MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: మోనిత మీద అనుమానం పెంచుకుంటున్న డాక్టర్ బాబు.. వంటలక్క ప్లాన్ హిట్టాయ్యిందిగా?

Karthika Deepam: మోనిత మీద అనుమానం పెంచుకుంటున్న డాక్టర్ బాబు.. వంటలక్క ప్లాన్ హిట్టాయ్యిందిగా?

Karthika Deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 1వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. 

5 Min read
Author : Navya G
| Updated : Oct 01 2022, 08:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. కార్తీక్ దుర్గతో, మోనిత దగ్గర స్నేహితుడు అంటున్నావు కదా అయితే తన కోపం గురించి నీకు తెలిసే ఉంటుంది కదా. దగ్గరగా ఉన్న వాళ్ళతోనే మనం కోపం చూపిస్తాము అలాగని మనం వాళ్ళని వదిలి ఉండలేము కదా! నీ బిజినెస్ పని అయ్యేంతవరకు ఇక్కడే ఉండు. వెళ్లి లగేజ్ తెచ్చుకో అని కార్తీక్ చెప్తాడు. అప్పుడు దీప కూడా, మోనిత మా మీద కూడా ఇలాగే కోపం ప్రదర్శిస్తుంది కానీ మేము పట్టించుకోము అని చెప్తుంది. దాని తర్వాత అందరూ వెళ్లిపోయిన తర్వాత మోనిత దీపతో, ఇదంతా నీ పనే కదా నువ్వే దుర్గ ని తెప్పించావు కదా! ఇద్దరు ఏం నాటకాలు ఆడుతున్నారు అని అడగగా, నీ సన్నిహితుని,నీ స్నేహితుని నేనెందుకు తెస్తాను. ఏమో డాక్టర్ బాబుకు తెలియకుండా నువ్వే రప్పించావేమో అని అంటుంది. దానికి మోనిత చిరాకు పడుతుంది. ఆ తర్వాత సీన్లో, సౌందర్య హిమలు కారులో వెళ్తూ ఉండగా సౌందర్య హిమతో, సౌర్య లేకపోవడంతో నువ్వు మరీ ఒక్కదానివే అయిపోయావు అని అనగా, నానమ్మ నిజంగా శౌర్య వాళ్ళ పిన్ని, బాబాయ్ లకు శౌర్య ఇష్టమేనా?

28

 లేకపోతే ఇబ్బంది పడుతున్నారేమో అని అనగా, కాదు హిమ వాళ్ళకి ఇష్టమే కానీ ఇక్కడికి వస్తే తను మంచి బతుకు బతుకుతుందని పంపించేస్తారు. అదే సౌర్య భయం కూడా! అయినా మనం చేసిన తప్పు ఆనంద్ ని కలవడానికి ఒక గంట ముందు వెళ్లాల్సింది.అప్పుడు నీకు, ఆనంద్ అయినా తోడుగా ఉండేవాడు అని అనగా, లేదు నానమ్మ మనం లేటుగా వెళ్లి మంచి పని చేసాము. నాకు, సౌర్యకి ఎలాగా అమ్మానాన్నలు లేరు, రారు. కనీసం ఆనంద్ అయిన తన అమ్మ తో ఉంటాడు కదా ఉండనివ్వండి అని అంటుంది. అప్పుడు సౌందర్య,చాలా పెద్ద దానివి అయిపోయావే అని హిమ ను పొగుడుతుంది. ఆ తర్వాత సీన్లో దుర్గ,దీపతో, చూసేవా దీపమ్మ నన్ను చూడగానే అది ఎలా భయపడిందో అని అనగా, ఇది చాలదు దుర్గ నువ్వు ఇక్కడికి వస్తావని అనుకోకుండా మొదటి అడుగులో అది భయపడింది.

38

 అంతే తర్వాత మనం దాన్ని ఏమీ చేయము అని తనకి తెలుసు. ఈ భయంతో కొత్త ఆలోచనలు వస్తాయి ఏమో అని అనగా, మరి ఇప్పుడు ఏం చేద్దాము అని దుర్గ దీప ని అడుగుతాడు. అప్పుడు దీప, ముల్లుని ముల్లుతోనే తీయాలి అని చెప్పి దుర్గకి ఒక పథకం చెప్తుంది. అప్పుడు దుర్గ, సరే నేను వెళ్లి అమలుపరుస్తాను ఈ లోపల నువ్వు వంటలు చేసి తీసుకొని రా అని అంటాడు. ఆ తర్వాత సీన్లో మోనిత తన ఇంట్లో కూర్చుని, దుర్గ ఇప్పుడే వచ్చాడంటే కార్తీక్ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటాడేమో అదే వాళ్ళ ప్లాన్ అయ్యుంటుందేమో!కార్తీక్ కి  ఏదో ఒకటి చెప్పి దుర్గని పంపించేయాలి అని అనుకుంటుంది.ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి, అయినా తన్ని ఎందుకు అలా అవమానించావు మోనిత అని అడుగుతాడు. ఇంతలో దుర్గ అక్కడికి వస్తాడు.అప్పుడు కార్తీక్, రండి మీ గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటాడు.

48

మీ స్నేహితుడు వచ్చాడు కదా ఒక స్పెషల్ వంట చెయ్యు మోనిత అని అనగా దుర్గ,నేను హోటల్ కి వెళ్ళిపోతాను సార్ అని అంటాడు. ఇప్పుడు మోనిత నిన్ను ఏమీ అనలేదు కదా అని కార్తీక్ అనగా, లేదు సార్ తన వంట నేను సంవత్సరం తిన్నాను మీరు నాలుగేళ్లు తిని అలవాటైపోయినట్టున్నది, నావల్ల కాదు. అప్పుడు కూడా ఇంతే బలవంతంగా ఉప్పు ఎక్కువ చేసి, ఉడకని వంటలు చేసేది అని అనగా కార్తీక్ ఆశ్చర్యపోతాడు.ఒక సంవత్సరం పాటు తినకు వండి పెట్టావా మోనిత అయినా నేను ఈ మధ్య వంటలకు భోజనానికి అలవాటు పడిపోయాను అని కార్తీక్ అంటాడు. నేను కూడా పక్కన వంటలక్క కి భోజనం తెమ్మని చెప్పాను అని దుర్గ అనగా, మంచి పని చేశావు అని కార్తీక్ అంటాడు. ఇంతలో దీప అక్కడికి వస్తుంది. అప్పుడు కార్తీక్ దీపతో, తెలుసా వంటలక్క, మోనిత దుర్గకు సంవత్సరం పాటు వండిపెట్టిందట అని అంటాడు. అలాగా డాక్టర్ అమ్మ అని దీప అంటుంది. ఇంతలో మోనిత,నేను వండలేదు కార్తీక్ అని అనగా దుర్గ, అయితే గతంలో జరిగిన విషయాలను ఇప్పుడు గుర్తు చేయనా మోనిత.

58

 కార్తీక్ సార్ ముందు మాట్లాడితే బాగుంటుందా! ఇంక దీన్ని ఎప్పుడూ కార్తీక్ గారికి గుర్తు చేయద్దు తట్టుకోలేరు అని చెప్తుంది. దానికి మోనిత భయపడిపోతుంది.ఇంతలో దుర్గ రండి వెళ్లి భోజనం చేద్దాము అని అందరినీ తీసుకెళ్తాడు. అప్పుడు మోనిత,దీప ను బయటకు తీసుకువచ్చి,నువ్వు దుర్గ కలిసి ఏం ప్లాన్ చేశారో అని అనగా, మేమేమీ ప్లాన్ చేయలేదు నువ్వే అన్నావు కదా నువ్వు డాక్టర్ బాబు వాళ్ళ వైఫర్ అని వైఫ్, లవర్ అని అందుకే జరిగిన విషయమంతా డాక్టర్ బాబుకు చెప్పే అప్పటికైనా నీ భయం తగ్గుతుంది అని అనగా, నేను అలా చెప్తాను అని ఎలా అనుకుంటున్నావు. ఇలాంటి దుర్గ లు వంద మంది వచ్చినా కార్తీక్ ని నన్ను విడదీయలేరు అని అనగా, నీకు ఇంకేం దారి లేదు మోనిత నిజం చెప్పే అని దీప అంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి, ఏం నిజమో అని అనగా, ఏమి లేదు కార్తీక్ అని మోనిత అంటుంది. 

68

అప్పుడు దీప, అలా కాదు డాక్టర్ అమ్మ నేను చెప్తాను అని చెప్పి కార్తీక్ తో, ఇందాక ఆ సార్ వచ్చారు కదా అప్పటినుంచి డాక్టర్ అమ్మ చాలా భయపడి పోతుంది. మీతో ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పమనండి లేకపోతే లేనిపోని అపార్థాలు వస్తాయి కదా అని అనగా, ఏదైనా చెప్పాలంటే చెప్పు అని కార్తీక్ అంటాడు. ఏమీ లేదు కార్తీక్ అని మోనిత అనగా, మరి ఎందుకు ఆ టెన్షను.నీ మాటలు చాలా వింతగా ఉన్నాయి అని కార్తీక్ అంటాడు.అప్పుడు మోనిత,ఏం లేదని చెప్తున్నాను కదా అని చెప్పి కార్తీక్ ని లోపలికి తీసుకెళ్లి పోతుంది. ఆ తర్వాత సీన్లో దీప ఇంటి ఎదురుగా దుర్గ కూర్చొని ఉంటాడు. అప్పుడు దీప, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు దుర్గా అక్కడే ఉన్నావ్ అనుకున్నాను అని అనగా, లేదు దీపమ్మ దాన్ని రెస్ట్ తీసుకోవడం కొంచెం సమయం ఇచ్చాను అని అంటాడు దుర్గ.తనకి రెస్ట్ ఉండకూడదు వారం రోజుల్లో తనకి భయమేసి డాక్టర్ బాబు దగ్గరకి వెళ్లి తనంతట తానే నిజం చెప్పేలా చెయ్యాలి.నన్ను పరాయి మగాడి వెనకాతల పడుతున్న అమ్మాయి లాగా ఎలాగ డాక్టర్ బాబు ముందు ముద్ర వేసిందో, తనకి  కూడా అలాగే ముద్రపడాలి అని అనగా, ఇప్పుడు నుంచి డోస్ పెంచుతా దీపమ్మ అని చెప్పి దుర్గ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

78

మరోవైపు మోనిత ఇంట్లో, దుర్గ ఇలాగే ఉంటే కార్తీక్ కి మా మీద అనుమానం వస్తుంది ఎలాగైనా దుర్గని పంపించాలి అని అనుకుంటుంది.ఇంతలో దుర్గ అక్కడికి వస్తాడు. ఏంటి బంగారం అని దుర్గ మోనిత తో అనగా, ఎవరు రా బంగారం నువ్వు దీప కలిసి ప్లాన్ వేసి నన్ను కార్తీక్ ని విడగొట్టాలని చూస్తున్నారా! అది జరగదు అని అంటుంది. అప్పుడు దుర్గ, మోనిత చేయి పట్టుకొని, అలా కాదు బంగారం ఎందుకంత కోపం అని అంటాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి దుర్గ మోనిత చేయి పట్టుకోవడం చూస్తాడు. ఇంతలో దుర్గ, కోపం పోవాలని బుజ్జగించడానికి చేయి పట్టుకున్నాను సార్ అని చెప్పి, నేను ఇంతవరకే మేనేజ్ చేశాను.తర్వాత నువ్వే మానేజ్ చేయని కావాలని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మోనిత కార్తీక్ దగ్గరికి వెళ్లి అలా కాదు కార్తీక్ అని అంటుంది. శివ ఎక్కడున్నాడు అని కార్తీక్ అనగా, బయటకి వెళ్ళినట్టు ఉన్నాడు అని  అంటుంది.

88

మోనితంముందు జాగ్రత్తగా శివ ని కూడా బయటికి పంపించేసావా అని కార్తీక్ చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. అప్పుడు కోపంతో మోనిత పక్కన ఉన్న బట్టలన్నీ కింద పారేస్తుంది. అప్పుడు కార్తీక్ దీప దగ్గరికి వస్తాడు. మనసేం బాలేదు వంటలక్క అని అనగా ఏమైంది డాక్టర్ బాబు అని దీప అడుగుతుంది. వద్దు చెప్పడానికి నాకే అసహ్యంగా ఉన్నది అని కార్తీక్ అంటాడు.అప్పుడు దీప, మీరు నాతో ఏమైనా చెప్పొచ్చు డాక్టర్ బాబు మీకు ఇబ్బందిగా ఉంటే వద్దు అని అంటుంది. అప్పుడు కార్తీక్ నువ్వేం అనుకోవద్దు మరి చెప్తున్నాను అని అనగా ఇంతలో శివ అక్కడికి వచ్చి నన్ను పిలిచారట సార్ అని అంటాడు. ఇందాక ఏదో పిల్చుంటాను శివ ఇప్పుడేం అవసరం లేదు అని కార్తీక్ అంటాడు. అప్పుడు శివ, ఐతే రండి సార్ మనం బయటికి వెళ్దాము. మేడం మిమ్మల్ని రెండు గంటలు బయటకు తిప్పి రమ్మన్నారు అని అనగా కార్తీక్ ఆశ్చర్యపోతాడు.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Hansika Divorce: తప్పుడు రైలు ఎక్కడం కంటే దిగిపోవడమే మంచిది.. విడాకులపై హన్సిక
Recommended image2
జేడీ చక్రవర్తి హీరోగా క్షుద్రపూజల నేపథ్యంలో 'చేతబడి' మూవీ.. టైటిల్ తోనే అంచనాలు పెంచేశారుగా
Recommended image3
Illu Illalu Pillalu:మొన్న ప్రేమ, ఇప్పుడు నర్మద.. ఇల్లు ఇల్లాలు సీరియల్ నుంచి ఔట్, ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved