MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక్క పోస్ట్ తో కోట్లు సంపాదిస్తున్న అందాల భామలు దీపికా, అలియా, కత్రినా, ప్రియాంక, దిశా, జాన్వీ.. వామ్మో..

ఒక్క పోస్ట్ తో కోట్లు సంపాదిస్తున్న అందాల భామలు దీపికా, అలియా, కత్రినా, ప్రియాంక, దిశా, జాన్వీ.. వామ్మో..

సోషల్‌ మీడియా సెలబ్రిటీలకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా హీరోయిన్లకిది సంపాదన వనరుగా మారింది. సామాజిక మాధ్యమాలతో అందాల భామలు కోట్లు సంపాదిస్తున్నారు. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నారు.   

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 13 2022, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సోషల్‌ మీడియా హీరోయిన్లకి ఆదాయ వనరుగా మారింది. వీరంతా నిత్యం అందాల ఫోటోలు పంచుకుంటూ తమ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంటారు. నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంటారు. కానీ ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫోటోలకు పోజులిస్తూ,అందాలను నెటిజన్లకి ఎరగా వస్తున్నారు. వారిని నిత్యం ఎంగేజ్‌ చేస్తున్నారు. అయితే వీటి వల్ల ఏంటీ ప్రయోజనం అనుకునే వాళ్లు చాలా మందే. అభిమానులైతే హీరోయిన్ల అందాలు చూడటానికి పరిమితం అవుతుంటాయి. కానీ వారు ఫోటోలు పంచుకోవడం వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో తెలియదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా అకౌంట్ల ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. కోట్లు గడిస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

హీరోయిన్లు తమ సోషల్‌ మీడియా అకౌంట్ల ఫాలోవర్స్ ఎంత పెరిగితే అంత ఎక్కువ డబ్బు వస్తుండటం విశేషం. వీరికి మిలియన్స్ ఫాలోవర్స్ ఉండటంతో కమర్షియల్‌ యాడ్స్ వస్తుంటాయి. హీరోయిన్లు కమర్షియల్‌ యాడ్లని ప్రమోట్‌ చేస్తూ పోస్ట్ లు పెడుతుంటారు. ఆ పోస్ట్ వెనకాల కోట్ల లావాదేవీలు జరుగుతుండటం విశేషం. మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్లు ఒక్కో పోస్ట్ కి కోటికి పైగా పారితోషికం అందుకుంటుండటం విశేషం. దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌, అలియాభట్‌, అనుష్క శర్మ, దిశా పటానీ, కియారా అద్వానీ, జాన్వీ కపూర్‌, కృతి సనన్‌, అనన్య పాండే వంటి కథానాయికలు ఒక్కో పోస్ట్ ఎంత తీసుకుంటున్నారో తెలుసుకుందాం. 
 

310

బాలీవుడ్‌ని ఓ ఊపుఊపేస్తూనే తెలుగులోకి ప్రభాస్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొనె. ఆమె `ప్రాజెక్ట్ కే`లో హీరోయిన్‌గా నటిస్తుంది. పాన్‌ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ భామకి ఇన్‌స్టాగ్రామ్‌లో 67.2మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా, ఒక్క కమర్షియల్‌ పోస్ట్ కి కోటీ యాభై లక్షలు రెమ్యూనరేషన్‌ తీసుకుంటుండటం విశేషం.

410

ఇక గ్లోబల్‌ బ్యూటీకి పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 79.2మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా, ఆమె ఒక్కో పోస్ట్ కి కోటీ ఎనబై లక్షలు పారితోషికం తీసుకుంటుందని టాక్‌. 
 

510

అలాగే ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌`తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన అలియాభట్‌ సైతం భారీగానే తీసుకుంటుంది. ఈ అమ్మడికి 66.3 మిలియన్స్‌ ఇన్‌స్టా ఫాలో వర్స్ ఉండగా, కోటీ రూపాయలు ఒక్కో పోస్ట్ కి తీసుకుంటుందని సమాచారం. 

610

తెలుగులో `మల్లీశ్వరి` చిత్రంతో ఆకట్టుకున్న కత్రినా కైఫ్‌కి ఇన్స్టాగ్రామ్‌లో 65.1 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా, ఆమె ఒక్కో కమర్షియల్‌ పోస్ట్ కి కోటీ ఇరవై ఐదు లక్షలు డిమాండ్‌ చేస్తుందట. 
 

710

కోహ్లి వైఫ్‌, స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మకి ఇన్‌స్టాలో 58.9 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ఒక్కో కమర్షియల్‌ పోస్ట్ కి కోటీ రూపాయలు తీసుకుంటుందట. భర్త టీమిండియా మాజీ కెప్టెన్‌ కావడంతో ఈ భామకి భారీ డిమాండ్‌ ఉందని చెప్పొచ్చు. 
 

810

తెలుగులో `భరత్‌ అనే నేను`, `వినయ విధేయ రామ` చిత్రాలతో ఆకట్టుకున్న కియారా అద్వానీకి 23.5 మిలియన్స్ ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు ఒక్కో పోస్ట్ కి 70-8-లక్షలు తీసుకుంటుందట. మహేష్‌తో `వన్‌ నేనొక్కడినే` చిత్రంలో నటించిన కృతి సనన్‌ ఇప్పుడు `ఆదిపురుష్‌`లో చేస్తుంది. ఆమె 49.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా, ఒక్కో పోస్ట్ కి 60-70లక్షలు తీసుకుంటుందట.

910

తెలుగులో `లోఫర్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన దిశా పటానీ బాలీవుడ్‌లో హాట్‌ బాంబ్‌గా పేరుతెచ్చుకుంది. ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 51.7 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా, ఒక్కో కమర్షియల్‌ పోస్ట్ కి 80లక్షలు తీసుకుంటుందని బాలీవుడ్‌ టాక్‌. అలాగే బెబో కరీనా కపూర్‌కి కేవలం 9.2 మిలియన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలో వర్స్ ఉన్నారు. కానీ ఆమె కూడా ఎనభై లక్షల వరకు తీసుకుంటుందట. 
 

1010

మరోవైపు యంగ్‌ బ్యూటీస్‌ జాన్వీ కపూర్‌, అనన్య పాండే, సారా అలీ ఖాన్‌లకు కూడా సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. జాన్వీకి 17.3 మిలియన్స్ ఫాలోవర్స్, అనన్యకి 22.7 మిలియన్స్, 40.3 మిలియన్స్‌ ఫాలోవర్స్ ఉండగా, వీరు బ్రాండ్‌ని బట్టి యాభై లక్షల లోపు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇలా సోషల్‌ మీడియా ద్వారా భారీగానే సంపాదిస్తున్నారీ అందాల ముద్దుగుమ్మలు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: ముక్క లేకుంటే ముద్ద దిగదు.. పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి, పవర్ స్టార్ జీవితాన్ని మార్చిన మాట ఏదో తెలుసా?
Recommended image2
Bigg Boss 10: మూడో వారం ఓటింగ్‌, డేంజర్‌ జోన్‌లో సంచలన కంటెస్టెంట్‌.. కావాలనే తొక్కేస్తున్నారా?
Recommended image3
Roja Selvamani: పరంజ్యోతి ఎపిసోడ్ మొత్తం ఫేకా ? నాకు బాగా ఉపయోగపడింది, నిజాలు బయటపెట్టిన రోజా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved