- Home
- Entertainment
- బాడీని విల్లులా వంచి యోగా భంగిమలతో చెమటలు పట్టిస్తున్న ప్రభాస్ హీరోయిన్.. ఆ యాంగిల్స్ చూస్తే మైండ్ బ్లాకే
బాడీని విల్లులా వంచి యోగా భంగిమలతో చెమటలు పట్టిస్తున్న ప్రభాస్ హీరోయిన్.. ఆ యాంగిల్స్ చూస్తే మైండ్ బ్లాకే
ప్రభాస్ హీరోయిన్ దీపికా పదుకొనె హాట్ హాట్ వర్కౌట్స్ తో కనువిందు చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో అత్యంత క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ అందాల భామ లేటెస్ట్ గా యోగా భంగిమలతో ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తుంది.

దీపికా పదుకొనె(Deepika Padukone) తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్(Prabhas)తో కలిసి ఆమె `ప్రాజెక్ట్ కే` (Project K)చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్ లవ్ ఇంట్రెస్ట్ గా దీపికా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. దీపికా పదుకొనె తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తతో టాలీవుడ్ ఆడియెన్స్ తోపాటు ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతుంది. ఈ టాలెంటెడ్ బొమ్మని చూడాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న దీపికా పదుకొనె తాజాగా యోగా ఫోటోలను పంచుకుంది. ఇందులో గ్రే కలర్ టైట్ ఫిట్ డ్రెస్ ధరించింది. యోగా దుస్తుల్లో మెరిసిన ఆమె యోగా భంగిమల్లో ఫోటోలకు పోజులిస్తూ కనువిందు చేస్తుంది. యోగా చేస్తున్న సమయంలో వివిధ భంగిమలు చేసే క్రమంలో దిగిన పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. Deepika Padukone Yoga Photos.
హాట్ భంగిమల్లో దీపికా పదుకొనె చేసే యోగా నెటిజన్లని, ఆమె అభిమానులను కనువిందు చేస్తున్నాయి. చూపుతిప్పుకోనివ్వడం లేదు. బాడీని విల్లులా వంచి ఆమె చేసిన యోగా మైండ్ బ్లాంక్ చేస్తుంది. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్ రైజ్ చేస్తుంది. ప్రస్తుతం దీపికా ఫోటోలు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నాయి.
బాలీవుడ్ భామలు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. టాలీవుడ్‌లో రాణించేందుకు క్యూ కడుతున్నారు. హిందీకి ధీటుగా టాలీవుడ్ ఎదుగుతున్న నేపథ్యంలో ఇక్కడ రాణించేందుకు నార్త్ భామలు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా దీపికా పదుకొనె సైతం సౌత్ పై ఫోకస్ పెట్టినట్టుంది. ఆమె ప్రభాస్‌తో పాన్ ఇండియా చిత్రంలో రొమాన్స్ చేయబోతుంది. ఇందులో దిశా పటానీ మరో హీరోయిన్ కావడం విశేషం.
మరోవైపు బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది దీపికా. ఆమె నటించిన `పద్మావత్` చిత్రం ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో భాగమవుతుంది. ఇటీవల ఆమె `గెహ్రైయాన్` చిత్రంలో బోల్డ్ రోల్ చేసింది. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అంతకు ముందు `83`లో మెరిసింది.
ప్రస్తుతం `ప్రాజెక్ట్ కే` చిత్రంతోపాటు `సర్కర్`, `పఠాన్`, `ఫైటర్` చిత్రాల్లో నటిస్తుంది. దీపికా చేస్తున్న నాలుగు సినిమాలు భారీ చిత్రాలు కావడం విశేషం. దీపికా పదుకొనె ఈ సారి కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేయబోతుంది. 2017 నుంచి ఆమె ఇండియా నుంచి కేన్స్ లో రెడ్‌కార్పెట్‌పై వాక్ చేస్తూ కనువిందు చేస్తుంది. ఈ సారి సైతం ఆమె మెరవబోతుంది. ఇప్పటికే ఆమె కేన్స్ కి చేరుకున్నట్టు టాక్.
ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలిచే దీపికా పదుకొనె.. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగానూ నిలిచింది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక మొత్తం హాలీవుడ్‌కే పరిమితం కావడంతో, ఇక బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా దీపికా రాణిస్తుండటం విశేషం. ఆమె 2018లో హీరో రణ్‌వీర్ సింగ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విసయం తెలిసిందే.