- Home
- Entertainment
- వోణీ తీసేసి దీప్తి సునైనా అందాల జాతర.. లేత పరువాలతో మతి చెడగొడుతోంది.. ఆ స్టిల్స్ చూస్తే అంతే!
వోణీ తీసేసి దీప్తి సునైనా అందాల జాతర.. లేత పరువాలతో మతి చెడగొడుతోంది.. ఆ స్టిల్స్ చూస్తే అంతే!
‘బిగ్ బాస్’ ఫేమ్ దీప్తి సునైనా (Deepthi Sunaina) అందాల విందు అరాచకంగా మారింది. రోజురోజుకు హద్దులు చెరిపేస్తూ గ్లామర్ షోతో ఇంటర్నెట్ లో హీటు పుట్టిస్తోంది. లేటెస్ట్ ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.

హీరోయిన్ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకొని ఎంటర్ టైన్ మెంట్ లోకి అడుగుపెట్టింది యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. తొలుత యూట్యూబర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లేటెస్ట్ మూవీస్ కవర్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునైనాకు యూట్యూబ్ ద్వారా యమా క్రేజ్ పెరిగింది. గ్లామర్ పరంగా కూడా ఈ బ్యూటీ ఒకే అనిపించడంతో ఈమెను మరింతగా లైక్ చేయడం, సపోర్ట్ చేయడం ప్రారంభించారు.
ఫ్యాన్స్ ప్రోత్సాహంతోనే కింగ్ నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌజ్ లో ఈ అమ్మడు అప్పట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రతి టాస్క్ లో తనదైన శైలిని చూపిస్తూ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసింది.
హౌజ్ నుంచి బయటికి వచ్చాక సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. బిగ్ బాస్ తో సెలబ్రెటీగా మారిపోయింది. పలు టీవీ షోలకు కూడా గెస్ట్ గా హాజరై ఆడియెన్స్ కు మరింతగా దగ్గరై పోయింది. అంతేకాకుండా పలు ఈవెంట్లకూ వెళ్తూ సందడి చేస్తోంది.
ఇక వెండితెరపై మెరవాలనే లక్ష్యంగా దీప్తి సునైనా అడుగులేస్తోంది. సోషల్ మీడియాను ఆయుధంగా వాడుతోంది. నిత్యం ఇంటర్నెట్ లో అభిమానులకు టచ్ లోనే ఉంటూ.. రీల్స్, యాడ్స్, గ్లామర్ ఫొటోలను వారితో పంచుకుంటూ పాపులారిటీని పెంచుకుంటోంది.
ఈ క్రమంలో తాజాగా దీప్తి మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఫాలోవర్స్ తో పంచుకుంది. ఈ పిక్స్ లో ట్రెడిషనల్ లుక్ లో కనువిందు చేసింది. డార్క్ డ్రెస్ లో దీప్తి అందాల జాతర అదర్స్ అనిపించేలా ఉంది. లెహంగా వోణీ ధరించిన యంగ్ బ్యూటీ గ్లామర్ షోలో తగ్గేదే అంటోంది.
ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న దీప్తి రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది. ఈసారి ఏకంగా వోణీ తీసేసి పరువాలను ప్రదర్శించింది. అమ్మడు సోయగాలకు అభిమానులు, నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ద్వితీయ శ్రేణి హీరోయిన్లకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను దీప్తి సంపాదించుకుంది. కేవలం ఇన్ స్టాలోనే 4 మిలియన్ల అభిమానులను దక్కించుకుంది. తన డైలీ యాక్టివిటీస్ తో ఆ సంఖ్యను మరింతగా పెంచేస్తోంది. దర్శకనిర్మాతల కంట్లో పడేందుకు, తన క్రేజ్ ను కాపాడుకునేందుకు బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది.