MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కీర్తి సురేష్ కి కాబోయే భర్త ఇతడేనా..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటో!

కీర్తి సురేష్ కి కాబోయే భర్త ఇతడేనా..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటో!

స్టార్ లేడీ కీర్తి సురేష్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ అని చెప్పాలి. ఈ మధ్య కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ఎక్కువైపోయాయి. తాజాగా కీర్తి సురేష్ కి కాబోయేవాడంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 17 2023, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Keerthy Suresh

Keerthy Suresh


కీర్తి సురేష్ థర్టీ ప్లస్ లో అడుగుపెట్టారు. దీంతో కీర్తి పెళ్లి మేటర్ జోరందుకుంది. తరచుగా కీర్తి వివాహమంటూ కథనాలు వెలువడుతున్నాయి. కీర్తి సురేష్ ఓ వ్యక్తితో సన్నిహితంగా కనిపించారు. ఆ వ్యక్తి పుట్టినరోజు నేపథ్యంలో బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. అతనితో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. 
 

28

ఈ ఫోటో కాస్తా వైరల్ అయ్యింది. కీర్తి అంత ప్రేమ కురిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరని ఆరాతీస్తే అతని పేరు ఫర్హాన్ బీన్ లియాకత్. రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆస్తి అంతస్తు హోదాలో కీర్తికి తగినవాడు. ఫర్హాన్ ని కీర్తి సురేష్ ప్రేమిస్తుండగా పెళ్లి ప్రకటన రానుంది అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తుంది. 
 

38

గతంలో కీర్తి తన క్లాస్ మేట్ ని వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలను కీర్తి సురేష్ తల్లి ఖండించారు. అవన్నీ నిరాధార కథనాలన్నారు. కీర్తి ప్రస్తుతం సింగిల్. ఎవరితో రిలేషన్ లో లేదు. అలాంటిది ఏదైనా ఉంటే కీర్తి మాకు చెబుతుందని ఆమె స్పష్టత ఇచ్చారు. 


 

48

ఇక కీర్తి లేటెస్ట్ మూవీ దసరా సూపర్ హిట్ కొట్టింది. దసరా ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. నాని హీరోగా తెరకెక్కిన దసరా మార్చి 30న విడుదలై మంచి విజయం సాధించింది. మహానటి తర్వాత కీర్తికి ఆ స్థాయి విజయం దసరాతో దక్కింది. 

58
Keerthy Suresh

Keerthy Suresh

కాగా కీర్తి ఈ మధ్య గ్లామర్ షో చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా స్కిన్ షోకి తెరలేపుతుంది. గ్లామరస్ హీరోయిన్స్ కి మైలేజ్ ఎక్కువ. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో రాణించడం అంత సులభం కాదు. అరుదుగా చాలా కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే మడిగట్టుకుని కూడా పరిశ్రమను శాసించారు. కీర్తి సురేష్ బోల్డ్ ఇమేజ్ కోరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.

68
Keerthy Suresh

Keerthy Suresh


సర్కారు వారి పాట మూవీకి ముందు ఆమె బాగా స్లిమ్ అయ్యారు. చెప్పాలంటే సగానికి సగం తగ్గారు. సర్కార్ వారి పాటలో కీర్తి నుండి ఆ తరహా రోల్ ఊహించలేదు. కిలాడీ లేడీగా మహేష్ నే అల్లాడించింది.తాను ఎలాంటి షేడ్స్ ఉన్న పాత్రలైనా చేయగలనని నిరూపించింది. సోషల్ మీడియా వేదికగా కీర్తి చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ వెనుక ఆంతర్యం హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ పోగొట్టుకోవడానికే కావచ్చు. 
 

78


 ఒక ప్రక్కన స్టార్స్ తో చిత్రాలు చేస్తున్న కీర్తి, సిస్టర్స్ రోల్స్ చేయడం కొసమెరుపు. ఈ తరహా ప్రయోగం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. చెల్లెలు పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. 

88


భోళా శంకర్ తో పాటు జయం రవికి జంటగా సైరన్ టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న మామన్నన్ మూవీలో కీర్తి నటిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన కీర్తి ఆ అవకాశాలు వస్తే వదులుకోవడం లేదు. అమెజాన్ ఒరిజినల్ చిన్ని మూవీలో సీరియల్ కిల్లర్ గా అలరించారు.తల్లి వారసత్వాన్ని నిలబెడుతూ కీర్తి స్టార్ గా ఎదిగారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Gedela Raju Review: గేదెల రాజు మూవీ రివ్యూ, రఘు కుంచె లీడ్‌గా చేసిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Jr NTR: నాకు పట్టిన శని వదిలింది అప్పుడే.. తన లైఫ్ పై, ముగ్గురు హీరోయిన్లపై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Rakul: రకుల్ ని అందుకే పెళ్లి చేసుకున్నా, అది ఒక సిట్యుయేషనల్ రిలేషన్‌షిప్‌..భర్త షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved