- Home
- Entertainment
- Dethadi Harika Glamour Pics : గోవాలో దేత్తడి హారిక రచ్చరచ్చ.. గ్లామర్ పిక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది..
Dethadi Harika Glamour Pics : గోవాలో దేత్తడి హారిక రచ్చరచ్చ.. గ్లామర్ పిక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది..
బిగ్ బాస్ తెలుగు ఫేమ్ దేత్తడి హారిక (Dethadi Harika) గ్లామర్ షోతో రచ్చరచ్చ చేస్తోంది. య్యూటూబ్ స్టార్ గా ఎదిగిన ఈ సుందరి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంటోంది. లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

తన గ్లామర్ తో దేత్తడి హారిక (Dethadi Harika) నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. ఇన్నాళ్లు య్యూటూబ్ లో తన సత్తా చూపించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోను హంగామా చేస్తోంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లను మైమరిపిస్తోంది.
య్యూటూబ్ లో ‘దేత్తడి’ ఛానెల్ ద్వారా మాస్ అటీట్యూడ్ తో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీతోనే ‘బిగ్ బాస్ 4’లో అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోనూ హారిక తనదైన శైలిలో గేమ్స్ లో పార్టిసీపేట్ చేసి టీవీ ఆడియెన్స్ ను అలరించింది.
ఆ తర్వాత మరింత పాపులారిటీని సాధించుకుంది. మాస్ అటీట్యూడ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. మొన్నటి వరకు య్యూటూబ్ వరకే పరిమితమైన హారిక. ఇక గ్లామర్ ఫీల్డ్ పైనా ఫోకస్ పెడుతోంది. ఇందుకు తన బ్యూటీని నెటిజన్లకు పరిచయం చేస్తోంది.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంటోంది. ఇఫ్పటికే చిన్నపాటి హీరోయిన్ రేంజ్ ను సాధించుకుంది. ఇక ప్రస్తుతం గోవా వేకేషన్ ఉన్న హారిక తాజా ఫొటోలతో అందాల విందు చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో గ్లామర్ డోస్ పెంచింది.
క్యాజువల్ డ్రెస్ లో హాట్ స్టిల్స్ తో మతిపోగోడుతోంది. ఎద, నడుము అందాలు చూపిస్తూ నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది. ఫొటోలు షేర్ చేస్తూ.. ‘ఓ సూర్యాస్తమయమా.. నీవు నాకు మంచి అనుభూతిని కలిగిచావు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం హారిక పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేరీర్ విషయానికొస్తే.. హారికకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. య్యూటూబ్ లో పాపులర్ అవుతున్న రోజుల్లోనే సినిమాల నుంచి పిలుపొచ్చిన తానే వద్దనుకుంది. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు టీవీ షోస్ లోనూ కనిపిస్తోంది. తాజాగా ‘గానం’ అనే రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాలో నటిస్తోంది. త్వరలో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ కానుంది.