Guppedantha Manasu: రిషిని హగ్ చేసుకున్న వసుధార..సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 1 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార, రిషి ఇద్దరు కార్ లో వెళ్తూ ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు రిషి వసుధార అన్న మాటలు తలుచుకుని ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార ఇప్పుడు నా మనసు ఎంత సంతోషంగా ఉందో రిషి సార్ తో నా ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి, వసుధార నా మనసు ఎంతో సంతోషంగా ఉంది వసుధార. ఈ సమయంలో డాడ్ వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అంటాడు రిషి. ఆ తర్వాత గులాబీ రెక్కను తీసుకొని రిషితన జేబులో పెట్టుకోగా ఎందుకు సార్ అని అనడంతో దాచుకుంటాను అందమైన జ్ఞాపకంగా అనటంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది.
అప్పుడు రిషి నువ్వు వచ్చాక కొత్త ప్రయాణం మొదలైంది అన్ని బాగున్నాయి. కానీ డాడ్ వెళ్లిపోవడమే బాగోలేదు వసుధార అంటూ బాధపడుతూ ఉంటారు రిషి. మరొకవైపు గౌతమ్,జగతి దంపతులకు రిషి బాధ గురించి చెబుతూ ఉండడంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడు మహేంద్ర వసుధార వింటే ఉంది కదా అని అనగా అప్పుడు గౌతమ్ అంకుల్ మీరు లేని లోటు మీరు మాత్రమే తీర్చగలరు అనడంతో జగతి మహీంద్ర ఆలోచనలో పడతారు. అప్పుడు మహేంద్ర దంపతులు ఏం కాదు అని అనగా గౌతమ్ మాత్రం అది తప్పు అంకుల్ రిషి అలవాటు పడతాడు అని మీరు అనుకుంటున్నారు.
కానీ ఎన్నేళ్లు అయినా కానీ రిషి బాధ తగ్గదు అంకుల్ అని అంటాడు గౌతమ్. ప్లీజ్ అంకుల్ వచ్చేయండి వాడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను అంకుల్ గౌతమ్ బాధపడుతూ ఉంటారు. అప్పుడు మహేంద్ర రాలేను గౌతమ్ కానీ ఎందుకు ఏమిటి అన్న వివరాలను మాత్రం అడగకు అని అంటాడు. అప్పుడు గౌతమ్,జగతి ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా మహేంద్ర మాత్రం వినిపించుకోడు. అప్పుడు గౌతమ్ అక్కడ దేవయాని పెద్దమ్మ ఏవేవో ప్లాన్ చేస్తుంది పెద్దమ్మ నుంచి ఏదో ఒక రకమైన సమస్య రాకముందే మీరు అక్కడికి వచ్చేయండి అని అంటాడు గౌతమ్.
అప్పుడు మహేంద్ర,వసుధార ఆలోచనలో మార్పు ఏమైనా వచ్చిందేమో అడిగి నాకు చెప్పు అని అంటాడు. మరొకవైపు కాలేజీలో వసుధార సంతోషంగా రిషికి అందకుండా పరిగెడుతూ ఉండగా వెంటనే రిషి వెళ్లి పట్టుకుంటాడు. అప్పుడు వారిద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఆ తర్వాత రిషి వసుధారకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. తర్వాత వసుధార గట్టిగా రిషి ని హగ్ చేసుకుంటుంది. అదంతా కూడా దేవయాని కలగంటుంది. ఇదంతా నా ఊహనా అంటూ నీళ్లు తాగి ఇది ఎప్పుడైనా జరగవచ్చు ఎలా అయినా వారిద్దరూ కలవకుండా ఆపాలి అని ప్లాన్ వేస్తుంది దేవయాని.
మరొకవైపు రిషి మహేంద్రను తలుచుకొని ఎక్కడికి వెళ్లారు ఎప్పుడు వస్తారు అని బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు రిషి వసుధార కి ఫోన్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్స్ తొందరగా తీసుకొని రమ్మని చెబుతాడు. తరువాత వసుధార కాలేజీకి వెళ్తూ ఉండగా ఇంతలో కాలేజీ మేడమ్ వసుధారని ఆపి జగతి మేడం వాళ్ళు ఇల్లు విడిచి వెళ్లిపోయారంట కదా దేవయాని మేడమ్ చెప్పారుఅనడంతో వసుధార ఒకసారిగా షాక్ అవుతుంది.
మరొకవైపు రిషి దగ్గరికి గౌతమ్ రావడంతో మహేంద్ర వాళ్ళ గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రిషి మహేంద్ర వాళ్ళ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. కానీ గౌతమ్ మాత్రం ఏం మాట్లాడుకుందాం మౌనంగా ఉంటారు. అది కరెక్ట్ కాదు అని రిషి అంటుండగా ఇంతలో వసుధార అక్కడికి వచ్చి నిజం సార్ కనిపెడగానే కడిగేయాలి కొట్లాడాలి అని అంటుంది.
అప్పుడు దేవయాని మేడం ఇలా చెప్పిందంట సార్ అనడంతో వెంటనే రిషి పెద్దమ్మ చెప్పిన దాంట్లో తప్పు ఏముంది వసుధార అని అంటాడు. ఆ తరువాత రిషి గౌతమ్ ఇద్దరి నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. జగతి వాళ్ళు బయటికి వెళ్లిన విషయం ఎలాగైనా నేనే బయట పెడతాను అని అంటాడు రిషి.