MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Deepika Pilli: బ్లాక్‌లో కైపెక్కిస్తున్న `ఢీ` భామ.. నెగటివ్‌ ప్రచారంతో షాకిస్తున్న నెటిజన్లు.. హాట్‌ టాపిక్‌

Deepika Pilli: బ్లాక్‌లో కైపెక్కిస్తున్న `ఢీ` భామ.. నెగటివ్‌ ప్రచారంతో షాకిస్తున్న నెటిజన్లు.. హాట్‌ టాపిక్‌

దీపికా పిల్లి `ఢీ` షోతో పాపులర్ అయ్యింది. సోషల్‌ మీడియాలో క్రేజ్‌ని సంపాదించుకుంది. ముద్దు ముద్దు మాటలతో, డాన్సులతో కనువిందు చేస్తుంది. మరోవైపు హైపర్‌ ఆదితో కెమిస్ట్రీ పండిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. ఇలాంటి ఈ హాట్‌ సోయగం దీపికాకి నెటిజన్లు షాకిస్తున్నారు. నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 08 2021, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దీపికా పిల్లి(Deepika Pilli) టిక్‌టాక్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న విసయం తెలిసిందే. టిక్‌ టాక్‌ వీడియోల్లో అద్భుతంగా ఎక్స్ ప్రెషన్స్ పలికించి, డాన్సులు చేసి అందరిని ఆకట్టుకుంది. అలా టీవీ షోలో ఛాన్స్ దక్కించుకుంది. ఏకంగా ఈటీవీలో ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు. ఆ విషయంలో దీపికా పిల్లి నక్క తోక తొక్కిందనే చెప్పాలి. తన టాలెంట్‌తో ఏకంగా `ఢీ` షోలో స్థానం దక్కించుకుంది. ఇందులో క్వీన్స్ టీమ్‌ లీడర్‌గా హాట్‌ యాంకర్‌ రష్మితో కలిసి సందడి చేస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మరోవైపు Dhee showలో ఈ స్టేజ్‌పై రష్మి, సుడిగాలి సుధీర్‌ సందడి చేస్తుంటే, వారికి ఆల్టర్‌నేట్‌గా హైపర్‌ ఆది-దీపికా పిల్లి జోడీ హల్‌చల్‌ చేస్తుంటుంది. వీరి మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తుంది. దీపికాని చిన్నపిల్లని చేసి ఆది ఓ రేంజ్‌లో ఆడుకోవడం, వాటిని హైలైట్‌గా చూపించడంతో దీపికా పిల్లికి మరింత క్రేజ్‌ వచ్చింది. 
 

37

దీనికితోడు Deepika Pilli ప్రతి వారం తన `ఢీ` షోకి సంబంధించిన గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటుంది. ఫోటోలకు పోజులిస్తూ వాటిని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటుంది. ఈ క్యూట్‌ అందాలకు ఫిదా అయిన నెటిజన్లు ఆమె పిక్స్ ని వైరల్‌ చేయడంతోపాటు తమదైన కామెంట్లతో ఆమె అందాలపై ప్రశంసలు కురిపిస్తుంటారు. నెట్టింట వైరల్‌గా మారుస్తుంటారు. దీంతో మరింత పాపులారిటీ దీపికా పిల్లి సొంతం చేసుకుంటోంది. 

47

లేటెస్గ్ గానూ దీపికా పిల్లి తన గ్లామర్ ఫోటోలను షేర్‌ చేసింది. బ్లాక్‌ టీ షర్ట్, టైట్‌ జీన్స్ లో హోయలు పోయింది. కొంటెగా లుక్స్ ఇస్తూ, క్యూట్‌ అందాలతో చిలిపిగా కవ్వింపులకు దిగింది. ఈ ఫోటోలు సైతం తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది, కానీ నెటిజన్ల నుంచి దీపికా పిల్లికి ఊహించని షాక్‌ తగిలింది. ఇంటర్నెట్‌లో నెగటివ్‌ ప్రచారం జరుగుతుంది. దీపికా పిల్లి టాలెంటెనే ప్రశ్నిస్తున్నారు. ఆమెకి సపోర్ట్ చేయడం వల్ల ఏంటి ప్రయోజనమంటూ కామెంట్లు చేయడం ఇప్పుడు సర్వత్రా హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

57

కొందరు నెటిజన్లు దీపికాకి టాలెంట్‌ లేదని కామెంట్లు చేయడంగమనార్హం. `దీపికాని సపోర్ట్ చేయడం వల్ల ఏం ప్రయోజనం. ఆమెకి ఫ్యాన్స్, హేటర్స్ ఉన్నా,ఒక్క టాలెంట్‌ చెప్పండి. ఆమెలా డాన్సు చేసేవాళ్లు వేలల్లో ఉన్నారు. `ఢీ`లో సుడిగాలి సుధీర్‌, రష్మి లేకుండా వీరిని ఊహించుకోగలమా? వీడియోలు చేయడంలో తప్ప, ఆమెకి నో టాలెంట్‌ అని, ఆమెలా వీడియోలు చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇంకా బాగా చేయగలరు. సరిగ్గా డైలాగ్‌ చెప్పడం కూడా రాదు. ఏదో పాట ఏసుకుని అటూ ఇటు ఊగడం తప్ప ఏం వస్తుంది ఆమెకి. ఏం టాలెంట్‌ ఉందని సపోర్ట్ చేస్తారంటూ కామెంట్లు చేయడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

67

మరి దీన్ని దీపికా ఎలా తీసుకుంటుందో చూడాలి. అయితే ఇలా నెగిటివ్‌ కామెంట్ చేసేవాళ్లు చాలా తక్కువ శాతంలో ఉండగా, మేజర్‌గా దీపికాని ప్రశంసిస్తూ, ఆమె అందాలను పొగుడుతున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. జనరల్‌గా ఆర్టిస్టులకు విమర్శలు కామన్‌. ఇలాంటి ట్రోల్స్ సర్వసాధారణమే. అవన్ని పట్టించుకుంటే అక్కడే ఆగిపోతారు. వాటిని దాటుకుని ముందుకు సాగితేనే భవిష్యత్‌. దీపికా అదే చేస్తుందని ఆమెని సపోర్ట్ చేసేవాళ్ల కామెంట్. మొత్తానికి దీపిక ఇలా వార్తల్లో నిలవడం గమనార్హం. 
 

77

ఇక `ఢీ` షో 13వ సీజన్‌ ముగింపుకి చేరుకుంది. నేటి ఎపిసోడ్‌లో విన్నర్‌ ఎవరో తేలనున్నారు. ఈ షోకి అల్లు అర్జున్‌ గెస్ట్ గా రావడం విశేషం. ఆయన తనదైన స్టయిల్‌లో సందడి చేశారు. నవ్వులు పూయించారు. పంచ్‌లతో అదరగొట్టారు. 

also read: తన హార్ట్ బ్రేకింగ్‌ విషయాన్ని బయటపెట్టిన శ్రియా.. ఆ బాధలో షూటింగ్‌ చేశానంటూ ఎమోషనల్‌..

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు అదిరిపోయే షాక్.. అరెస్టు చేస్తానన్న ఎస్ఐ, వల్లి ఆనందం
Recommended image2
Rashmika Mandanna : శ్రీవల్లి టు గీతాంజలి.. రష్మిక మందన్న కెరీర్‌లోని ఐకానిక్ లుక్స్ ఇవే!
Recommended image3
Apple Box: సినిమాల్లో పొట్టి హీరోలు పొడుగ్గా కనిపించడానికి ఏం చేస్తారో తెలుసా? ప్రభాస్ కు ఎదురైన వింత పరిస్థితి ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved