Karthika Deepam: కార్తీక్, శౌర్య ఒకేచోటు.. షాక్ లో మోనిత.. బాధలో వంటలక్క!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 7వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో... కార్తీక్, మోనితని ఇంటికి తీసుకువస్తాడు. మోనిత చాలా నీరసంగా మంచం మీద కూర్చుని ఎదురింటికి వెళ్తానని అంటుంది. అప్పుడు కార్తీక్, మళ్లీ ఎదురింటికి వెళ్లేందుకు ఏం అవసరం లేదు మళ్లీ ఇడ్లీలు తింటావా అని అడుగుతాడు. అప్పుడు మోనిత,తను నాకు అంత పని చేస్తాది అని అనుకోలేదు అని నటిస్తుంది. ఇంతలో శివ మీరు ఇచ్చిన వార్నింగ్ కి ఎదురింట్లో తాళం పడిపోయింది సార్ అని అంటాడు.
అప్పుడు మోనిత, తన కోసం కార్తీక్ దీపని పరాయి స్త్రీ ల చూసి వార్నింగ్ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతుంది. అప్పుడు మోనిత మనసులో, దీపా నువ్వు ఏదో కొత్త ప్లాన్ తో వస్తావని నాకు తెలుసు. కానీ అప్పటికి మేము ముంబై చెక్కేస్తాము కదా అని ఆనందపడిపోతుంది. ఆ తర్వాత సీన్లో హిమ, శౌర్య ఫోటో చూసి హ్యాపీ బర్త్డే సౌర్య అని అంటుంది. అప్పుడు సౌందర్య, ఆనందరావు అక్కడికి వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. అప్పుడు హిమ, ఈరోజు నా పుట్టినరోజు కదా నా కోసం నాలుగు గంటలు సమయం కేటాయించండి. మనం ఫ్లైట్ మీద సౌర్య దగ్గరికి వెళ్లి గిఫ్ట్ ఇద్దాము.
అప్పుడైనా సౌర్య మనసు మారుతుంది అని అనగా సౌందర్య, శౌర్య మనసు ఇప్పుడు అప్పుడే మారదమ్మ. నీకు ఈ పుట్టినరోజు ఘనంగా జరగకపోయినా పర్లేదు ఏ బాధ మిగలకుండా ఉంటే చాలు. అనాధ శరణాలయంకి వెళ్దాం అనుకున్నాం కదా అక్కడికి వెళ్దాము అని అంటాడు. ఆ తర్వాత సీన్లో దీప, గుడికి వచ్చి పిల్లలు ఇద్దరు పుట్టిన రోజు సందర్భంగా పూజారి చేత అర్చన చేయించి,మేము లేకుండా పిల్లలు పుట్టిన రోజు జరుపుకుంటున్నారో, లేదో?. వాళ్లు ఆనందంగా గడపాలి, ఈ సమస్యలన్నీ తీరిపోయి మళ్లీ మేము అందరం పూర్వ వైభవాన్ని అనుభవించాలి అని వేడుకుంటుంది.
ఆ తర్వాత సీన్లో హిమ, ఆనందరావు, సౌందర్య, కారులో వెళ్తుండగా హిమ మళ్ళీ సౌర్య దగ్గరికి తీసుకు వెళ్ళమని అడుగుతుంది. అప్పుడు సౌందర్య,ఒకసారి చెప్తే వినమ్మా,అక్కడికి వెళ్తే ఎప్పటికీ మర్చిపోలేని భయంకరమైన రోజవుతుంది. అన్ని బాగుంటే వచ్చే సంవత్సరం ఇద్దరం కలిసి పుట్టిన రోజు చేసుకోండి అని అంటుంది. ఆ తర్వాత సౌర్య, వారణాసి తో కలిసి గుడికి వచ్చి,ఈ రోజు నా పుట్టిన రోజు వారణాసి అని అంటుంది.
అప్పుడు వాళ్ళిద్దరూ గుడి లోపలికి వెళ్తారు. అప్పుడు సౌర్య, మా అమ్మ నాన్నలు ఎక్కడున్నానో కనిపించేలా చూడు స్వామి అని వేడుకుంటుంది. అదే సమయంలో దీప కూడా అదే గుడిలో ఉంటుంది. అంతలో కార్తీక్,మౌనిత ఇద్దరూ ఆ గుడికి వస్తారు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని కార్తీక్ అడగగా,నువ్వు దీపతో మాట్లాడను అని నాకు దేవుడి మీద ఒట్టేసి చెప్పు కార్తీక్, నాకు నమ్మకం లేదు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను కార్తీక్ అని అంటుంది. కార్తీక్, ఈ కాలంలో కూడా ఏం చేస్తున్నావు మోనిత? అసలే నాకు ఏ విషయం గుర్తుండదు.ఇప్పుడు ప్రమాణం చేసినట్టు కూడా మర్చిపోతాను అని మారం చేస్తూ ఉండగా మోనిత బలవంతంగా తీసుకువెళ్తుంది.
మోనిత కార్తీక్ నీ బలవంతం గా లోపలికి తీసుకువెళ్లడం చూసి దీప అక్కడికి వస్తుంది. మీరు నాతో మాట్లాడకూడదు అన్నంత తప్పు నేను చేయలేదు డాక్టర్ బాబు. కావాలంటే నేను దేవుడి మీద ఒట్టేస్తాను అని దేవుడి మీద ప్రమాణం వేస్తుంది దీప. అప్పుడు మోనిత,ఇలా తప్పుచేసి ప్రమాణం చేయడం అలవాటే కదా అని అంటుంది. అయితే నీకు నిన్న ఒంట్లో బాలేదు, హాస్పిటల్ కి నిజంగానే ఫుడ్ పాయిజన్ అయ్యి వెళ్ళినట్టు నువ్వు ప్రమాణం చేయు అని అంటుంది దీప.
అప్పుడు కార్తీక్ కూడా అని అనగా అదే సమయం లో మోనిత, సౌర్యను చూస్తుంది. శౌర్య ఏంటి ఇక్కడున్నాది? దీప కి శౌర్య వచ్చినట్టు తెలుసా? మొన్న ఆంటీ, అంకుల్ వచ్చారు. ఇప్పుడు సౌర్య కనిపించింది, ఈ దీపా వెనకాతలే ఉంటుంది. అన్ని దిక్కులు మూసుకుపోయాయి. వెంటనే ఈ ఊరు నుంచి చెక్కేయాలి అని అనుకుంటుంది. అప్పుడు కార్తీక్ అటువైపు ఏం చూస్తున్నావ్ మోనిత అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!