Deepika Padukone:బాలీవుడ్ ను ఇరకాటంలో పెట్టిన దీపికా పదుకునే, షాకింగ్ కామెంట్స్ చేసిన బ్యూటీ
బాలీవుడ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే. అసలే హిట్లు లేక, ఇబ్బందుల్లో ఉన్న బీ టౌన్ పై ఓ రాయి విసిరింది బ్యూటీ. ఇంతకీ ఏమంటుందంటే..?
ఆమధ్య సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు నెపొటిజం గొడవలు బాలీవుడ్ ను చుట్టుముట్టాయి. ఆతరువాత కాలంలో మీ టూ అంటూ కాస్టింగ్ కౌచ్ బాధితులు కూడా బయటకువచ్చి గోల చేశారు. ఈ విషయంలో బాలీవుడ్ తో విభేదించి కంగనా, తాప్సీ లాంటివారు పోరాటలాలు కూడా చేశారు.. చేస్తున్నారు కూడా. ఇక నెపొటిజం గొడవలతో స్టార్స్ కిడ్స్ ఎంత ఇబ్బంది పడ్డారో కూడా అందరికి తెలిసిందే. ఈక్రమంలో రాను రాను వివాదం సర్ధు మణుగుతూ వచ్చింది. కాని అప్పుడప్పుడు.. అక్కడక్కడ వాటి తాలూకు వైబ్రేషన్స్ వినిపిసతూనే ఉన్నాయి.
ఈలోపు టాలీవుడ్ బాలీవుడ్ ను మించిపోయి పైకి లేవడం.. మన స్టార్లు పాన్ ఇండియా స్టార్లుగా మారడం.. బాలీవుడ్ కష్టాల్లోకి వెళ్ళిపోవడంతో.. సీన్ రివర్స్ అయ్యింది. అసలేమూలుగుతుంటే.. నెత్తి మీద తాటికాయ పడ్డట్టు.. బాలవుడ్ జనాలే బాలీవుడ్ పై చిన్న చిన్న రాళ్లు విసురుతున్నారు. తాజాగా దీపికా పదుకునే చేసిన వ్యాఖ్యలు నెపోటిజం మంటలు మరోసారిరేపాయి. బాలీవుడ్ లో కష్టపడి పైకి వచ్చినవారిలో సౌత్ నుంచి వెళ్లిన హరోయిన్ దీపికా కూడా ఉంది.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సాధించన దీపికా పదుకొనే వరుసగా భారీ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. కన్నడ సినిమా పరిశ్రమ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన బ్యూటీ.. ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే స్టార్ అయిపొయింది. కానీ అంతకుముందు చాలా సంవత్సరాలు నటిగా మారడానికి కష్టాలు పడింది. వాటి గురించి తాజాగా ఓ ఇంటర్వూలో కూడా వెల్లడించింది బ్యూటీ.
నెపోటిజం ఎక్కువగా ఉన్న బాలీవుడ్ లో ఒంటరిగా వచ్చి హీరోయిన్ గా నిలదొక్కుకొని ఇప్పుడు బాలీవుడ్స్ స్టార్ హీరోయిన్ అయింది దీపికా పదుకొనే. రీసెంట్ గా పఠాన్, జవాన్ సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న దీపికా త్వరలో ప్రభాస్ కల్కి సినిమాతో పాన్ ఇండియా ల దడదడలాడించబతోంది. ఇక బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ను పెళ్ళాడి.. అప్పుడప్పుడూ.. సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది బ్యూటీ.
రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో రణవీర్, దీపికా వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ బాగా వైరల్ అయింది. ఇందులో దీపికా.. తన ప్రేమ, బ్రేకప్ విషయాలన్నీ మాట్లాడింది. తాజాగా దీపికా పదుకొనే ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో బాలీవుడ్ నెపోటిజం గురించి మాట్లాడింది.
Deepika padukone
బాలీవుడ్ లో తమ వారసులకు స్టార్స్ అంతా ఛాన్సులు ఇప్స్తున్నారని, కొత్తవాళ్ళని తొక్కేస్తున్నారని, నెపోటిజం ఎక్కువగా ఉందని రెగ్యులర్ గా ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. బాలీవుడ్ నెపోటిజంపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉంటాయి. ఈ వియంలో దీపికా మాట్లాడుతూ.. ఇరవై ఏళ్ళ క్రితం నాకు సినిమాలు తప్ప ఇంకో మార్గం లేదు అనుకోని వచ్చాను. అప్పట్లో అవకాశాలు రావడం చాలా కష్టం. నా పేరెంట్స్ సినీ పరిశ్రమకు చెందిన వారు కాదు. నాకు సినీ పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్లు లేరు అన్నారు.
అసలు బాలీవుడ్ అంటేనే వారసులు ఎక్కువ.. సినీ కుటుంబంలోని పిల్లలకే ఛాన్సులు దక్కేవి. దీన్నే ఇప్పుడు నెపోటిజం అంటున్నారు. అది అప్పుడు కూడా ఉంది .. ఇప్పుడు కూడా ఉంది. ఎప్పటికి ఉంటుంది. నెపోటిజం అందరూ అంగీకరించాల్సిందే అని చెప్పింది.ఇక దీపికా పదుకొనే బాలీవుడ్ పై చేసిన నెపోటిజం కామెంట్స్ సంచలనంగా మారాయి.