- Home
- Entertainment
- Guppedantha Manasu: శైలేంద్ర మీద ఫైరైన దేవయాని.. కూతురిదే తప్పని షాకిచ్చిన చక్రపాణి?
Guppedantha Manasu: శైలేంద్ర మీద ఫైరైన దేవయాని.. కూతురిదే తప్పని షాకిచ్చిన చక్రపాణి?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకుని చూసి గర్వపడుతున్న ఓ తల్లిదండ్రుల కథ ఈ సీరియల్ ఇక ఈరోజు ఆగస్టు 19 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో పసుధార కాలేజీకి రాకపోవడంతో ఎందుకు రాలేదా అని ఆలోచనలో ఉంటాడు రిషి. ఇంతలో పాండ్యన్ వచ్చి వసుధార మేడం రాలేదు సార్ అని చెప్తాడు. ఒకసారి ఫోన్ చేసి ఎందుకు రాలేదు కనుక్కో అని పాండియన్ కి చెప్తాడు రిషి. పాండియన్ ఫోన్ చేసేలోపు ఎదురుగా వసుధార వస్తూ కనిపిస్తుంది. సార్ మేడమ్ వస్తున్నారు అంటాడు పాండియన్.
సరే నువ్వు వెళ్ళు అని చెప్పి పాండియన్ని పంపించేస్తాడు రిషి. పరధ్యాన్నంగా తన ముందు నుంచి వెళ్ళిపోతున్న వసుధారని ఆపి ఎందుకు లేట్ అయింది అని అడుగుతాడు రిషి. ఏమీ లేదు అంటుంది వసుధార. నాకు మెసేజ్ పెట్టి ఎందుకు డిలీట్ చేశారో చెప్పండి అని అడుగుతాడు రిషి. పొరపాటున వచ్చేసింది అంటుంది వసుధార. పొరపాటున రావటానికి అదేమీ మిస్డ్ కాల్ కాదు మెసేజ్ టైప్ చేసి సెండ్ చేస్తేనే వస్తుంది.
నాకు ఆ మాత్రం తెలియదా అంటాడు రిషి. మీకు అన్నీ తెలుస్తాయి కానీ తెలియవలసినవి మాత్రం తెలియదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంది వసుధార. ఆమె ఎదురుగుండా వెళ్లి నా వైపు చూడండి అని అడుగుతాడు రిషి. రిషి వైపు చూస్తుంది వసుధార. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి ఏం జరిగింది మేడం ఏమైనా సమస్యా.. చెప్పండి పర్వాలేదు అంటూ కన్సర్న్ చూపిస్తాడు. ఏమీ లేదు సార్ కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలియవు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసుధార.
మరోవైపు క్లాసులోకి వెళ్ళిన వసుధార ఆబ్సెంట్ మైండ్ తో ఉంటుంది. పిల్లలు మ్యాథ్స్ సరిగ్గా చేసినప్పటికీ వాటిని రాంగ్ అని చెప్పి ఇంటు మార్క్ పెట్టి పంపించేస్తుంది. పాండియన్ ఇది కరెక్టే కదా మేడం అని అడుగుతాడు అయినా ఏమీ మాట్లాడదు వసుధార. మేడమ్ ఎందుకు అలా ఉన్నారో నేను కనుక్కొని వస్తాను అని చెప్పి వసుధర పర్మిషన్ తో బయటికి వెళ్తాడు పాండ్యన్.
మరోవైపు ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు శైలేంద్ర. అక్కడికి వచ్చిన దేవయాని ఏం జరిగింది అని అడుగుతుంది. ఏ ప్లాన్ వేసిన ఫెయిల్ అయిపోతుంది రిషి ని చంపేస్తాను అంటే నువ్వేమో వద్దంటున్నావు. కాలేజీ నా హస్తగతమవుతుందని కాలేజీ గురించి బ్యాడ్గా పేపర్లో వేయించాను అంటూ జరిగిందంతా చెప్పాడు శైలేంద్ర. ఇలాంటి పిచ్చి పనులే చేస్తావు తర్వాత వర్క్ అవుట్ అవ్వలేదు అంటూ టెన్షన్ పడతావు.
నువ్వు టెన్షన్ పడకు త్వరలోనే ఆ కాలేజీ నీ చేతికి వస్తుంది అని కొడుక్కి హామీ ఇస్తుంది దేవయాని. మరోవైపు కాలేజీలో స్టూడెంట్స్ ఫీల్ అయినందుకు చాలా ఆనంద పడుతూ ఉంటారు జగతి దంపతులు. రిషికే అసలు ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి నిజంగా నా కొడుకు గ్రేట్ అంటుంది జగతి. నీ కొడుకే కాదు నాక్కూడా కొడుకే అంటూ గర్వంగా మీసం మెలేస్తాడు మహేంద్ర. వాటిని మన కాలేజీ వెబ్ సైట్ లో పెడదాము.
ఎవరైనా మన కాలేజ్ వెబ్సైట్ చూస్తే ఇన్స్పైరింగ్ ఫీల్ అవుతారు అంటాడు మహేంద్ర. అలాగే అంటుంది జగతి. ఈపాటికి రిషి ఏం చేస్తూ ఉంటాడో అని కొడుకుని తలుచుకుంటుంది. ఏం చేస్తాడు.. చదువుకుంటూ ఉంటాడు అంటాడు మహేంద్ర. సీన్ కట్ చేస్తే నిజంగానే చదువుకుంటూ ఉంటాడు రిషి. రిషి దగ్గరికి వచ్చిన పాండ్యన్ తన బుక్ చూపించి ఈ సమ్ కరెక్టే కదా సార్ అని అడుగుతాడు. కరెక్టే అంటాడు రిషి. మరి మేడం ఎందుకు ఇంటి మార్క్ పెట్టారు సార్ నాకే కాదు అందరికీ అలాగే పెట్టారు.
ఎందుకో మేడం మూడిగా ఉన్నారు. క్లాస్ తీసుకోవడం లేదు మీకు ఏమైనా తెలిసేమో అని ఇక్కడికి వచ్చాను అంటాడు పాండియన్. నేను కనుక్కుంటానులే అని చెప్పి పాండే అక్కడ నుంచి పంపించేస్తాడు రిషి. ఆ తర్వాత రిషి చక్రపాణి కలిసి మీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా.. లేదంటే జగతి మేడం గాని మా డాడీ గాని ఫోన్ చేశారా అని అడుగుతాడు. అలాంటిదేమీ లేదు సార్ ఎందుకు అలా అడుగుతున్నారు నాకు టెన్షన్ గా ఉంది చెప్పండి అంటాడు చక్రపాణి.
అలా ఏం లేదు పొద్దుటి నుంచి వసుధార చాలా డల్ గా ఉంది ఏమైనా డిస్టబెన్స్ అయిందేమో మిమ్మల్ని కనుక్కుందామని వచ్చాను అంటాడు రిషి. ఇంకేముంది సార్ మీరు తనని దూరం పెట్టిన దగ్గర నుంచి తను అలాగే ఉంది. ఈరోజు మీ మధ్య జరిగిన జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చి ఉంటాయి. అయినా మీ తప్పు కూడా లేదు తను మిమ్మల్ని అంతగా గాయపరిచింది కాబట్టే మీరు దూరం పెట్టారు. వసమ్మ గురించి మీకన్నా ఎవరికీ బాగా తెలిసి ఉండదు సార్ అంటాడు చక్రపాణి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.