టమని.. ఆయన సంతోషమే తన సంతోషమని అంటాడు. ఇక ఆ మాటతో వసు (Vasu) బాగా సంతోష పడుతుంది.
ఇక జగతి (Jagathi) ఒంటరిగా నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దేవయాని (Devayani) జగతి దగ్గరికి వచ్చి నిప్పులు చల్లే విధంగా మాటలు మాట్లాడుతుంది. ఈ ఇంట్లో ఉండటం అవసరమా అంటూ ప్రశ్నిస్తుంది. జగతి ఏం సమాధానం ఇవ్వకుండా అలాగే ఆలోచనలో పడుతుంది.
మరోవైపు రిషి (Rishi) కూడా అందరి ముందు మాట్లాడిన మాటలు తలుచుకుంటూ ఉంటాడు. మహేంద్ర వర్మ కూడా రిషి మాట్లాడిన మాటలు తలుచుకుంటూ ఉంటాడు. ఇక గౌతమ్ (Gautham) దేవయానితో ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని.. గ్రాండ్ గా పార్టీ చేసుకోవాలి అని అనడంతో దేవయాని కోపం తో రగిలిపోతుంది.
అప్పుడే వసు (Vasu) రావడంతో వసు ని చూసి దేవయాని వసుని ఉద్దేశించి వెటకారం గా మాట్లాడుతుంది. రిషి ( వెనకాల అదృశ్య శక్తి ఉంది అంటూ మాట్లాడుతుంది. దాంతో వసు తిరిగి దేవయానికి అదిరిపోయే సమాధానం ఇస్తుంది. ధరణి వసు ను ఏం కావాలి అని అడగటంతో వసు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది.
ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్న వసు.. జగతి మేడమ్ కు ఈ ఇంట్లో ఉండాలనే కోరిక తీరిపోయింది అంటూ అనుకుంటే వెళ్తుంది. వెనుకాల రిషి చూసి వసు ను ఎక్కడికి వెళ్తున్నావ్ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. ఇక తనే డ్రాప్ చేస్తాను అంటూ అక్కడి నుంచి కారులో తీసుకెళ్తాడు.
ఇక వసు మనసులో రిషి గొప్పదనాన్ని గురించి గొప్పగా ఫీల్ అవుతూ ఉంటుంది. వసు కారులో నుంచి దిగి రిషి దగ్గరికి వచ్చి డీప్ హగ్ ఉంది. దాంతో రిషి ఆశ్చర్యపోతాడు. తరువాయి భాగంలో జగతి కనిపించకపోవడంతో దేవయాని ఇంట్లో రచ్చ రచ్చ చేస్తుంది.