ఓటీటీలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియో... అన్ని కోట్లకు భారీ డీల్?
ప్రముఖ ఓటీటీ సంస్థ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియో స్ట్రీమ్ చేయనుందని సమాచారం. ఇందుకు గానూ కోట్లలో డీల్ కుదిరిందట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఇటీవల కొత్త ట్రెండ్ మొదలైంది. పెళ్లి వంటి శుభకార్యంతో కూడా సెలెబ్రిటీలు వ్యాపారం చేస్తున్నారు. పెళ్లి ఫోటోలు, వీడియోలతో పాటు ప్రసార హక్కులను అమ్మేసుకుంటున్నారు. గత ఏడాది నయనతారతో దర్శకుడు విగ్నేష్ శివన్ వివాహం జరిగింది. నెట్ఫ్లిక్స్ సంస్థకు నయనతార దంపతులు తమ పెళ్లి వీడియో, ఫోటోల హక్కులు అమ్మేశారు.
photo credit - hotc
నయనతార పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో నెట్ఫ్లిక్స్ ప్రతినిధులు ఫైర్ అయ్యారు. నయనతార దంపతుల మీద చర్యలకు పాల్పడే ప్రయత్నం చేశారు. నయనతార పెళ్లి వీడియో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ కల్చర్ టాలీవుడ్ కి కూడా పాకింది సమాచారం. వరుణ్-లావణ్యల పెళ్లి వీడియో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుందట.
ఇందుకు కోట్లలో డీల్ జరిగిందట. వరుణ్-లావణ్యల పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కుల కోసం ఏకంగా రూ. 10 కోట్లు చెల్లించారని టాలీవుడ్ టాక్. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. పది కోట్లు అంటే... పెళ్లి ఖర్చు మొత్తం కవర్ అయినట్లే.. ఇటలీలో జరిగిన పెళ్లి వేడుకలకు నాగబాబు రూ. 10 కోట్ల వరకు ఖర్చు చేశాడట.
వరుణ్ తేజ్ కొణిదెల వారి అబ్బాయి కావడంతో మెగా హీరోలందరూ హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ సందడి చేసిన ఈ పెళ్లి వేడుక టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. వరుణ్-లావణ్యల పెళ్లి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పెళ్లి అనంతరం నవంబర్ 5న హైదరాబాద్ వేదికగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
2017లో దర్శకుడు శ్రీను వైట్ల మిస్టర్ టైటిల్ తో మూవీ చేశారు. ఈ చిత్రంలో వరుణ్-లావణ్య జంటగా నటించారు. ఆ సినిమా సెట్స్ లో మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది. అనంతరం అంతరిక్షం టైటిల్ తో మరో మూవీ చేశారు. ఐదేళ్లకు పైగా ప్రేమించుకున్న లావణ్య-వరుణ్ పెళ్లితో ఒకట్టయ్యారు.