MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • NTR Upcoming Movies: ఈ సినిమాలతో జూనియర్ రేంజ్ మారిపోనుందా? ఏ హీరోకి లేని మైండ్ బ్లోయింగ్ లైనప్!

NTR Upcoming Movies: ఈ సినిమాలతో జూనియర్ రేంజ్ మారిపోనుందా? ఏ హీరోకి లేని మైండ్ బ్లోయింగ్ లైనప్!

ఎన్టీఆర్ నుండి రానున్న సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తాయి అనడంలో సందేహం లేదు. దేవర, ఎన్టీఆర్ 31, వార్ 2 చిత్రాలతో ఎన్టీఆర్ తన తోటి హీరోలకు సవాల్ విసరనున్నాడు... 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 25 2024, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
NTR

NTR

ఎన్టీఆర్ కెరీర్ ని మలుపు తిప్పే సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.  రానున్న రెండేళ్లలో ఎన్టీఆర్ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయనున్నాడు. ఆ రేంజ్ చిత్రాలు ఆయన లైన్లో పెట్టారు. వీటిలో ముందుగా దేవర పార్ట్ 1 రానుంది. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆచార్య మినహాయిస్తే ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్స్. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దేవర మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓ కీలక పాత్ర చేయడం విశేషం. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. దేవర పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సెప్టెంబర్ 27కి ప్రీపోన్ కావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. 

36


కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తన 31వ చిత్రం ప్రకటించారు. సలార్ కంటే ముందే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సింది. కానీ అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ తో పాటు పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఎన్టీఆర్ వంటి మాస్ హీరోకి ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్ తోడైతే సిల్వర్ స్క్రీన్ షేక్ కావడం ఖాయం అంటున్నారు. 
 

46
War 2

War 2

ఎన్టీఆర్ ఖాతాలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ వార్ 2. ఎన్టీఆర్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ మూవీ వార్ 2. 2019లో విడుదలైన బ్లాక్ బస్టర్ వార్ చిత్రానికి ఇది సీక్వెల్. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో వస్తున్న మరొక చిత్రం. హృతిక్ రోషన్ మరోసారి బహిష్కరించబడిన రా ఏజెంట్ గా కనిపించనున్నారు.

56
War 2

War 2

ఇక ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోకి ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఇండియాలోనే బెస్ట్ డాన్సర్స్ గా వీరిద్దరూ ఉన్నారు. వార్ 2 మూవీలో హృతిక్-ఎన్టీఆర్ పై చిత్రీకరించిన సాంగ్ ఈ స్థాయిలో చెప్పాల్సిన అవసరం లేదు. వార్ 2 లో యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రంతో ఎన్టీఆర్ నార్త్ ఆడియన్స్ మనసులు దోచేయడం ఖాయం. 
 

66

దేవర 2 ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్. పార్ట్ 1 విడుదలైన నెలల వ్యవధిలో పార్ట్ 2 కూడా వచ్చేస్తుందని సమాచారం. దర్శకుడు కొరటాల శివ అలా ప్లాన్ చేశాడట. దేవర, ఎన్టీఆర్ 31, వార్ 2, దేవర 2 చిత్రాలతో ఎన్టీఆర్ రేంజ్ ఎవరికీ అందదు అని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Recommended image2
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Recommended image3
Kotha Malupu Review: `కొత్త మలుపు` మూవీ రివ్యూ.. సింగర్‌ సునీత కొడుకు సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved