Janhvi Kapoor: డ్రెస్ అంత టైట్ అయితే అందాలకు ఊపిరి ఆడేదెలా... టెంప్ట్ చేసేలా జాన్వీ కపూర్ గ్లామర్!
అందాలను టైట్ డ్రెస్ లో బంధించి ఊపిరి ఆడకుండా చేసింది జాన్వీ కపూర్. ఒంటిని గట్టిగా హత్తుకున్న దుస్తుల్లో జాన్వీ కపూర్ ని చూసి మనసు పారేసుకుంటున్నారు కుర్రాళ్లు.
Janhvi Kapoor
గ్లామర్ ఐకాన్ గా అవతరించింది జాన్వీ కపూర్. ఈ బోల్డ్ బ్యూటీ తాజాగా టైట్ బాడీ కాన్ డ్రెస్ లో టెంపరేచర్ పెంచేసింది. జాన్వీ కపూర్ పరువాల జడివానలో జనాలు తడిసి ముద్దవుతున్నారు. శ్రీదేవి కూతురు అందాలు అదరహాలో అని కామెంట్ చేస్తున్నారు.
Janhvi Kapoor
జాన్వీ కపూర్ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. అయితే ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. అవకాశాలు వస్తున్నాయి కానీ భారీ విజయం దక్కడం లేదు. ఇటీవల బవాల్ టైటిల్ తో ఓ మూవీ చేసింది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు నితీష్ తివారి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా బవాల్ తెరకెక్కించాడు. .
Janhvi Kapoor
జాన్వీ కపూర్ ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ దేవర. ఈ మూవీతో సౌత్ లో జండా పాతాలని గట్టిగా ట్రై చేస్తుంది. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో దేవర తెరకెక్కుతుంది. దాదాపు రూ. 300 కోట్లు బడ్జెట్ కేటాయించారని సమాచారం.
Janhvi Kapoor
జాన్వీ-ఎన్టీఆర్ కాంబో చాలా ప్రత్యేకం. సీనియర్ ఎన్టీఆర్-శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ షేక్ చేశారు. ఆరుడైన విజయాలు నమోదు చేశారు. వీరి వారసులైన ఎన్టీఆర్, జాన్వీ జతకట్టడం గొప్ప పరిణామం. దేవర మూవీకి హైప్ తెచ్చిన అంశాలలో ఇది కూడా ఒకటి.
Janhvi Kapoor
ఇక దేవర నుండి జాన్వీ లుక్ షేర్ చేశారు యూనిట్. లంగా ఓణీలో పల్లెటూరి అమాయకపు అమ్మాయిగా జాన్వీ ఆకట్టుకుంది. జాన్వీ పాత్ర పేరు కూడా రివీల్ చేశారు. జాన్వీ దేవరలో తగం గా కనిపిస్తుందట. తంగం శ్రీదేవి బాలనటిగా చేసిన చిత్రాల్లో ఓ పాత్ర పేరు అని సమాచారం.
Janhvi Kapoor
యాక్షన్ ఎంటర్టైనర్ దేవర వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతం గోవా లో షూటింగ్ పాన్ ఇండియా మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే నిరవధికంగా చిత్రీకరణ పూర్తి చేయనున్నారట. దేవర ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పించింది. దేవర విజయం సాధిస్తే జాన్వీ కపూర్ దశ తిరిగినట్లే. ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తే అవకాశం ఉంది. ఆల్రెడీ రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.