వాయిలెట్ కలర్ లెహంగాలో దీపికా పిల్లి మతిపోగొట్టే పోజులు.. లేటెస్ట్ ఫోటోలు వైరల్
ఇటీవల `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రంతో హీరోయిన్‌గా మెరిసిన దీపికా పిల్లి ఇప్పుడు నయా లుక్‌లో ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ ఫోటోలను పంచుకుని ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
deepika pilli
`ఢీ` షోతో పాపులర్ అయ్యింది దీపికా పిల్లి. ఈ షోలో తనదైన స్టయిల్‌లో రచ్చ చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ స్టార్స్ వంటి షోస్‌లో మెరిసి ఆకట్టుకుంది.
deepika pilli
దీపికా పిల్లి ఇటీవల `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రంలో నటించింది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన ఈ మూవీలో ఆయనకు జోడీగా చేసింది దీపికా పిల్లి.
deepika pilli
ఇందులో రాజాగా ఊర్లోని కుర్రాళ్లంతా ఆమెని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఈ క్రమంలో చోటు చేసుకునే డ్రామా, ప్రదీప్‌తో లవ్ ట్రాక్ ఆకట్టుకుంది. సినిమా మంచి విజయం సాధించింది.
deepika pilli
అంతకు ముందు `వాంటెడ్ పండుగాడ్` చిత్రంలో నటించింది దీపికా పిల్లి. అందులోనూ హీరోయిన్ తరహా పాత్రనే. ఆమెకి మంచి గుర్తింపు తెచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి నటించడం విశేషం.
deepika pilli
ఇలా ఓవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోస్‌లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కెరీర్‌ని లాక్కొస్తుంది. అయితే ఈ అమ్మడి టాలెంట్‌కి తగ్గ అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.
deepika pilli
దీపికా పిల్లి సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచూ తనకి సంబంధించిన రీల్స్, వీడియోలు, ఫోటోలు పంచుకుంటుంది.
deepika pilli
అందులో భాగంగా ఇప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. వాయిలెట్ కలర్ లెహెంగాలో మెరిసిపోయింది దీపికా పిల్లి. ఎంతో అందంగా ముస్తాబై ఆకట్టుకుంటుంది.
deepika pilli
ఇందులో దీపికా చాలా బాగుందని అభిమానులకు కామెంట్లు పెడుతున్నారు. క్యూట్ లుక్ అదిరిపోయిందంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆమె పిక్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి.